collectors meeting
-
చంద్రబాబు చేతులెత్తేశాడా?.. అదన్నమాట సంగతి!
ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంటే ఆయన సర్వజ్ఞుడు అనే ప్రచారం జరుగుతుంటుంది. ఆయనకు ప్రపంచంలోని అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంటుంది అనే అభిప్రాయం ప్రబలింది. అందులోను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటివారి విషయంలో ఇక చెప్పనవసరం లేదు.ఆయన సీఎం హోదాలో ఏమి పలికినా అదో అద్భుతం అని ప్రచారం చేసే మీడియా ఉండడం ప్లస్ పాయింట్. అదే నేత గతంలో ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు కదా అనే ఆలోచన రావడానికి వీలులేదు. సీఎం అయి ఉండి అసంబంద్దంగా మాట్లాడుతున్నట్లు ఉందే అని ఏ అధికారి నోరు తెరిచే పరిస్థితి ఉండదు. చంద్రబాబు అదే వరసలో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్లిపోతుంటారు.2024 శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఆయన అభిప్రాయాలు మారిపోయిన వైనం గమనిస్తే నేతలు ఇంతగా మాట మార్చివేస్తారా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఏపీలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగితే చంద్రబాబుది దాదాపు ఏకపాత్రాభినయమే అని వేరే చెప్పనవసరం లేదు. ఆయా శాఖలకు సంబంధించి ఏ అధికారి ఎలాంటి నివేదిక ఇస్తున్నా, మద్యలోనే జోక్యం చేసుకుని అన్నిటిమీద ఒపినీయన్ ఇచ్చేస్తుంటారు. అవసరమైతే ఆదేశాలు కూడా వెలువడిపోతుంటాయి.ఒకప్పుడు జిల్లా కలెక్టర్ల సమావేశం అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మంచి, చెడు విశ్లేషణ జరిగేది. అధికారులు చర్చలలో పాల్గొనేవారు. కొందరైతే తమ భావాలను నిర్మొహమాటంగా చెప్పేవారు. అసలు జిల్లా కలెక్టర్ల సమావేశం అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రారంభోపన్యాసం, ముగింపు సందేశం ఇవ్వడానికి వచ్చేవారు. మధ్యలో అధికారులు స్వేచ్చగా చర్చలు జరిపేవారు.ప్రభుత్వానికి అవసరమైన సిఫారస్లు చేసేవారు. వాటిలో సీఎం ఏవైనా మార్పులు చేస్తే చేయవచ్చు. మంత్రులు సలహాలు ఇస్తే ఇవ్వవచ్చు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ముప్పై ఏళ్ల క్రితమే ఈ ట్రెండ్ మార్చేశారు. అన్ని తానై వ్యవహరించడం ఆరంభించారు. ప్రతి విషయంలోను అదికారులు చెప్పి, చెప్పకముందే తన సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం అనేది ఆనవాయితీగా అలవరచుకున్నారు. అధికారులు సైతం తమకు ఎందుకులే.. ఆయన చెప్పేదేదో వినిపోతే పోలా అనే పరిస్థితికి వచ్చేశారు. దోమలపై యుద్దం అన్నా, డ్రోన్లతో దోమలను కనిపెడతామని చెప్పినా, అమరావతిలో ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గించాలని ఆదేశాలు ఇస్తున్నానని అన్నా ఎవరూ నోరు మెదపలేరు.ఒకప్పుడు మీడియా అయినా ప్రశ్నలు అడిగేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక 2014లో ఆయన కలెక్టర్ల సమావేశంలో తమ పార్టీవారు చెప్పినట్లు అధికారులు వినాలని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఐదేళ్లపాటు అదే ప్రకారం విభజిత ఏపీని పాలించారు. అప్పుడు కనీసం కొంతమందైనా సీనియర్ నేతలు మంత్రులుగా ఉండేవారు. కానీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అత్యధిక శాతం మంది ఆయన కుమారుడు లోకేష్ అనుచరులే మంత్రులుగా ఉన్నారన్న భావన ఉంది. చంద్రబాబు కన్నా లోకేషే పవర్‌పుల్ అనే అభిప్రాయం నెలకొంది. వీరి వెనుక ఇద్దరు మాజీ పోలీసు అధికారుల హల్చల్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆ సంగతి పక్కనబెడితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆయా సందర్భాలలో వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలు గమనిస్తే, ఏపీని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్నారు కాబోలు అనిపిస్తుంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిపిన కలెక్టర్ల సమావేశంలో ప్రజల సంక్షేమం విషయంలో ప్రాంతం, కులం, మతం, పార్టీ వంటివాటిని చూడకుండా సమానంగా అమలు చేయాలని చెప్పారు. అలాగే ఆయన స్కీములన్నీ అమలు చేస్తుంటే, టీడీపీ మీడియా ఈనాడు, జ్యోతి వంటివి ఏదో రకంగా వంకలు పెడుతూ, అసత్యాలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసేవి. ఎలాగైతేనే ప్రజలు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సూపర్ సిక్స్‌కు ఆకర్షితులై పాలిచ్చే పాడి గేదెను వదలుకున్నట్లుగా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను కూడా ఓడించుకున్నారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసి లబోదిబో అంటున్నారు. అది వేరే విషయం.ఇంతకీ చంద్రబాబు కలెక్టర్లకు ఏమి చెబుతున్నారు. తమది రాజకీయ పాలన అని, ఆ విషయాన్ని అధికారులు గమనించాలని స్పష్టం చేశారు. అంటే ఏమిటి దీని అర్దం! 2014 లో ఉన్న చంద్రబాబుకు, ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్నదానికి తేడా ఏమీ లేదని, ఆయనలో మార్పేమీ రాలేదని తేటతెల్లమవుతోంది కదా! విపక్షంలో ఉన్నప్పుడు ఏమి అనేవారు! ప్రజల ఇళ్లనుంచి చెత్త తీసుకువెళ్లడానికి పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వం అని వైఎస్సార్సీపీపై ధ్వజమెత్తేవారు. అదెంతయా అంటే ఇంటికి మహా అయితే ఏభై నుంచి వంద రూపాయలు. ఆయనతో పాటు పవన్ కల్యాణ్ కూడా యుగళగీతం పాడేవారు.సీన్ కట్ చేస్తే పవన్ కల్యాణ్ పిఠాపురంలో చెత్త తీసుకువెళ్లడానికి జనం నుంచి ఇంకా ఎక్కువే వసూలు చేయాలని చెప్పారట. మరి అప్పుడు చెత్త ప్రభుత్వం అన్నారు కదా అని ఎవరైనా అడిగితే అనే సదేహం రావచ్చు. వైఎస్సార్‌సీపీవారు విమర్శలు చేస్తే చేయవచ్చు. దానిని పట్టించుకోకపోతే సరి! తమ వద్దకు వచ్చేవారు ఎవరు వాటి గురించి నిలదీయరులే అనే ధీమా కావచ్చు. పట్టణాలలో అనేక సంస్కరణలకు తానే ఆద్యుడనని చెప్పుకునే చంద్రబాబు, ఏది ఉచితం కాదు అని అధికారంలో ఉన్నప్పుడు ధీరిని చెప్పే చంద్రబాబు విపక్షంలో ఉంటే మాత్రం అన్నీ ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. అధికారంలోకి రాగానే మొత్తం మారిపోయి, అంతకుముందు మాట్లాడిన విషయాలేవీ గుర్తు లేనట్లు వ్యవహరించడమే ఆయన స్పెషాలిటి.ఈ మద్య ఇండోర్ కమిషనర్‌గా పనిచేసిన ఒక అధికారి సోషల్ మీడియాలో చెప్పిన విషయాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కడ ఎవరూ బయట చెత్త వేయడానికి లేదు. ప్రతి ఒక్క ఇంటివారు 150 రూపాయలు చెల్లించి తమ వద్దకు వచ్చే బండివాడికే ఆ చెత్త అప్పగించాలి అందువల్ల ఇండోర్ అంత నీట్‌గా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో సైతం ప్రతి ఒక్క ఇంటి యజమాని చెత్తకు వంద రూపాయలు చెల్లించవలసిందే. మరి ఇప్పుడు ఏపీలో ఏమి చేస్తున్నది తెలియదు కానీ, చెత్త డబ్బులు వసూలు చేయని పట్టణాలలో దుర్గందం వ్యాపించిందని వార్తలు వచ్చాయి.పిఠాపురంలో చెత్త పన్నుకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కల్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చారట. ఇప్పుడు దానిని ఏ ప్రభుత్వం అనాలో తెలియదు. చెత్తపన్ను వేస్తేనే పెద్ద తప్పు అని అరచి గీపెట్టిన చంద్రబాబు ఇప్పుడు తన ప్రభుత్వం వేసే ప్రతి రోడ్డుకు టోల్ గేట్ పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే జాతీయ రహదారులపై గూబ గుయ్ అనేలా టోల్ పన్ను వసూలు చేస్తుంటే, ఏపీలో ఇక రాష్ట్రంలో వేసే కొత్త రహదారులు అన్నిటిపై టోల్ వేస్తారట. ఈ మేరకు నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ల సమావేశంలో అధికారులను సీఎం ఆదేశించారు. చెత్త పన్ను వేయడమే తప్పు అయితే మరి ఈ రోడ్డు పన్ను ఏమిటి అని ఈనాడు మీడియా రాయదు. పైగా పీపీపీ మోడల్లో రోడ్ల నిర్మాణం అని ఘనంగా రాసింది. అంటే రోడ్లను వెడల్పు చేసి, రోడ్లను వేసి, తదుపరి వాటి నిర్వహణ అంతా ప్రైవేటువారికే అప్పగిస్తారట.ఇక ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా నిరుత్సాహపరచవద్దని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్ లో ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో అభివృద్ది చేసి, అక్కడ చికిత్సలు సరిపోకపోతే అప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడానికి సిఫారస్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులను పెద్దగా పట్టించుకోబోవడం లేదని పరోక్షంగా చెప్పేశారా అనే ప్రశ్న వస్తోంది. గతంలో విద్యా వ్యవస్థకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లి చదువుకుంటే చాలు, అక్కడ అన్ని సదుపాయాల నిమిత్తం, మధ్యాహ్న భోజనం నిమిత్తం సిబ్బందిని పెట్టారు. మరి వాళ్లంతా ఏమి అయ్యారో కానీ, ఎర్రగొండపాలెం వద్ద ఒక గిరిజన స్కూల్లో అన్నీ పనులు విద్యార్దులే చేసుకోవలసి వస్తోందట.ఈ మార్పులు ఎందుకు వచ్చాయి? స్కూళ్ళను ఏమి చేయాలని అనుకుంటున్నారు. ప్రైవేటు స్కూళ్లకు విద్యార్ధులు వెళ్లేలా ముఖ్యమంత్రే మాట్లాడితే ప్రభుత్వ స్కూళ్లపై ఎవరికి నమ్మకం కలుగుతుంది. పిల్లలందరికి ఇస్తానన్న తల్లికి వందనం ఇవ్వలేదు. పైగా ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన చోట విద్యా వలంటీర్లను పెట్టుకోండని చంద్రబాబు సూచించారట. ఈ వార్తను కూడా ఈనాడు మీడియా గొప్ప విషయంగానే ప్రొజెక్టు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్ లో మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తే ఈనాడు మీడియాకు విధ్వంసంగా కనిపించింది. అదే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ విద్యా వలంటీర్లను పెడుతుంటే ఆహా, ఓహో అంటోంది. ఇంటింటికి వెళ్లి రేషన్ ఇచ్చే విదానాన్ని రద్దు చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఏమైందో తెలియదు.అమరావతిలో రాజధానిలో పేదలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన ఏభైవేల ఇళ్ల స్థలాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రతి నెల పదో తేదీన పేదలకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందట. మరి మిగిలిన రోజులు ఎవరి కోసం పనిచేస్తారన్న సందేహం రావచ్చు. పేదలు గురించి పైకి మాట్లాడుతూ, ధనికుల కోసం టీడీపీ పనిచేస్తుందని అనుకోవచ్చు. పేదల కోసం పదే, పదే పరితపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఘోరంగా జనం ఓడించిన తర్వాత చంద్రబాబు ఆలోచనే కరెక్టేమో! పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కు మంగళం పలికి, ధనవంతుల రియల్ ఎస్టేట్ కోసం పనిచేయడమే బెటర్ అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనుకుంటే తప్పు అవుతుందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తాన..! తందాన తాన!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన కలెక్టర్ల తొలి సమావేశం ఆద్యంతం ముఖస్తుతి.. పరనింద ధోరణిలో సాగింది. పలువురు శాఖాధిపతులు సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడ్డారు. ఆయా శాఖల పనితీరు, కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే క్రమంలో రాజకీయ నేతలను తలదన్నే రీతిలో గత ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు: మీనాప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లకు సూచించారు. గత నాలుగేళ్లలో అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగాయన్నారు. చివరకు ఈ అక్రమ తవ్వకాల విషయంలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారని, అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవలే ఒక అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు. ఇసుక రవాణా కోసం కొంత ఖర్చు అవుతున్నప్పటికీ అది నామమాత్రమేనన్నారు.స్టాక్ యార్డుల్లో దాదాపు 33 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉందన్నారు.⇒ గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం ఆశాజనకంగా లేదని, ఉత్పత్తి పడిపోయిందని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ చెప్పారు. సహకార బ్యాంకుల్లో పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.⇒ అడవుల విస్తీర్ణం పెంపు దిశగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరామ్ కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం జరగలేదన్నారు. ఆ భూములపై పునఃపరిశీలన చేయాలి: సిసోడియాశ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య, ప్రకాశం తదితర జిల్లాల్లో ఫ్రీ హోల్డ్ (యాజమాన్య హక్కులు కల్పించినవి) భూముల రిజిస్ట్రేషన్లు (గిఫ్ట్, సేల్) ఎక్కువగా జరిగాయని, వీటిపై పున:పరిశీలన చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. నిషేధిత జాబితా (22 ఏ) నుంచి అసైన్డ్, చుక్కలు, ఈనాం, షరతులు గల పట్టాల భూములను తొల గించిన తీరును కూడా పరిశీలించాలన్నారు. భూ వివాదాల పరిష్కారం, ఫైళ్ల పరిరక్షణ చాలా ముఖ్యమన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ రికార్డుల దహనం కేసును సిసోడియా ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరో కీలకం పధకం రద్దు!రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్ బియ్యం పథకాన్ని (రేషన్ డోర్ డెలివరీ) రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందన్నారు. ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన నిలపడంతో ప్రజలు అక్కడికి వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన వారు రేషన్ దుకాణానికి వెళ్లలేరా? అనే చర్చ సీఎం సమీక్షలో జరిగింది. ఈ వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొనడంతో ఇంటింటికీ రేషన్ పథకాన్ని రద్దు చేసి వాహనాలు, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి? అనే అంశంపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయంతీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. -
