జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ జి.కిషన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నక్కలగుట్ట : జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ జి.కిషన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనకు నియమించిన ప్రత్యేక అధికారుల సమావేశం శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌స హాలులో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం 5.20లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఇందులో 1.20లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, మిగి లిన దరఖాస్తుల పరిశీలన కూడా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన కు నియమించిన సిబ్బంది ఉదయం 8గంటల లోగా గ్రామాలకు చేరుకోవాలని, రోజుకు 200 దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ సూచిం చారు. ఇలా జిల్లావ్యాప్తంగా రోజుకు 50వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయితే గడువు లోగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు.
నగరంలో...
వరంగల్ నగరంలో లక్షా 80వేల గృహలు ఉండగా లక్షా 45వేల దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ కిషన్ తెలిపారు. ఇందులో 54వేల దరఖాస్తులు పింఛన్లకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, దరఖాస్తుల పరిశీలన సమయంలో సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని, కులం, ఆడ, మగ, భూమి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచిం చారు. అంతేకాకుండా వికలాంగులను సదరం క్యాంపులకు పంపించాలన్నారు.
జిల్లాలోని నగర పంచాయతీలు, మునిసిపాలిటీల్లో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లోని సూపరింటెండెంట్‌లను డిప్యూటేషన్ పంపించాలని డీఆర్వో సురేంద్రకరణ్‌ను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమిబసు, డీఆర్వో సురేంద్రకర ణ్, డీఎఫ్‌ఓ గంగారెడ్డితో పాటు ఆర్‌డీఓలు వెంకటమాధవరావు, వెంకటరెడ్డి, భాస్కర్‌రావు, వరంగల్ బల్దియా అడిషినల్ కమిషనర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.