'మంచి పనులు చేసినా చెప్పుకోలేపోయాం'
హైదరాబాద్: అధికార యంత్రాంగం పనితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ ఐదు రెట్లు పెంచిన తమ ప్రభుత్వానికి మంచి పేరు రాలేదని, పైగా పింఛన్లు అందరికీ ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోందని సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో వాపోయారు. మంచి పనులు చేసినా ప్రభుత్వం చెప్పుకోలేకపోయిందన్నారు.
లబ్దిదారుల గుర్తింపులో ప్రభుత్వ యంత్రాంగం జాప్యం వల్లే చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ప్రభుత్వ సూచనలు, సలహాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ నెల 15లోగా పింఛన్ లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. ఆహారభద్రత కార్డుల లబ్దిదారుల ఎంపిక ఈనెల 30లోగా పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏప్రిల్ వరకు ఎలాంటి బదిలీలు ఉండవని అధికారులకు కేసీఆర్ హామీయిచ్చారు.