రాజకీయ పాలనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక రాజకీయ పాలనే ఉంటుందని, అధికార యంత్రాంగం అందుకనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక రవాణా వ్యయం ఐదు రెట్లు పెరిగిందని, రవాణా చార్జీలు పెరిగినా తామే పెంచామనుకుంటారని చెప్పారు. సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకుని రవాణా చార్జీలు సైతం చెల్లించవచ్చన్నారు. వినియోగదారుడికి ఇసుక అందినట్లు నిర్థారించుకున్నాకే రవాణా ఛార్జీలు ట్రక్కు యజమానికి విడుదలయ్యే పద్ధతి తెస్తామన్నారు. ఇసుక తరలించే ట్రక్కులను ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఊబరైజేషన్ చేస్తామన్నారు.లారీలు ఇసుక రీచ్‌ల దగ్గరకు వచ్చి రెండేసి రోజులు ఉండకూడదన్నారు. బడి మానేసిన పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలోనూ చేర్పించాలని నిర్దేశించారు. రోడ్లు అన్నీ పీపీపీ విధానంలోనే నిర్మాణం చేపట్టాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్నకు ఆకాశమే హద్దని, అమరావతిలో ప్రత్యేకంగా ఒక పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.రోడ్ల నిర్వహణను 50 కి.మీ. చొప్పున అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలనూ అవుట్ సోర్సింగ్‌కు అప్పగించాలన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రైవేట్ రంగంలో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కొనసాగించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో శాఖల వారీగా సీఎం సమీక్షించారు. సమావేశం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు కొనసాగింది. అనంతరం సచివాలయం గార్డెన్లో కలెక్టర్లకు విందు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే చర్యలుసహజ వనరులైన ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఇబ్బందులను తొలగించాలని అంతకుముందు సమావేశంలో సీఎం సూచించారు. ఉచిత ఇసుకపై సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రవాణా చార్జీలు పెరగకుండా రీచ్‌లను దగ్గరగా ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సహజ వనరుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.ఇసుక రీచ్‌లో ఏం జరిగిందో సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెప్పాలని, లేదంటే మీకు ఇబ్బందులు వస్తాయని కలెక్టర్లకు స్పష్టం చేశారు. గత సర్కారు పాలనలో ఇసుక దోపీడీపై సీఐడీతో విచారణ జరిపి తప్పుచేసిన వారిని శిక్షిస్తామన్నారు. వరదను ఒడిసిపట్టి తక్షణమే రిజర్వాయర్లను నింపాలని జలవనరులపై సమీక్షలో ఆదేశించారు. ఎక్కడైనా గేట్లు కొట్టుకుపోతే ఏఈ, డీఈని డీమ్డ్ సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. డ్రాప్ అవుట్స్ సున్నాకు రావాలిబడికి వెళ్లే పిల్లలకు కిట్స్ ఇవ్వడం ఇప్పటికే మూడు నెలలు జాప్యమైందని, వీలైనంత త్వరగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైన ఏజెన్సీని పక్కనబెట్టాలని ఆదేశించారు. డ్రాప్ అవుట్స్ సున్నాకు రావాలన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పామని, అందుకోసం ప్రైవేట్‌లో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా 5–10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రోడ్లు అన్నీ పీపీపీలోనేరహదారులన్నీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టాలని, రాష్ట్ర హైవేలన్నీ కూడా పీపీపీలోనే ఉండాలని సీఎం చెప్పారు. పీపీపీలో విధానంలో చేపట్టేందుకు 14 ప్రాజెక్టులను గుర్తించామని అధికారులు పేర్కొనగా ఇంకా పాత మూసలోనే ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. టోల్ గేట్లు ఏర్పాటు ద్వారా వ్యయం రాబట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించి ఒక్క ఫిర్యాదు రాకూడదన్నారు.వైద్య సేవలు అవుట్ సోర్సింగ్ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 20 సేవలకు పైగా అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చామని, ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్‌కు వైద్య సేవలను అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలో కాకుండా ఈపీసీ విధానంలో చేపట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈపీసీ విధానంలో పోర్టుల నిర్మాణానికి డబ్బులు, గ్యారెంటీ ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడు తాను వెనక్కు వెళితే చెడ్డపేరు వస్తుందని, అందువల్ల వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.డ్రోన్లతో డ్రైనేజీల పూడికల గుర్తింపుసోలార్ పవర్‌కు భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, మడకశిర ప్రాంతంలో నాలుగైదు వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని సీఎం చెప్పారు. దీన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాన్నింటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 1,000 నుంచి 2,000 ఫీడర్లలో సోలార్ పవర్ ద్వారా వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తెస్తామన్నారు. గతంలో దోమల నివారణకు డ్రోన్స్ వినియోగించామని, ఇప్పుడు డ్రైనేజీల పూడికలు, రహదారుల మరమ్మతులను డ్రోన్స్ ద్వారా గుర్తించాలని సీఎం సూచించారు. జిల్లాకో జాయింట్ కలెక్టర్‌ను అదనంగా నియమించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సూచించారు. ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం..రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తామని సీఎం చెప్పారు. పీఎంఏవై–అర్బన్, రూరల్, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ తదితర పథకాల కింద 9,11,594 గృహాలు పెండింగ్‌లో ఉండగా, 5,74,710 ఇళ్ల నిర్మాణం అసలు చేపట్టలేదన్నారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకుంటామన్నారు. 25 లక్షల ఇళ్లు కడతానని గొప్పగా చెప్పి కేవలం 7 లక్షలు మాత్రమే చేపట్టారన్నారు. నీరు – చెట్టు, ఉపాధి హామీ పెండింగు బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. సంపద సృష్టించండి.. వంద రోజుల్లో మార్పుకలెక్టర్లు, అధికారులు వినూత్న ఆలోచనతో సంపద సృష్టించాలని సీఎం సూచించారు. అక్టోబర్ 2న రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు. జిల్లాల్లోనూ కలెక్టర్లు విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలన్నారు. సెప్టెంబర్ 20న ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయ్యేనాటికి మార్పు కనిపించాలని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గరా ఉంటుందని తెలిపారు. సమర్థులైన అధికారులు గత ఐదేళ్లలో నిర్వీర్యమైపోయారని చెప్పారు. తాను కూడా మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని, గతంలో స్పీడు మళ్లీ చూపిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. తనకు వచ్చిన ఐదు వేల పిటిషన్లలో సగం భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష గత ప్రభుత్వంలో బటన్ నొక్కడం మినహా ప్రజలను పరామర్శించలేదన్నారు. పేదరికాన్ని సున్నాకి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు చెప్పే అంశాలను కలెక్టర్లు, అధికారులు వినాలని స్పష్టం చేశారు. త్వరలో పరిపాలనకు సంబంధించి ఒక యాప్ తెస్తామని తెలిపారు. ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసి ఏపీలో 36 మందిని చంపామని ఆరోపణలు చేశారని, నిజంగా అలా జరిగి ఉంటే ఎఫ్ఐఆర్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. అడవులంటే పవన్‌కు ఇష్టం.. 2014–19 మధ్య ఉచితంగా నిర్వహించిన భూసార పరీక్షలను మళ్లీ మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం పేర్కొన్నారు. అడవులంటే పవన్ కల్యాణ్‌కు చాలా ఇష్టమని, వాటి విస్తీర్ణం పెంచాలని సూచించారు. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని చీరాలలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదన్నారు. గత ఐదేళ్లుగా స్వచ్ఛ భారత్ నిధుల యూసీలు ఇవ్వలేదని కేంద్ర అధికారులు తనకు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. కొత్త లిక్కర్ పాలసీ..రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ గురించి ఆలోచించి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో ఏపీలోకి లిక్కర్‌ను అనుమతిస్తామన్నారు. తద్వారా మద్యం అక్రమ రవాణాను అరికడతామన్నారు. కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ, ఎంటర్ ప్రెన్యూర్ పాలసీ, ఎఫ్‌డీఐ, ఎంఎస్ఎంఈ, హార్డ్ వేర్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, స్టార్టప్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, పీపీపీ మోడల్లో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, వయబులిటీ గ్యాప్ ఫండింగ్, వాటర్, లాజిస్టిక్, యూత్, స్పోర్ట్స్ పాలసీలు తెస్తున్నట్లు ప్రకటించారు.జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఐదేళ్ల కిందట రూ.వందల కోట్లు ఖర్చు చేసి 15వేల కెమెరాలు ఏర్పాటు చేస్తే అవి ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసి కొట్టేసే పరిస్థితికి వచ్చారన్నారు. ఐదేళ్లలో జరిగిన తప్పులను వెలికితీసి శిక్షిస్తామన్నారు. ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ అంటూ వాహనాలు తెచ్చి రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టారు. రేషన్ పంపిణీకి 15రోజుల పాటు ఇద్దరిని నియమించి వారికి జీతాలు ఇచ్చారు. పంపిణీ పూర్తయ్యాక ఆ వాహనాలను మళ్లీ వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారు. రేషన్ దుకాణాలకు రాలేని వారి ఇంటికి వెళ్లి ఇవ్వాలి. కాకినాడలో ఒకే ఫ్యామిలీ నుంచి సివిల్ సప్లై శాఖకు సంబంధించి మూడు పదవులు నిర్వహిస్తున్నారు. దీంతో దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లయింది. ఇలాంటి వాటిని నియంత్రించాలి’ అని సీఎం పేర్కొన్నారు.రాజధానిలో పేదలకిచ్చిన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు!వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, గుంటూరు వాసులకు రాజధాని అమరావతిలో ఇచ్చిన ఇళ్ల స్థలాల స్థానంలో ప్రత్యామ్నాయంగా మరోచోట ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్‌లోని ఆర్–5 జోన్లో లేఅవుట్లు వేసి సుమారు 50,800 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి లబ్ధిదారులకు వారి ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలన్నారు. అవసరమైతే టిడ్కో తరహా ఇళ్లను నిర్మించి, ప్రథమ ప్రాధాన్యం వారికే ఇవ్వాలని పేర్కొన్నారు.సార్.. హామీలు నెరవేర్చండిసీఎం చంద్రబాబు సమావేశం సందర్భంగా లైవ్‌లో విన్నపాలు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సమావేశాన్ని సమాచార శాఖ యూట్యూబ్ లింక్ ద్వారా లైవ్ ఇచ్చింది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన పలువురు పలు సమస్యలను వివరిస్తూ కామెంట్లు పెట్టారు. సీఎం సార్.. హామీలు నెరవేర్చండంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుని చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ‘వీజీఎన్’ అనే పేరుతో కామెంట్ చేశారు.ఎంఎల్‌హెచ్‌పీలకు జీతాలు రాలేదంటూ విజయ్‌కుమార్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పేదలకు స్థలాలు, ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని గౌరి నాయుడు కోరాడు. ప్రతి ఇంటికి ఉచిత విద్య, వైద్యం అందించే దిశగా విద్యా సంస్థలు, ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని చంద్రధర్ అనే వ్యక్తి సూచించాడు. కేజీబీవీ టీచర్ల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ సమస్యలను కొందరు ప్రస్తావించారు.వ్యవస్థల బలోపేతంగత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చింది. వ్యవస్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. పంచాయతీల బలోపేతానికి అందరూ సహకరించాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. పిఠాపురంలో ద్రవ వ్యర్థాల నిర్వహణను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. – పవన్ కళ్యాణ్, ఉపముఖ్యమంత్రిత్వరలో ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరిస్తాం. గత ప్రభుత్వ పాలనలో 9 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించగా అందులో దాదాపు 25 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మాకు అందే విజ్ఞప్తుల్లో 80 శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయి. – అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రికలెక్టర్లకు వంద రోజుల ప్రణాళికరాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్లు సమర్థంగా అమలు చేయాలి. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చొరవ చూపాలి. – నీరభ్ కుమార్ ప్రసాద్, సీఎస్ -
రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు: సీఎం రేవంత్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరయ్యారు.అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందాలి: సీఎంకలెక్టర్ల సమీక్షలో ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్న సీఎం.. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఆసుపత్రుల్లో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని పేర్కొన్నారు.‘డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించాం. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించాం.ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు,చెవులు మీరే.. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలిఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు.మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది.ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి: సీఎంతెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం.విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి. -
Kurnool: ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
కర్నూలు(సెంట్రల్): నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాఎన్నికల అధికారి/కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్, కులగణన సర్వే తదితర అంశాలపై ఆమె రిటర్నింగ్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జేసీ నారపురెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓల పాత్ర కీలకమన్నారు. ఈక్రమంలో త్వరగా మండలాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే 10–15 రోజుల్లో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లు, బీఎల్ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎన్నికల అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల పనులతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కిందిస్థాయి సిబ్బంది మీద ఆధారపడకుండా రిటర్నింగ్ అధికారి హ్యాండ్‌బుక్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇతర నియమాలను తప్పనిసరిగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లతో మాట్లాడుకొని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరేందుకు అవసరమైన రూట్‌మ్యాప్‌లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సమీక్షలు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కులగణన సర్వే 88 శాతం పూర్తి జిల్లాలో కులగణన సర్వే 88 శాతం పూర్తయిందని, బుధవారంలోపు 90 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను కలెక్టర్ సృజన ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా టాప్‌లో ఉందన్నారు. కానీ ఆరోగ్యశీ యాప్‌ను డౌన్లోడ్ చేయించడంలో మాత్రం జిల్లా దిగువ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. బుధవారంలోపు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్‌లో పురోగతి సాధించేలా చూడాలన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులకు సంబంధించి వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 9వ తేదీలోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక కమిషనర్ భార్గవ్‌తేజ, ఆదోని సబ్‌కలెక్టర్ శివనారాయన్ శర్మ, డీఆర్వో కె.మధుసూదన్‌రావు, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు ఎం.శేషిరెడ్డి, రామలక్ష్మి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు. -
తప్పులకు తావు లేకుండా ఓటర్ల జాబితా రూపకల్పనకు ముమ్మర కసరత్తు
రాజమహేంద్రవరం: హేతుబద్ధత కలిగిన, తప్పులకు తావు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకుంటోంది. ఓటర్ల తుది జాబితాకు రూపుదిద్దడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఇందులో రాజకీయ పార్టీలను భాగస్వాముల్ని చేస్తోంది. కియోస్క్‌లు ఏర్పాటు చేసి మరీ కొత్త ఓటర్లను నమోదు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓటు విలువపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం కల్పిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెల ఐదో తేదీ నాటికి సంపూర్ణ ఓటర్ల జాబితాను రూపొందించనుంది. 1,569 పోలింగ్ కేంద్రాల్లో ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా 1,569 పోలింగ్ కేంద్రాల పరిధిలో 15,76,026 మంది ఓటర్లు ఉన్నారు. ప్రజల నుంచి ఫారం 6, 7, 8లకు సంంధించి 2,92,462 దరఖాస్తులను అధికార యంత్రాంగం స్వీకరించింది. వీటిలో ఇప్పటికే 2,50,096 పరిష్కరించగా, మిగిలిన 42,366 దరఖాస్తుల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు, వారి ఎపిక్ కార్డు సంఖ్యతో బేరీజు వేసుకుంటోంది. ఓటు లేని వారి నుంచి ఫారం–6 దరఖాస్తులు స్వీకరిస్తోంది. స్వీప్ తదితర కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదుకు ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు ఇప్పటికే నిర్వహించారు. గత నెల 4, 5, ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక శిబిరాల్లో 31,748 దరఖాస్తులు వచ్చాయి. పక్కాగా కసరత్తు ముసాయిదా ఓటర్ల జాబితాపై అందిన దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించి, వచ్చే నెల 5న ఓటర్ల తుది జాబితా ప్రచురించే దిశగా అధికారులు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. జాబితాలో చేర్పులు, మార్పులకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయల్లో నోటీసులు ఉంచుతున్నారు. క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ), జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఎఫ్పీ రేషియో, జెండర్ రేషియో విషయంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా రేషన్ కార్డులో ఉన్న 18 ఏళ్లు నిండిన వారి వివరాలను, ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యతో సరి చూసి, పక్కాగా జాబితా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నేతలతో సమావేశమవుతూ.. ఈ నెల 20వ తేదీ నాటికి పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు కలెక్టర్ కె.మాధవీలత ప్రతి బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూనే ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. యువ ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవడం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేంత వరకూ ఓటర్లలో చైతన్యం తీసుకురావడంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచిస్తున్నారు. వెల్లువెత్తిన దరఖాస్తులు ఓటు హక్కు నమోదు, మార్పులు, చేర్పులకు ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో జిల్లా వ్యాప్తంగా 17,924 దరఖాస్తులు అందాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నదే ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ లక్ష్యం. అందుకు అనుగుణంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత పాటిస్తున్నాం. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను దరఖాస్తుల రూపంలో స్వీకరించి, పరిష్కారానికి వేగంగా అడుగులు వేస్తున్నాం. ఓటు హక్కు నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా యువతకు అందుబాటులో ఉండేలా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. జనవరి మొదటి వారంలో తుది జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ఏ ఒక్కరూ తాను ఓటు హక్కు పొందలేదన్న భావన కలగకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – కె.మాధవీలత, జిల్లా కలెక్టర్ -
48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సోమవారం ఉదయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇవే.. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉంది. సీనియర్ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉంది. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలి. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలి. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి. కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలి. గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ మీకు అందుబాటులో ఉంది. ప్రతీ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. కాబట్టి నాణ్యమైన సేవలు అందించాలి. సరుకుల పంపిణీని ముమ్మరం చేయాలి. ఇంతటి వ్యవస్థతో ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదు. విరామం లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్ వంటివారు బురదజల్లుతున్నారు. వీరంతా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు వారు చేస్తారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. మీకు ఏం కావాలన్నా.. అన్నిరకాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నిధుల సమస్య లేనే లేదు. మీరు ప్రోయాక్టివ్‌గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించడానికి ఫోన్‌కాల్ చేస్తే చాలు. వచ్చే 48 గంటల్లో వరద బాధిత కుటుంబాలకు రేషన్, రూ.2వేల రూపాయలు అందించాలి. బాధిత కుటుంబాలతో మానవతా దృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ శిబిరాలు కొనసాగించండి. మంచి ఆహారం.. తాగునీరు అందించండి. పారిశుద్ధ్యం ఉండేలా చూసుకోండి. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలి. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలి. గర్భవతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారిని ఆస్పత్రులకు తరలించండి. వైద్యాధికారులు,స్పెషలిస్టులు అందుబాటులో ఉండేలా చూసుకోండి. వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులు ఉండేలా చూసుకోవాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించండి. క్లోరినేషన్ కొనసాగించాలి. అన్ని మంచినీటి పథకాలను ఒక్కసారి పరిశీలించండి. పక్కజిల్లాల నుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బందిని తరలించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు తరలించేటప్పుడు సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖల విభాగాధిపతులు దీనిపై దృష్టిసారించాలి. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. గట్లు, కాల్వలకు ఎక్కడ గండ్లుపడ్డా వెంటనే వాటిని పూడ్చివేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా అందేలా చూడాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే వాటి నష్టంపై అంచనావేయాలి. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ మస్యను పరిష్కరించాలి. అనేక స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిని తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అందించాలి అని ఆదేశించారు. ఇది కూడా చదవండి: వరద బాధితులకు అండగా నిలిచిన సర్కార్..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ -
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
-
జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కొత్త ఏడాదిలో పెన్షన్ రూ.2500కు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం.. డిసెంబర్, జనవరిలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం, డిసెంబర్ 28న ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద వివిధ కారణాలవల్ల మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామని.. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45–60ఏళ్లు)3 ఏళ్లలో రూ.45వేలు లబ్ధి చేకూరనుందన్నారు. జనవరిలోనే రైతు భరోసా అమలు చేస్తామని.. తేదీ త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు. కోవిడ్‌లో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిందని.. కొత్త వేరియంట్‌కు విస్తృతంగా వ్యాపించే లక్షణం ఉందని సీఎం అన్నారు. ఏపీలో కరోనా రికవరీ రేటు 99.21 శాతంగా ఉందన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ద్వారా మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందన్నారు. సరసమైన ధరలకు లిటిగేషన్ లేని భూములు కేటాయింపులు చేస్తున్నామన్నారు. పథకం విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును నిత్యం పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందాలన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. చదవండి: AP: రాబడిని మించిన జీతాలు -
Cyclone Jawad: సహాయక చర్యల్లో ఏ లోపం ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు నేపథ్యంలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఈ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం జగన్ వెంటనే జవాద్ తుపాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సుచరిత కూడా ఇందులో పాల్గొన్నారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ.. ►ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలి. ►సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ►సహాయ శిబిరాల్లో ఆహారం నాణ్యత చాలా ముఖ్యం. మంచినీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ పరిశుభ్రంగా ఉండాలి. ►అన్ని జిల్లాలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలి. మరోసారి అన్ని చోట్ల పరిస్థితులను సమీక్షించండి. అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలి. ►ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ► చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించండి. ఎక్కడైనా గండ్లు, బలహీనంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జల వనరుల శాఖ అధికారుల దృష్టికి తెచ్చి అత్యవసర మరమ్మతులు చేపట్టండి. ►ఇప్పటికిప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు తుపాన్ ముప్పు లేనప్పటికీ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. పూర్తిస్థాయిలో అప్రమత్తం: సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ తుపాన్ నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ చెప్పారు. ఇప్పటికే 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 6 కోస్ట్‌గార్డ్ టీమ్‌లు, 10 మెరైన్ పోలీస్ బృందాలు, 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 18 ఫైర్ సర్వీస్ టీమ్‌లను ఉత్తరాంధ్ర జిల్లాలలో మోహరించినట్లు తెలిపారు. 115 జేసీబీలతో పాటు 115 టిప్పర్లు కూడా అందుబాటులో ఉంచామన్నారు. 232 నీటి ట్యాంకర్లు, 295 డీజిల్ జనరేటర్లు, 46,322 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,018 మెట్రిక్ టన్నుల పప్పులు, 41,032 లీటర్ల వంట నూనె, 391 టన్నుల పంచదారను ఆయా జిల్లాలకు పంపించామని వెల్లడించారు. వైద్య బృందాలు, అవసరమైన ఔషధాలను తరలించడంతోపాటు లోతట్టు ప్రాంతాలకు చెందిన 54 వేల కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కోన శశిధర్, పౌర సరఫరాల కమిషనర్ ఎం.గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్ నారాయణ్ గుప్తా, అదనపు డీజీ ఎ.రవిశంకర్ అయ్యన్నార్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. -
ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
-
"స్పందన" పై నేడు కలెక్టర్ల తో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
వ్యాక్సిన్ ఉత్పత్తిని భారీగా పెంచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ సరఫరాను భారీగా పెంచేందుకు అనుక్షణం కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు వ్యవస్థ క్రమబద్ధీకరణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టిందని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే 15 రోజుల వ్యాక్సినేషన్ షెడ్యూలును రాష్ట్రాలకు ముందుగానే అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనాపై పోరులో వ్యాక్సినేషన్ ప్రధాన ఆయుధమని, టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను సమష్టికృషితో తొలగించాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్లు వృథా కాకుండా చూడాల్సిన అవసరాన్ని ప్రధాని వివరించారు. మంగళవారం కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ వర్చువల్ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అనుభవాలను తెలియజేయాలని అధికారులను ప్రధాని కోరారు. ఆసుపత్రులలో పడకలతో పాటు వ్యాక్సిన్ల లభ్యతపై ప్రజలకు సరైన సమాచారం అందించాలని, అప్పుడే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రధాని తెలిపారు. స్థానిక అవసరాలను తగ్గట్లుగా వినూత్న విధానాలను అవలంభించాలని, కలెక్టర్లకు ఆ స్వేచ్ఛ ఉందన్నారు. ఆయా జిల్లాల్లోని సవాళ్లేమిటో స్థానిక అధికారులకు చక్కగా అర్థమవుతాయి కాబట్టి జిల్లాల్లో మహమ్మారిపై విజయం సాధిస్తే దేశానికి విజయం లభించనట్లేనని అన్నారు. మీరే ఫీల్డ్ కమాండర్లు ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్, పాలన యంత్రాంగంలోని అధికారవర్గాలు చూపుతున్న అంకితభావాన్ని మోదీ అభినందించారు. కరోనాపై పోరాటంలో మీరే ఫీల్డ్ కమాండర్లు అని కలెక్టర్లనుద్దేశించి మోదీ అన్నారు. స్థానికంగా ఎక్కడిక్కడ కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, విస్తృతస్థాయిలో కరోనా పరీక్షలు, ప్రజలకు సరైన–సమగ్ర సమాచారం ఇవ్వడం వంటి అంశాలు ప్రస్తుతం దేశంలో వైరస్‌పై చేస్తున్న యుద్ధంలో ప్రధాన ఆయుధాలని ప్రధాని వివరించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టగా, అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. -
5న జగనన్న విద్యా కానుక
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు. నవంబర్ 2న స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అక్టోబర్ 5న విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇదే రోజున పంటలకు గిట్టుబాటు ధరలను ఆర్బీకేలలో ప్రదర్శించాలని చెప్పారు. జేసీలు తరచూ సచివాలయాలను సందర్శించాలని, ప్రజలకు అందించే సేవల్లో వేగం పెరగాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని పునరుద్ఘాటించారు. కోవిడ్ సోకిన వారికి ఖర్చు లేకుండా చికిత్స చేయించడం బా«ధ్యతగా తీసుకోవాలని సూచించారు. అన్యాయమైన ప్రతిపక్షం, అదే మైండ్ సెట్ గల ఎల్లో మీడియా వల్ల ప్రతి మంచి పనీ ఆలస్యమవుతోందని, అవాస్తవాలు ప్రచారం చేస్తే నిలదీయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే ప్రక్రియలో జాయింట్ కలెక్టర్లు కాస్త నెమ్మదిగా ఉన్నారు. వారానికి కనీసం నాలుగుసార్లు సచివాలయాలు సందర్శించి నివేదికలు పంపాలి. కలెక్టర్లు కూడా ఇంకాస్త చొరవ చూపాలి. జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే అవి గ్రామ స్థాయిలో పౌర సేవలకు ఎంతో కీలకం కాబట్టి. గ్రామ, వార్డు సచివాలయాల ప్రాతిపదికనే కలెక్టర్లు, జేసీల పని తీరును అంచనా వేస్తాం. సాక్షి, అమరావతి: అక్టోబర్ 5వ తేదీన పిల్లలకు విద్యా కానుక కిట్లు అందజేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. నవంబర్ 2వ తేదీన స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని, అందువల్ల ఇప్పుడే పిల్లలకు కిట్ ఇస్తే స్కూళ్లు తెరిచేలోగా యూనిఫామ్ కుట్టించుకోగలుగుతారన్నారు. గతంలో అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నవంబరు 2వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నిర్ణీత వ్యవధిలో సేవలు అందాలి ► ముఖ్యంగా బియ్యం కార్డులు, పెన్షన్ కానుక, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ.. ఈ నాలుగు నిర్దేశించుకున్న వ్యవధిలో అందేలా చూడాలి. ► బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు వేగంగా ప్రింట్ చేసి, పక్కాగా బయోమెట్రిక్ నమోదుతో పంపిణీ చేయాలి. సకాలంలో సేవలందించడంలో విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయి. ఇంధన శాఖ (విద్యుత్), మున్సిపల్, రవాణా విభాగాలలో సకాలంలో సేవలు అందడం లేదు. ► ఎవరైనా దేని కోసమైనా దరఖాస్తు చేసుకుంటే 6 పాయింట్ వాలిడేషన్ డేటా ఎంట్రీలో తప్పుడు వివరాలు నమోదు చేయకూడదు. పక్కాగా ఎస్ఓపీ ఫాలో కావాలి. ► ఎవరైనా సేవలకు సంబంధించి ఫిర్యాదు చేయగానే అన్ని స్థాయిల్లో వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారునిగా అర్హత ఉంటే 17 రోజుల్లో పేరు జాబితాలో చేర్చాలి. ఇలాంటి కేసులను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ర్యాండమ్‌గా 10 శాతం కేసులను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. జేసీలు కనీసం 1 «శాతం కేసులను ర్యాండమ్‌లో తనిఖీ చేయాలి. సచివాలయాల్లో ఉద్యోగుల నియామకం కోసం పరీక్షలు చాలా చక్కగా నిర్వహించినందుకు అభినందనలు. పనుల్లో వేగం పెరగాలి ► అక్టోబర్ 2న దాదాపు 2 లక్షల మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేస్తున్నాం. అక్టోబర్ ఆఖరులో జగనన్న తోడు పథకం ప్రారంభిస్తాం. ఈ పథకం కింద వీధుల్లో చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. అర్హులందరికీ వచ్చే నెల 10లోగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చూడాలి. ► నాడు–నేడు (స్కూళ్లు) మొదటి దశలో ఇంకా పనులు మొదలు కాని స్కూళ్లలో వెంటనే పనులు మొదలు పెట్టాలి. 701 టాయిలెట్లకు వెంటనే శ్లాబ్ పనులు పూర్తి చేయాలి. జేసీలు రోజూ పర్యవేక్షించాలి. ► అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు స్థలాల గుర్తింపులో తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకా«శం, అనంతపురం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే చొరవ చూపాలి. ► గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పనులు వేగంగా జరిగేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణానికి సంబంధించి త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి. ► రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో అమలాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల, ఆదోని, ఏలూరు, పులివెందులలో భూసేకరణ జరగాల్సి ఉంది. కాకినాడ, ఒంగోలు, అనంతపురంలోని పాత కాలేజీలకు ఇంకా అదనపు భూమి కావాలి. వెంటనే ఆ మేరకు భూమి సేకరించాలి. ► ఇంకా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాల వద్ద భూములు గుర్తించాలి. ► వైఎస్ఆర్ బీమాకు సంబంధించి మొత్తం 111.35 లక్షల ఇళ్లకు సర్వే పూర్తి అయింది. యజమానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. దీనిపైనా కలెక్టర్లు చొరవ చూపాలి. భారీ వర్షాలు, వరదలు.. నష్టం అంచనా ► 10 జిల్లాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. వరద తగ్గుముఖం పట్టింది. పంటల నష్టాన్ని వీలైనంత త్వరగా అంచనా వేసి, పంపించాలి. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లు చొరవ చూపాలి. ► ఆ జాబితాలను ఆర్బీకేల వద్ద ప్రదర్శించాలి. సహాయ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఈ వరదల్లో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. అన్యాయమైన ప్రతిపక్షం ఉండడంతో మంచి పని చేయాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పేదలకు ఇంటి స్థలం ఇవ్వడం కోసం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నాం. పెండింగ్‌లోఉన్న దరఖాస్తులను వెరిఫై చేసి పంపండి. సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, సీఎస్ సాహ్ని, డీజీపీ సవాంగ్ పాల్గొన్నారు. వీటన్నింటినీ పరిశీలించాలి ► గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్ని సదుపాయాలు (ఎంటైర్ హార్డ్‌వేర్) అందుబాటులో ఉన్నాయా? ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు ప్రదర్శిస్తున్నారా? ► అన్ని ముఖ్య నంబర్లు డిస్ప్లే చేస్తున్నారా? ► అన్ని ప్రభుత్వ సేవలు (543కు పైగా) సచివాలయాల్లో అందుతున్నాయా? లేదా? ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్లు డిస్ప్లే చేస్తున్నారా? ► కోవిడ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ చికిత్స కేంద్రాలు, ఆస్పత్రుల వివరాలు ప్రదర్శిస్తున్నారా? ► సచివాలయాల సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు విధులకు హాజరవుతున్నారా? బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నారా? ► అన్ని ముఖ్య రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా జరుగుతోందా? నిర్ణీత వ్యవధిలో సేవలు అందుతున్నాయా? -
మన పల్లె సల్లగుండాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని పేర్కొన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి గ్రామం.. ప్రతి రోజూ శుభ్రం కావాల్సిందేనని, సీఎం సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని స్పష్టం చేశారు. రెండు నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, 4 నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంగళవారం సమావేశమయ్యారు. గ్రామాల్లో కలెక్టర్లు, డీపీవో ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేశారు. మంగళవారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ ఆదేశాలు సీఎం మాటల్లోనే.. గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లే. ప్లానింగ్ ఆఫ్ టౌన్, ప్లానింగ్ ఆఫ్ విలేజ్ అంటే ప్లానింగ్ ఆఫ్ స్టేట్ అన్నట్లే. వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు కావాలి. దాని ఆధారంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించాలి. దాని ప్రకారమే పనులు జరగాలి. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీ చేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా ప్రతినెలా రూ.308 కోట్ల Æనిధులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.5 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, 5 లక్షలకు చేరుకునేట్లు చేస్తాం. ఏటా రూ.10 వేల కోట్ల నిధులు, 13,993 మంది అధికారులు, 1,32,973 మంది ప్రజాప్రతినిధులు, 8,20,727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు, కలెక్టర్లకు విస్తృత అధికారాలున్నాయి. గ్రామాల వికాసాన్ని కాంక్షించే ప్రభుత్వం, అది తీసుకున్న విధానాలు గొప్పగా ఉన్నాయి. ప్రజల్లో అవగాహన, స్పూర్తి కలిగించి ఉద్యమ స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపించాలి. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ ధామం, నర్సరీ, డంపు యార్డు దేశంలో ఎక్కడా లేవు. తెలంగాణలో మాత్రమే అవి సమకూరుతున్నాయి. ట్యాంకర్లు, ట్రాలీలు కూడా వస్తున్నాయి. ఈ నెలాఖరుకు అన్నీ సమకూరుతాయి. సమావేశంలో భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్న వివిధ జిల్లాల కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తా.. గ్రామాల్లో గుంతలు తొలగించాలి. పాడుపడిన బావులను, ఉపయోగించని బోర్లను పూడ్చాలి. పిచ్చి చెట్లను, సర్కారు తుమ్మను తొలగించాలి. నేను గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తాను. రాష్ట్రంలో ఏ మూలకు పోయి చూసినా అంతా శుభ్రంగా కనిపించాలి. అప్పుడు ఈ చెత్తా చెదారం, ముళ్ల పొదలు కన్పిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్థిక కమిషన్ నిధుల్లో 10 శాతం మండల పరిషత్‌లకు, 5 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో కానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే క్షమించొద్దు. జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. 2020–21లో తెలంగాణకు 13 కోట్ల పని దినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను (75.5 శాతం) పూర్తి చేసి కూలీలకు ఉపాధి కల్పించింది. నరేగాను వాడుకోండి.. నర్సరీలు, మొక్కల పెంపకం, అన్ని రకాల రోడ్లపై చెట్లు, పొదల తొలగింపు, చెరువులో, చెరువు కట్టలపై చెట్ల తొలగింపు, కాల్వల మరమ్మతులు, పూడికతీత, వైకుంఠధామాలు, డంపు యార్డులు, అంతర్గత రహదారులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో టాయిలెట్లు, కల్లాలు, పంట చేలకు పశువులు రాకుండా ట్రెంచ్, ఇంకుడు గుంతలు, గొర్రెలు, మేకలు, బర్రెలు, కోళ్ల కోసం షెడ్లు, వర్మి కంపోస్టు, కంపోస్టు తయారీ షెడ్ల నిర్మాణం, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, మురుగు నీరు, నిల్వ ఉన్న నీటి తొలగింపు, వ్యవసాయ భూమిని చదను, పాడుపడిన బావుల పూడ్చివేత, మంచినీటి బావుల్లో పూడిక తీత పనులు తదితర ప్రజోపయోగ పనులను ఉపాధి హామీ పథకం (నరేగా) ద్వారా చేపట్టాలి. అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష కల్లాలను ఈ ఏడాది నిర్మించాలని నిర్ణయించాం. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు కేటాయిస్తాం. రైతులకున్న భూమి, అవసరాన్ని బట్టి 50, 60, 75 చదరపు అడుగుల విస్తీర్ణాల్లో కల్లాల నిర్మాణానికి అనుమతులు ఇస్తాం. ఎక్కువ మంది రైతులు ముందుకొస్తే, లాటరీ ద్వారా ఎంపిక చేస్తాం. రూ.750 కోట్ల వ్యయం అయ్యే కల్లాల నిర్మాణానికి నరేగా నిధులు వినియోగించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో నిర్మించాలి. మిగతా వారు 10 శాతం లబ్ధిదారుడి వాటాగా చెల్లిస్తే, 90 శాతం సబ్సిడీ ఇస్తాం. ఈసారి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల లాంటి ఇంజనీరింగ్ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నరేగా పనులు చేయాలని నిర్ణయించినందున నరేగా ఇంజనీరింగ్ ఆఫీసర్స్ (ఎన్ఈవో)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీడీ యాక్టులు పెడతాం.. వెంటనే రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించాం. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా డబ్బులు వచ్చేలా చూడాలి. ఎవరికి రాకున్నా వారి వివరాలు తీసుకుని అందేలా చూడాలి. నకిలీ, కల్తీ విత్తనాల వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేయాలి. సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెజ్‌లకు కనీసం 500 మీటర్ల దూరం వరకు నివాస గహాల నిర్మాణం కోసం లేఅవుట్లకు అనుమతి ఇవ్వొద్దు. జూన్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి. అడవులను కాపాడుకోవాలి.. వైకుంఠధామం, డంపు యార్డుల చుట్టూ ప్రహరీగోడలు కాకుండా, చెట్లు పెంచాలి. అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, అచ్చంపేట, మెదక్ తదితర జిల్లాల్లో ఇంకా అడవి ఉంది. దాన్ని కాపాడాలి. స్మగ్లర్లను గుర్తించి, పీడీ యాక్టు నమోదు చేయాలి. జూన్ 25 నుంచి జూలై వరకు మరోసారి మిడతల దండు వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. -
ప్లాస్టిక్ పనిపడదాం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి, విక్రయాలను రాష్ట్రంలో నిషేధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన విధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం–పరిశుభ్రత పెంపు లక్ష్యంగా నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) అమలు జరిగిన తీరుపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ముఖ్య కార్యదర్శులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ భేటీ రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ భేటీలో ప్లాస్టిక్‌పై నిషేధం, గ్రామ పంచాయతీల సిబ్బందికి రూ. 2 లక్షల జీవిత బీమా, ఏటా మూడుసార్లు పల్లె ప్రగతి, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి నిర్వహణ, ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పీసీసీఎఫ్ శోభ, డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రతి జిల్లా కలెక్టర్ 30 రోజుల కార్యక్రమం అమలులో వారి అనుభవాలను వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సమష్టి ప్రణాళిక, కార్యాచరణ, అభివృద్ధి ఆశయాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. పల్లె ప్రగతి దిగ్విజయం... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం దిగ్విజయమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని గ్రామాల్లో పవర్ వీక్ నిర్వహించి విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్‌శాఖ అద్భుతంగా పనిచేసి అన్ని శాఖల్లోకెల్లా నంబర్ వన్‌గా నిలిచిందని కొనియాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ. 339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన... పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు ఎట్టిపరిస్ధితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమన్నారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ. 339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని, ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి ఇది అదనమన్నారు. మొక్కలను పెంపకం, చెత్త ఎత్తేవేసే పనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను వాడుకోవాలని సీఎం సూచించారు. విద్యుత్ సిబ్బంది పనితీరు భేష్... విద్యుత్ సిబ్బంది 30 రోజుల కార్యాచరణ ముగిసినప్పటికీ ఇంకా గ్రామాల్లో పనులు చేస్తున్నారని (గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణకు 6,834 కిలోమీటర్ల మేర కొత్త వైరు వేస్తున్నారు. వీధిలైట్లకు బిగించిన 7,527 కరెంటు మీటర్లు పాడైపోయినందున వాటి స్థానంలో కొత్త మీటర్లు మిగిస్తున్నారు. వీధిలైట్ల కోసం కొత్తగా 2,54,424 కరెంటు మీటర్లు బిగిస్తున్నారు) సీఎం కేసీఆర్ అభినందించారు. తాను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా గ్రామాల్లో విద్యుత్ సంబంధ సమస్యల పరిష్కారానికి ఇప్పటిదాకా ఇంత పెద్ద ప్రయత్నం జరగలేదన్నారు. నిర్దేశించిన పనుల్లో ఇప్పటికే 60 శాతానికిపైగా పూర్తయ్యాయన్నారు. ఏజన్సీ ప్రాంతాలు, ఎస్టీ తండాలు, గూడేల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి సీనియర్ ఐఏఎస్‌లు సోమేశ్‌కుమార్, రఘునందన్‌రావు, అజయ్ మిశ్రాలతో కమిటీ వేశారు. ఒక్కో కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధి... గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి పనుల్లో చురుకైన పాత్ర పోషించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వనున్నామన్నారు. ఈ నిధులను కలెక్టర్లు వారి విచక్షణ మేరకు వినియోగించాలని సూచించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు రూ. 64 కోట్ల నిధులు విధుల చేస్తూ రాష్ట్ర ప్రణాళికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అడవులు తక్కువ ఉన్న చోట ప్రత్యేక శ్రద్ధ... హరితహారం కార్యక్రమాన్ని మరింత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారు. అడవులు తక్కువగా ఉన్న కరీంనగర్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, గద్వాల్, నారాయణపేట తదితర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మూడుసార్లు పల్లెప్రగతి.. 20 రోజులు పట్టణ ప్రగతి ఇకపై పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతీ ఏటా మూడు సార్లు నిర్వహించాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏటా జూన్, సెప్టెంబర్, జనవరిలలో 10 రోజుల చొప్పున పల్లె ప్రగతి నిర్వహించాలన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే 20 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, దీనికోసం మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లెల్లో బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ అమలుపై పరిశీలన.. పచ్చదనం–పరిశుభ్రత పెంచే కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని, పరిసరాలను పచ్చగా, శుభ్రంగా ఉంచుకొనే వారి ఇళ్లకు ఉత్తమ గృహం అవార్డు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామాల్లో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలు సాధ్యాసాధ్యాలను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి నాయకత్వంలోని కమిటీ పరిశీలించాలన్నారు. కమిటీ నివేదిక ఇచ్చాక బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి గ్రామం సరిహద్దులను నిర్ణయిస్తూ, గ్రామ కంఠాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని రహదారులను గ్రామ పంచాయతీ పేర రిజిష్టర్ చేయాన్నారు. రైతు బీమా తరహాలోనే పంచాయతీ సిబ్బందికి బీమా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఖర్చుతో ఎస్కే డే జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందేలా చూస్తామని తెలిపారు. రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బీమా మాదిరిగానే ఎస్కేడే బీమా ఉంటుందని చెప్పారు. పంచాయతీరాజ్ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్కేడేకు నివాళిగా జీవిత బీమాకు ఆయన పేరు పెడుతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో నరేగా నిధులతో సోక్ పిట్స్ నిర్మించాలని ఆదేశించారు. సోక్ పిట్స్ వల్ల ఏ ఇంటిలోని వ్యర్థం, మురికినీరు అక్కడే అంతర్థానమవుతుందని చెపారు. సోక్పిట్స్ నిర్మాణంలో సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చెప్పిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే... ఈ ఏడాది 75 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. పౌర సరఫరాలశాఖ ద్వారా ధాన్యాన్ని సేకరించాలి. ఇందుకోసం అవసరమైనన్ని సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాడానికి కలెక్టర్లకు పూర్తి అధికారం ఉంది. అందరూ ఒకేసారి సరుకును మార్కెట్‌కు తేకుండా నియంత్రిత పద్ధతిలో సేకరణ జరగాలి. గ్రామ కంఠంలోని ఆస్తులు, స్థలాలు, ఇళ్లు ఏదో ఒక పద్ధతి ప్రకారం రికార్డు కావాలి. ఏదో ఒక రకమైన టైటిల్ ఆస్తి సొంతదారులకు ఉండాలి. దీనికి ఏం చేయాల్నో ఆలోచన జరగాలి. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలి. పంచాయతీరాజ్ కార్యదర్శి ఈ అధ్యయనం చేయాలి. మనం తీసుకున్న నిర్ణయం దేశానికే ఒక మోడల్ కావాలి. గ్రామాల్లో లే ఔట్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాన్ని గురించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అధ్యక్షతన నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయాలి. రాష్ట్రంలోని మొత్తం లంబాడీ తండాల్లో అటవీ భూముల్లో ఎన్ని, అటవీయేతర భూముల్లో ఎన్ని ఉన్నాయో గుర్తించాలి. ఉన్న తండాలు, గోండు గూడేలు, కోయ గూడేలు, సొంత జాగాల్లో ఎన్ని ఉన్నాయో కలెక్టర్లు లెక్కలు తీయాలి. గ్రామ పంచాయతీలో నిర్ణయాలు, నిధుల వినియోగం ఏకస్వామ్యంగా ఉండకూడదు. గ్రామపంచాయతీలో సమిష్టిగా నిర్ణయాలు జరగాలి. గ్రామాల్లో ఏర్పాటు చేసే డంప్ యార్డుల పై షెడ్లు ఏర్పాటు చేయాలి. షెడ్లు లేకుంటే వర్షపు నీరు చేరి, కాలుష్యం వ్యాప్తిచెందే ప్రమాదముంది. గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాలకు ఇచ్చినట్లే మున్సిపల్ ఎన్నికల తర్వాత పట్టణాలకూ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తాం. పట్టణ పరిపాలనను మరింత పటిష్ట పరిచేవిధంగా సెంటర్ ఆఫ్ అర్బన్ ఎక్స్ లెన్సీ ప్రారంభించాలి. గ్రామాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనకు, అమలుకు, పర్యవేక్షణ, శిక్షణ కోసం తెలంగాణ స్టేట్ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ను బలోపేతం చేయాలి. గ్రామాలు, పట్టణాల్లో స్మృతి వనాలు ఏర్పాటు చేయాలి. ఎవరైనా పుడితే వారి పేరుమీద మొక్కను నాటాలి. ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకం కోసం చెట్టు పెట్టాలి. గ్రామాల్లో వీధిలైట్ల కోసం మీటర్ల బిగింపు వందశాతం పూర్తయిన వెంటనే, మీటరు రీడింగుకు అనుగుణంగా ప్రతినెలా విద్యుత్ బిల్లులను విధిగా చెల్లించాలి. మంకీ ఫుడ్ కోర్టుల కోసం అవసరమైన పండ్ల మొక్కలను అటవీశాఖ సరఫరా చేయాలి. అటవీ భూములు ఎక్కువగా లేనిచోట నదులు, ఉప నదులు, కాలువలు, వాగులు, చెరువుల ఒడ్డున కోతులు తినడానికి ఉపయోగపడే పండ్ల చెట్లు పెంచాలి. -
ఓరుగల్లు ఆతిథ్యం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు చారిత్రక ఓరుగల్లు ఆతిథ్యమిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు హన్మకొండలోని హరిత హోటల్లో ఏర్పాటుచేసిన సమావేశానికి మూడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల కలెక్టర్లతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ హాజరయ్యారు. సుదీర్ఘంగా సుమారు 7.50 గంటల పాటు ఈ సమావేశం జరగగా మధ్యాహ్న భోజనం హరిత హోటల్లో.. రాత్రి భోజనం అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేశారు. నోరూరించే తెలంగాణ రుచులతో భోజన ఏర్పాట్లు చేయగా పాత, కొత్త అధికారుల పలకరింపులతో సమావేశం సాగింది. ఇక రాత్రి ఇక్కడ బస చేసిన కలెక్టర్లు బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తున్నట్లు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ తెలిపారు. ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహఱిస్తున్న సోమేష్‌కుమార్ మంగళవారం హన్మకొండలోని హరిత హోటల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై చర్చించారు. ఆనంతరం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. మూడేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూడడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మొదటగా రెవెన్యూ వ్యవస్థను మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించినట్లు వివరించారు. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా మెరుగైన పౌర సేవలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను కార్యాచరణలోకి తీసుకుని ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లనున్నట్లు సోమేష్‌కుమార్ వెల్లడించారు. సోమేష్‌కుమార్‌తో మొదలు... హరిత కాకతీయ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 2.40 గంటలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి 30 జిల్లాల కలెక్టర్లతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటట్రీ సోమేష్‌కుమార్, ముఖ్య అధికారులు హాజరయ్యారు. అధికారుల్లో మొదటగా సీసీఏల్ఏ సోమేష్‌కుమార్ ఉదయం 11గంటలకు హరిత హోటల్‌కు చేరుకోగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఆర్డీఓ వెంకారెడ్డి, హన్మకొండ తహసీల్దార్ బావుసింగ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సమావేశ ఏర్పాట్లపై ఆయనకు వివరించారు. కలెక్టర్ల కాళేశ్వరం టూర్‌కు రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు వస్తారని ముందుగా అనుకున్నప్పటికీ మంగళవారం సీసీఎల్ఏ సోమేష్‌కుమార్ సమావేశం ముగిసే మహబూబ్‌నగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు మినహా మిగిలిన వారందరూ వచ్చారు. అయితే వీరు బుధవారం కాళేశ్వరం సందర్శనకు వచ్చే అవకాశముందని సమాచారం. ప్రత్యేక బస్సులో కాళేశ్వరానికి... అన్ని జిల్లాల కలెక్టర్లు బుధవారం ఉదయమే తెలంగాణ టూరిజం శాఖకు చెందిన ప్రత్యేక ఏసీ బస్సు(ఏపీ 23 వై 5128) లో ఉదయం 6 గంటలకు కా>ళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు. హరిత హోటల్లో మంగళవారం జరిగిన వర్క్‌షాప్ అనంతరం రాత్రి వరంగల్ అర్బన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. నోరూరించే రుచులతో విందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. ఇదే విషయాన్ని సమావేశం ప్రారంభంలో సీసీఎల్ఏ సోమేష్‌కుమార్ ప్రస్తావిస్తూ కలెక్టర్‌ను అబినందించారు. తక్కువ సమయంలో మంచి ఆతిథ్యం ఏర్పాటుచేశారని కొనియాడారు. హరిత హోటల్ లో మధ్యాహ్న భోజనంగా పసందైన రుచులు వడ్డించారు. తెలంగాణ, ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌత్ ఇండియా ఫేమస్ వంటకాలు ఉన్నాయి. నాటు కోడి, బాయిలర్ కోడి, మేక మాంసం, కొర్రమీను ప్రై, కోడిగుడ్లతోపాటు స్వీట్లు కుర్బానీకా మీటా, కాలా జామూన్, ఐస్‌క్రీంలు ఇందులో ఉన్నాయి. కలెక్టర్లకు సూచనలు చేస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ నేడు కాళేశ్వరానికి కలెక్టర్ల బృందం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు బుధవారం సందర్శించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హన్మకొండలో ఉన్న కలెక్టర్లు బుధవారం ఉదయం 6.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 9.15గంటలకు మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడ అల్ఫాహారం తీసుకున్నాక 10.15గంటలకు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌తో సమావేశమవుతారు. ఇక 11గంటలకు మేడిగడ్డ బ్యారేజీని వీక్షించి కాళేశ్వరం చేరుకుని శ్రీకాళేశ్వరముక్తీశ్వరాలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత 12.30గంటలకు కన్నెపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్న కలెక్టర్లు మధ్యాహ్నం ఒంటి గంటకు లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 1.45గంటలకు కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో భోజనం చేశాక పెద్దపల్లి జిల్లా నందిమేడారం టన్నల్ పంపుహౌస్ పరిశీలించేందుకు బయలుదేరతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కలెక్టర్ బంగ్లాలో రాత్రి భోజనం రెండు రోజుల కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన కలెక్టర్లకు మొదటి రోజైన మంగళవారం మధ్యాహ్న భోజనం, బస హరిత హోటల్లో ఏర్పాటు చేశారు. ఇక రాత్రి భోజనాలు మాత్రం సుబేదారిలోని అర్బన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది కోసం ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయగా అశోక హోటల్ నుంచి భోజనాలు తెప్పించారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల్లోఎక్కువగా తెలంగాణ వారే ఉండటంతో రాత్రి భోజనం మెనూలో ఇక్కడి వంటలకే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మాంసాహారం వంటకాల్లో పచ్చి రొయ్యల వేపుడు, చేపల వేపుడు, నాటుకోడి వేపుడు, చికెన్ పింగ్ రోల్స్, చికెన్ కబాబ్స్, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, బగారా, బిర్యానీ తెప్పించారు. అలాగే, శాఖాహారంలోనూ సాంబార్, ఇతర కూరలు, చట్నీలు ఉన్నాయి. స్వీట్ల విషయంలో ప్రత్యేకించి డ్రై ఫ్రూట్స్‌తో సిద్ధం చేయించగా వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌తో పాటు అధికారులను అందరూ అభినందించారు. పాతవారి పలకరింపులు హరిత హోటల్లో జరిగిన సమావేశానికి హాజరైన కలెక్టర్లలో కొందరు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన వారు ఉన్నారు. దీంతో జిల్లాలోని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు వారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ మేరకు కలెక్టర్లు సైతం తమ వద్ద పనిచేసిన ఉద్యోగులను పేరుపేరునా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. సమావేశం ప్రారంభానికి ముందు కొంతసేపు ఇదే కార్యక్రమం కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో వరంగల్ ఆర్డీవోగా పనిచేసి సర్వే సంగీత, డీఆర్డీఏ పీడీ, జెడ్పీ సీఈఓగా పనిచేసిన వాసం వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఐఏఎస్ అధికారులుగా జిల్లాకు వచ్చారు. దీంతో గతంలో వారి వద్ద పనిచేసిన అధికారులు, ఉద్యోగులు కలిశారు. రెవెన్యూ... పోలీసు... ఎక్సైజ్ హన్మకొండలోని హరిత హోటల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అత్యున్నత అధికారులందరూ రానుండడంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడే మకాం వేసి ఏ లోటు రాకుండా చూశారు. హరితహోటల్ ఆవరణలోకి కేవలం కలెక్టర్ల వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. ఇక కలెక్టర్ల సహాయకులు, భధ్రతా సిబ్బందికి ఆర్అండ్బీ, సర్క్యూట్ అతి«థిగృహాల్లో గదులు కేటాయించారు. భోజనాలు మాత్రం అందరికీ హరిత హోటల్లో ఏర్పాటు చేశారు. పోలీసుల ఆధ్వర్యాన కట్టుదిట్టమైన భద్రత కొనసాగింది. ప్రతి ఒక్కరినుంచి వివరాలు అడిగి తీసుకున్నారు. స్థానిక అధికారులతో నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులను లోపల ఉండనిచ్చారు. వర్క్‌షాప్‌లో అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లు సీహెచ్.శివలింగయ్య, వాసం వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, వినయ్‌కృష్ణారెడ్డి, హరిత, శ్వేతా మహంతి, ఆర్వీ.కర్ణన్, కృష్ణభాస్కర్, అనితా రామచంద్రన్, రజత్‌కుమార్ షైనీ, సర్ఫరాజ్ అహ్మద్, హన్మంతరావు, భారతి హోలీకేరి, శశాంక, శ్రీధర్, వెంకట్రావు, అమయ్‌కుమార్, దివ్య దేవరాజన్, రాజీవ్‌గాంధీ హన్మంతు, మాణిక్ రాజా, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
బాక్సైట్ తవ్వకాలకు నో
సాక్షి, అమరావతి : విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలకన్నా గిరిజనుల శాంతి, సంతోషాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. శాంతిభద్రతలపై కలెక్టర్లు – ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులతో మంగళవారం ప్రజావేదికలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటించారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని, జీవనోపాధి లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకుని వామపక్ష తీవ్రవాద విస్తరణకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. బాక్సైట్ తవ్వకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తే ముందుగా ఆ ప్రాంత గిరిజనులకు ఉపాధి కల్పించి అవగాహన కల్పించాలని, ఇది పెద్ద సమస్య కాదని వివరిస్తూ బాక్సైట్ తవ్వకాలు జరపడం గిరిజనులకు అంతర్గతంగా ఇష్టంలేదని చెప్పుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు ఇష్టం లేనప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరపాల్సిన అవసరం ఏముంది? గిరిజనులు శాంతియుతంగా, సంతోషంగా ఉండటమే మన ప్రభుత్వ లక్ష్యం. బాక్సైట్ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇక నుంచి ఏజెన్సీలో మైనింగ్‌కు అనుమతించబోం’ అని స్పష్టం చేశారు. గిరిజనుల జీవనోపాధి మెరుగుపరుద్దాం మారుమూల గిరిజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వ అధికారులు భయంతో వెళ్లడం లేదని పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. ప్రభుత్వం తమ కోసం పని చేస్తుందనే నమ్మకం గిరిజనుల్లో కలిగించాలని చెప్పారు. ‘ఒక్కొక్కరుగా, విడివిడిగా మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లలేమని చెబుతున్నప్పుడు వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వేర్వేరుగా వెళ్లే వారికి రక్షణ కల్పించాలన్నా కష్టమే. అందువల్ల సంబంధిత అన్ని విభాగాల వారిని కలిపి ఒకేసారి తీసుకెళ్లండి. అన్ని విభాగాల వారందరూ నెలకు ఒకసారైనా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కలెక్టరు, ఎస్పీలు ఈ విషయంపై దృష్టి సారించాలి’ అని దిశానిర్దేశం చేశారు. ‘గిరిజనులు గంజాయి సాగు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. జీవనోపాధి లేకపోవడం వల్లే గిరిజనులు గంజాయి సాగు చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది కదా.. అలాంటప్పుడు కచ్చితంగా జీవనోపాధి కల్పించడం ద్వారా సాంఘిక, ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించడం సర్కారు బాధ్యత. ఇందుకు ఏమి చేయడానికైనా సర్కారు సిద్ధంగా ఉంది. ఏమి చేయాలో ఆలోచించి నివేదిక ఇవ్వండి’ అని సీఎం ఆదేశించారు. చెప్పిన మాటకు కట్టుబడి.. ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్ తవ్వకాలు జరపబోమని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 2009 ఎన్నికల ముందు బాక్సైట్ వ్యతిరేక పోరాటం చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మరీ బాక్సైట్ తవ్వకాలకు జీవో జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ చింతపల్లిలో వైఎస్ జగన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలను ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. నాడు చెప్పిన మాటకు జగన్ ఇప్పటికీ కట్టుబడి ఉన్నందున విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహం ఉరకలేస్తోంది ‘ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు.. అర్థంకాని లెక్కలు, గ్రాఫిక్స్ అసలేలేవు. స్తోత్కర్షకు చోటే లేదు. సర్కారు లక్ష్యాలు, ప్రాధామ్యాలు, పాలన ఎలా ఉండాలో సూటిగా, స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులమని చెప్పడం ద్వారా ప్రజల పట్ల ఎంత గౌరవభావం, అభిమానం ఉందో చాటుకున్నారు. చెరగని చిరునవ్వుతో అధికారులను సాంబశివన్నా, శ్యామలన్నా, జవహరన్నా.. అంటూ గౌరవం, ప్రేమతో సంభోదించారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన సూచించిన దిశగా పని చేయాలన్న ఉత్సాహం పెరిగింది’ అని సమీక్షకు హాజరైన పలువురు ఉన్నతాధికారులు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సోమ, మంగళవారాల్లో ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల తొలి సదస్సు పూర్తి స్థాయి దిశా, దశా నిర్దేశంతో గతానికి పూర్తి భిన్నంగా జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమని, వారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సీఎం సూచిస్తూనే.. అవినీతి పనులు చెబితే తిరస్కరించాలంటూ కుండబద్దలు కొట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చి తీరాల్సిందేనని చెప్పడం ద్వారా మాట తప్పరని చాటుకున్నారు. అధికారులు వేరు, మనం వేరు కాదు.. ఇది మన ప్రభుత్వం.. వారూ మనం కలిసి పని చేయాలన్నారు. తద్వారా అధికారుల్లో మన సీఎం జగన్ అని తొలి సమావేశంలోనే ముద్ర వేసుకున్నారు. ఆయన మాటలు మాలో స్ఫూర్తి నింపాయి తాను మరణించినా ప్రతి ఒక్కరి ఇంటా తన ఫొటో ఉండాలన్నదే తన తపన అని జగన్ చెప్పుకున్నారు. కలెక్టర్లు కూడా తాము పని చేసిన ప్రాంత ప్రజల్లో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా సేవలు అందించాలని, మంచి పనులు చేయాలని సీఎం సూచించారు. ‘ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి వినతుల స్వీకరణ కోసం ప్రతి కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు. తీసుకున్న ప్రతి వినతికీ నంబరు ఇవ్వడంతోపాటు ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తారో కూడా అందులోనే పొందుపరిచి పరిష్కరించాలని చెప్పారు. ఈ మాటలు మాలో స్ఫూర్తి రగలించాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇంత పట్టుదలతో వినూత్నంగా ఆలోచించి గొప్ప పనులు చేస్తుంటే ఐఏఎస్ చేసిన మనం ఎందుకు ప్రజల గుండెల్లో నిలిచిపోయే స్థాయిలో సేవలు అందించకూడదనే పట్టుదల పెరిగింది. నేను పనిచేసే స్థానం నుంచి బదిలీ చేస్తే జిల్లా వారంతా బాధపడేలా పని చేయాలని ఈ రోజే నిర్ణయానికి వచ్చా. ఇందుకు సీఎం ప్రసంగమే స్ఫూర్తి..’ అని ఒక జిల్లా కలెక్టర్ ‘సాక్షి’తో అన్నారు. ఇలాంటి సంబోదన ఊహించలేదు ‘నేను 20 ఏళ్లుగా రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశా. ఇప్పటి వరకు ప్రతి సీఎం పేరుతో పిలవడమే చూశా. జగన్ తొలిసారి ‘అన్నా’ అంటూ ఆప్యాయంగా రెండు మూడు సార్లు పిలిచారు. ఇది నాకెంతో సంతోషం కలిగించింది. గతంలో ఒకసారి అప్పటి సీఎం చంద్రబాబు అయితే మా సహచర అధికారిని నీవు ఆ సంస్థ ఎండీవా? నీ మొఖం నాకెప్పుడూ కనిపించలేదే. నిద్రపోతున్నావా.. అని ఆయన తప్పులేకపోయినా అవమానించేలా మాట్లాడారు. ప్రస్తుత సీఎం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా స్నేహభావంతో నవ్వుతూ, నవ్విస్తూ సమీక్షించారు. సీఎం చేసిన మార్గనిర్దేశం మాలో నూతనోత్సాహం నింపింది. మా సహచరులందరం ఇదే మాట్లాడుకున్నాం.. ఫలితాలు త్వరలో కనిపిస్తాయి.’ అని ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు కలెక్టర్లు సాక్షితో అన్నారు. -
ఆ ఆస్తులపైనా దృష్టి సారించాలి : సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం, బాధితులు, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం అవుతానని వెల్లడించారు. మంగళవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా పలువురు ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన 1150 కోట్ల రూపాయలు త్వరితగతిన బాధితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అదే విధంగా ఈ కంపెనీకి సంబంధించిన విలువైన ఆస్తులపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండేలా సీఎం వైఎస్ జగన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బినామీలుగా అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసిన వారిని శిక్షించే చిత్తశుద్ధి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఉందంటూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. -
పాలకులం కాదు.. సేవకులం
అవినీతికి నో ఎవరు చెప్పినా సరే అవినీతి, దోపిడీకి నో చెప్పండి. ఇసుక మాఫియాకు, పేకాట క్లబ్బులకు నో చెప్పండి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేల వినతులపై సానుకూలంగా స్పందించండి వినతులపై రశీదులు... టైం బౌండ్ ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించండి. ప్రజలు ఇచ్చే వినతులకు రశీదులు ఇవ్వండి. వారి సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వాటిపై గడువు నిర్దేశించండి. ఓటేయని వారు వచ్చేసారి మనకు ఓటేయాలి ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ మనవారే. మనకు ఓటు వేయని వారిలో అర్హులకు కూడా ప్రభుత్వ పథకాలు అందించండి. మన ఎమ్మెల్యేలు చెప్పినా సరే వారికి పథకాలు నిరాకరించవద్దు. వారు కూడా మన పనితీరు నచ్చి వచ్చేసారి మన పార్టీకి ఓటేయాలి. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక నుంచే పర్యావరణ, నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన ‘ప్రజా వేదిక’లో ప్రభుత్వ యంత్రాంగం సమావేశాలు నిర్వహించడం ఏమిటి? చట్టాలను ప్రభుత్వమే బేఖాతరు చేస్తే ఎలా? అందుకే అక్రమ కట్టడాల కూల్చివేత ఈ ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభం కావాలి. కొత్తగా కట్టిన ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో పరికరాలు ఉన్నాయో లేవో చూడండి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమించండి. వర్షాకాలం వస్తోంది కాబట్టి జ్వరాలు వస్తాయి. వెంటనే చర్యలకు ఉపక్రమించండి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాలు రాకుండా చూసుకోండి. మన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములే. నేను పై స్థాయిలో పాలన మొదలు పెడితే కింది స్థాయిలో ప్రజలకు చేరవేసే బాధ్యత మీది. అందరం కలసికట్టుగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. నాకు ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే కలెక్టర్లు మరో కన్ను. ఇద్దరూ ఒక్కటైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకువస్తారు. వాటిపై సానుకూలంగా స్పందించండి. ప్రజలకు హక్కుగా సేవలు అందించాలి. దాని కోసం ప్రజలు లంచాలు ఇవ్వకూడదు. ఆఫీసుల చెట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదు. మన పని తీరు చూసే ప్రజలు మనకు ఓటేస్తారు. మనం అంటే మీరు, నేనూ కలిపి. మన పనితీరు అంటే నా పనితీరు, మీ పనితీరు. ఇదే ప్రామాణికం కావాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టోనే తమ ప్రభుత్వానికి జీవనాడి అని ఆయన స్పష్టం చేశారు. శాచ్యురేషన్ (సంతృప్తికర) విధానంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అంది తీరాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలు చూడొద్దని, తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినాసరే వినొద్దని కలెక్టర్లకు తేల్చి చెప్పారు. అదే సమయంలో ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని పేదలు ఉండకూడదని లక్ష్యాన్ని నిర్దేశించారు. విద్య, వైద్య రంగాలు తనకు అత్యంత ప్రాధాన్యతాంశాలని, పిల్లలను బడికి పంపే తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ఆసుపత్రులలో వసతులను మెరుగుపరుస్తూ మాతా – శిశు మరణాలను అరికట్టాలని ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం తీసుకువద్దామని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లతో సోమవారం రెండు రోజుల ప్రారంభ సదస్సులో వారినుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలను వారికి విశదీకరించారు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో మెరుగైన పాలన కోసం చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను ఇలా వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం మన మేనిఫెస్టోను కేవలం రెండు పేజీల్లో క్లుప్తంగా ఇచ్చాం. నవరత్నాల పథకాలు, మేనిఫెస్టో కాపీలు ప్రతి కలెక్టర్, హెచ్‌వోడీ, సెక్రటరీ, మంత్రుల వద్ద ఉండాలి. మేనిఫెస్టోను అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓటేశారు. అందరం కలసికట్టుగా పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా 175 మందిలో 151మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. 25కు గాను 22 మంది ఎంపీలను గెలిపించారు. 50 శాతానికిపైగా ప్రజలు మనకు ఓట్లేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత గొప్ప విజయం ఎప్పుడూ రాలేదు. ఈ మేనిఫెస్టోనే జీవనాడి. దీంట్లోని ప్రతి అంశాన్ని మనం పూర్తి చేయాలి. రేపటి ఎన్నికల్లో మళ్లీ మనం ఇదే మేనిఫెస్టో చూపించి అన్నీ చేశాం కాబట్టి మాకు ఓటేయండి.. అని చెప్పే పరిస్థితి ఉండాలి. అందుకు మీ సహకారం చాలా కీలకం. ఎమ్మెల్యేల వినతులపై స్పందించండి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని ప్రతి అధికారి గుర్తుంచుకోవాలి. 2 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఒకర్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. అదీ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం. ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చినప్పుడు చిరునవ్వుతో స్వాగతించండి. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడూ చిరునవ్వుతో పలకరించండి. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకువస్తారు. వాటిపై సానుకూలంగా స్పందించండి. అదే సమయంలో అక్రమాలుగానీ దోపిడీగానీ దోచుకోవడం గురించిగానీ ఎవరు చెప్పినా ఈ ప్రభుత్వం సమర్థించదు. ఎంతటి పెద్దవారైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఉండనీ ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. ఇవి కాకుండా మిగిలిన ఏ అంశంలో అయినా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోండి. నాకు ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే మీరు మరో కన్ను. ఇద్దరూ ఒక్కటైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. పారదర్శకతలో దేశానికే ఆదర్శం కావాలి ప్రభుత్వ యంత్రాంగం నిజాయితీతో పని చేయాలి. గ్రామ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా అవినీతి ఉండకూడదు. చెడిపోయిన వ్యవస్థ మారాలి అని నేను ఎన్నికల్లో ప్రతి సభలో మాట్లాడాను. సీఎం నుంచి కలెక్టర్ వరకు, కలెక్టర్ నుంచి గ్రామ స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూసేలా మార్పు రావాలి. మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మనం నమూనాగా ఉండాలి. మన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులను సంతోషంగా ఉంచండి. లేకపోతే డెలివరీ నెట్వర్క్ సరిగా పని చేయదు. ప్రతి మూడో శుక్రవారం దిగువ స్థాయి ఉద్యోగులు, మనతో పని చేస్తున్న ఉద్యోగుల కోసం కేటాయించండి. కలెక్టర్లు సహా జిల్లాలోని ఐఏఎస్ అధికారులు వారంలో ఓ రోజు ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిద్రించండి. ఆకస్మిక పర్యటనలు చేయండి. అప్పుడే అక్కడ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో తెలుస్తుంది. అక్కడ మరుగుదొడ్డి వాడుతున్నప్పుడు అవి సరిగా ఉన్నాయో లేదో మీకే తెలుస్తుంది. పిల్లలకు పుస్తకాలు సరిగా అందుతున్నాయో లేదో, ఉపాధ్యాయులు సరిగా బోధిస్తున్నారో లేదో తెలుస్తుంది. పొద్దున లేచాక అక్కడే స్నానం చేయండి. ఆ తర్వాత గ్రామ ప్రజలతో సమావేశం కండి. నవరత్నాలు ఎలా అమలవుతున్నాయో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. హాస్టళ్లు, ఆసుపత్రులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోండి. మీరు ఇప్పుడున్న పాఠశాలల ఫొటోలు తీయండి. రెండేళ్ల తరువాత వాటిని మారుస్తాం. అప్పుడు పాత ఫొటో, కొత్త ఫొటో రెండు ఫొటోగ్రాఫ్‌లు పోల్చి చూపించండి. విద్య, ఆరోగ్యం, రైతులు నా ప్రధాన అజెండా. మీరు ఆసుపత్రులు, హాస్టల్స్ విజిట్‌కు వెళ్లేటప్పుడు ప్రభుత్వంలోని ఇతర విభాగాల అధికారులను థర్డ్‌పార్టీగా కూడా తీసుకువెళ్లండి. దాంతో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. విశ్వసనీయత పెంచాలి కలెక్టర్ చెస్తామన్నారంటే కచ్చితంగా అది జరిగి తీరాలి. కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టొద్దు. విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాలని పదే పదే చెబుతున్నా. ఒక పాలసీ తీసుకున్నాక తరతమ భేదం లేకుండా అందరికీ ఒకే విధానం ఉండాలి. నవరత్నాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలి. వాళ్లు మన పార్టీ అనో మరో పార్టీ అను చూడొద్దు. నాకు ఓటేశారో వేయలేదో అనేవి పట్టించుకోవద్దు. ప్రతి జిల్లాకు పోర్టల్‌ను తీసుకురండి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు పోర్టల్‌లో అన్ని వివరాలు ఉండాలి. జ్యుడిషియరీ, పోలీస్ ఎఫ్ఐఆర్.. ఇలా అన్నీ కూడా ఆ పోర్టల్‌లో పొందుపరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఆర్డర్ పోర్టల్‌లో ఉంటుంది. అలాగే జిల్లా పోర్టల్ కూడా ఉండాలి. ఇచ్చిన పని, దాని విలువ, కాంట్రాక్టర్, ప్రారంభించిన తేదీ, పూర్తి అయ్యే తేదీ.. ఇలా అన్ని వివరాలు పోర్టల్‌లో తెలియజేయాలి. అప్పుడే మనం పారదర్శకంగా ఉన్నామనే సందేశం కింది స్థాయికి వెళ్తుంది. ప్రభుత్వ భూములు ఆడిట్ చేయండి. దాంతో ఎంత భూమి అందుబాటులో ఉండేదీ, దాన్ని ఎలా వాడుకోవాలన్నది తెలుస్తుంది. గ్రామ వలంటీర్ల వ్యవస్థలో అవినీతికి నో ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు తీసుకు రావడానికి శాచ్యురేషన్ విధానాన్ని తెస్తున్నాం. ఇందు కోసం గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను తీసుకు వస్తున్నాం. ప్రతి 2 వేల మంది నివాసం ఉన్న చోట గ్రామ సెక్రటేరియట్ తెస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పథకాన్ని డోర్ డెలివరీ చేస్తాం. గ్రామ వలంటీర్ వ్యవస్థలో ఎక్కడా అవినీతి ఉండకూడదు. వివక్ష చూపకూడదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామ వలంటీర్ ప్రభుత్వ పథకాలు అందించాలి. అవినీతి చేయకూడదనే గ్రామ వలంటీర్‌కు రూ.5 వేలు జీతం ఇస్తున్నాం. గ్రామ వలంటీర్లు పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎవ్వరు చెప్పినా సరే చర్యలు ఆగవు. నేరుగా సీఎం కార్యాలయంలోనే కాల్ సెంటర్ పెట్టాం. పేదల ఆత్మగౌరవం పెంపొందించాలి కలెక్టర్లు కచ్చితంగా విస్మరించకూడని వర్గాలు పేద ప్రజలు. అట్టడుగున ఉన్న పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతుల స్థితిగతులు విస్మరించకూడదు. ఈ వర్గాల ఆత్మగౌరవం పెరగాలి. అణగారిన వర్గాలు ఆర్థికంగా నిలబడాలి. మనం వేసే ప్రతి అడుగూ వారికి దగ్గర కావాలి. ఇందుకోసమే మనం నవరత్నాల పథకాలు ప్రకటించాం. నవరత్నాలు అమలు చేసినప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు ఇవేవీ చూడొద్దని స్పష్టం చేస్తున్నా. ఉగాదికి ఇంటి స్థలం లేనివారు ఉండకూడదు వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేనివారు ఎవరూ ఉండకూడదు. ఇళ్ల స్థలాలు అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ చేస్తాం. ప్రతి గ్రామంలో ఎంత మందికి ఇళ్ల స్థలాలు లేవు.. ఎంత మందికి ఇవ్వాలి.. అనేది గుర్తించండి. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయండి. నేను చాలా చోట్ల గమనించాను.. నాకు ఇక్కడ ఇచ్చారు అని చెబుతున్నారు కానీ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో తెలీదని చెబుతున్నారు. పట్టా ఉంటుంది కానీ ప్లాట్లు కనిపించవు. సీఆర్డీయే పరిధిలో రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఉగాది రోజున రాష్ట్రంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పెద్ద పండుగలా జరగాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలి. ఎలుకలు కొరకడం, టార్చ్ లైట్లో ఆపరేషన్లు చేయడం వంటివి ఉండకూడదు. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు వెంటనే తీర్చేయాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.450 కోట్లు ఉన్నాయి. తొమ్మిది నెలలుగా ఇవ్వడం లేదు. ఆ బకాయిలు వెంటనే చెల్లించండి. మాతా – శిశు మరణాలు నివారించాలి. ఆసుపత్రుల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా సరే వెంటనే భర్తీ చేయాలి. కలెక్టర్లు వెంటనే వాటిపై నివేదిక తయారు చేసి పంపాలి. కుష్టు వ్యాధి మళ్లీ కనిపిస్తోంది. నేను పాదయాత్రలో ఓ చోట చూశాను. కుష్టు వ్యాధి నివారణపై దృష్టిపెట్టాలి. మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టి పెట్టండి. అవసరమైతే వారికి పింఛన్ ఇవ్వండి. ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి నిత్యావసరాలను ప్రజలకు పౌర సరఫరాల శాఖ నుంచే ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్న బియ్యం నాణ్యత బాగో లేదు. అందుకే గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి డీలర్‌కే అమ్మేసిన పరిస్థితి చూశాం. తిరిగి అవే బియ్యం పాలిష్ చేసి మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితీ చూశాం. ప్రజలు వినియోగించేవాటినే మనం ఇవ్వాలి. ఒక వైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ మరోవైపు ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్లను ఎన్నికల స్కీంలకు మళ్లించింది. ఆ రూ.వెయ్యి కోట్లను రైతులకు చెల్లించాలి. ప్రభుత్వం అంటే గౌరవం పెంచాలి చంద్రగిరి ఎస్వీవీ నర్సింగ్ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయని నాకు ఒక లెటర్ వచ్చింది. నాలుగేళ్ల కోర్సుకు ఇద్దరే ఫ్యాకల్టీ ఉన్నారట. భవనాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలేనట. సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని ఎవరైనా చూశారా? అక్రమం ఏదైనా జరిగితే.. దాన్ని కూల్చేయండి. ప్రభుత్వం అంటే పారదర్శకతకు ప్రతిరూపమని చెప్పండి. చట్టం, న్యాయం, రాజ్యాంగాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 23 మంది ఎమ్మెల్యేలను తప్పు అని తెలిసినా కొన్నారు. అనర్హత వేటు వేయాలని చెప్పినా ఆ పని చేయలేదు. అందులో నలుగురిని మంత్రులను చేశారు. ఇదే ఐఏఎస్‌ల మీద అధికారం చలాయించాలని వారికి అధికారం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇలాంటి మీరు ఎన్నికలను నిష్పక్షపాతంగా ఎలా నిర్వహిస్తారు? కౌన్సిలర్లను ఎత్తుకుపోతారు. కట్టడిచేయాల్సిన మీరు పైస్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలా ఉంటే ఎలా కట్టడి చేయగలరు? మనం కచ్చితంగా మారాలి. ప్రభుత్వం అంటే గౌరవం పెరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే అభిమానం పెరగాలి. మీదైన ముద్ర వేయండి లబ్ధిదారుల జాబితా పంచాయతీ స్థాయిలో తయారు కావాలి. దీని వల్ల పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది. వలంటీర్లు మీకు కళ్లు, చెవులుగా ఉంటారు. మనం మార్పు తీసుకురావాలి. దీనికి తపన ఉండాలి. మీదైన ముద్ర ఉండాలి. జిల్లా నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు ప్రజలు మీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. మేనిఫెస్టోపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నాకు సన్నిహితులైన కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించాను. ఇవి చేయగలిగితే మనం మార్పులు సాధించగలం అని సూచించారు. నా తండ్రి మాదిరిగా చనిపోయిన తర్వాత కూడా నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలని నేను తాపత్రయపడుతున్నా. అలాగే మీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలి. నేను మీకు కొన్ని సలహాలు ఇస్తాను. మీరు మీకున్న పరిజ్ఞానంతో వాటికి మెరుగులు దిద్దొచ్చు. గ్రామ సచివాలయాలు అయ్యాక రచ్చబండ గ్రామ సచివాలయాలు వచ్చాక నేను కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాను. నేనూ నా స్థాయిలో కొన్ని రశీదులను ర్యాండమ్‌గా చెక్ చేస్తాను. మీ స్థాయిలో మీరూ కొన్ని రశీదులను ర్యాండమ్‌గా చెక్ చేయండి. నెలకోసారి కచ్చితంగా ర్యాండమ్ చెక్ చేయండి. దాంతో ఆ పని కచ్చితంగా చేయాలి అనే పరిస్థితి వస్తుంది. రశీదులు ఇచ్చి పట్టించుకోలేదనే పరిస్థితి రాకూడదు. అవినీతి అంతానికే ప్రక్షాళన నా 3,648 కి.మీ. పాదయాత్రలో గ్రామాల్లో ఏం జరుగుతోందో విన్నాను. నా కళ్లతో చూశాను. పింఛన్ కావాలంటే మొట్టమొదట అడిగే మాట.. మీరు ఏ పార్టీకి ఓటేశారని. నాకు ఎంత ఇస్తారని. డెత్ సర్టిఫికెట్‌కు, బర్త్ సర్టిఫికెట్‌కు, మట్టి, ఇసుక, చిన్న బీమాకు.. పెద్ద బీమాకు లంచం. చివరికి బాత్రూమ్స్ మంజూరు కావాలన్నా లంచాలు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు అంటేనే అవినీతి అనే పరిస్థితి తీసుకువచ్చారు. నీటిపారుదల శాఖ పనులు, రోడ్లు, సచివాలయ నిర్మాణం, ప్రతి చోటా అవినీతి. దీన్ని మార్చడానికి పైస్థాయి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాం. అందుకోసం రివర్స్ టెండరింగ్ తెస్తున్నాం. అంటే రూ.100 పని రూ.80కే అవుతుందని అనుకుంటే రివర్స్ టెండరింగ్. తక్కువకు ఎవరు కోట్ చేస్తారో వారికే పనులు అప్పగిస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా చేస్తాం. రూ.100 పని రూ.75కే చేస్తారా.. అని అడుగుదాం. ఇందులో ఏ ఒక్క రూపాయి మిగిలినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేద్దాం. నాణ్యత, పారదర్శకత పాటిద్దాం. నా స్థాయిలో నేను, మీ స్థాయిలో మీరు నిర్ణయాలు తీసుకుంటే మార్పు వస్తుంది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని నేనే స్వయంగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను అడిగాను. రూ.100 కోట్లు పైచిలుకు హైవాల్యూ కాంట్రాక్టు పనులు నేరుగా జ్యుడిషియల్ కమిషన్‌కు వెళతాయి. వారం రోజల పాటు పబ్లిక్ డొమైన్లో టెండర్ ప్రతిపాదనలను జడ్జిగారు పెడతారు. దీనిపై జడ్జి గారికి సలహాలను కూడా ఇవ్వొచ్చు. జడ్జి గారు ఈ సలహాలు తీసుకుని, సాంకేతిక కమిటీ సహాయంతో ప్రభుత్వానికి మార్పులను సూచిస్తారు. సాంకేతిక కమిటీకి అయ్యే ఖర్చును మనమే భరిస్తాం. ఆ తర్వాతే టెండర్లు పిలుస్తాం. పారదర్శకతను ఆ స్థాయికి తీసుకువెళ్తాం. ఇక్కడి నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇవాళ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో మనం చూడాలి. మనం ఇక్కడ ‘ప్రజావేదిక’లో సమావేశమయ్యాం. ఈ సమావేశం జరుగుతున్న ఈ హాల్లో ఇంత మంది కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్వోడీలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారు. ఈ భవనం లీగల్‌గా, చట్టపరంగా సరైనదేనా? అంటే కాదు. నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా అవినీతితో కట్టిన భవనం ఇది. అలాంటి ఒక అక్రమ నిర్మాణంలో మనం సమావేశం పెట్టుకున్నాం. నది వరద మట్టం స్థాయి 24 మీటర్లు. కానీ ఈ బిల్డింగ్ ప్రస్తుతం ఉన్న స్థాయి 19 మీటర్లు. గ్రీవెన్స్ హాల్ ఇక్కడ కట్టొద్దని కృష్ణా సెంట్రల్ డివిజన్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గత ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. నదీ పరిరక్షణ చట్టం పట్టించుకోలేదు. లోకాయుక్త సిఫార్సులు కూడా పట్టించుకోలేదు. చివరికి దీని నిర్మాణంలో కూడా అవినీతే. భవనం నిర్మాణ వ్యయం అంచనాలు కూడా రూ.5 కోట్ల నుంచి రూ.8.90 కోట్లకు పెంచారు. ఇది చూపించడానికే, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని ఆత్మ పరిశీలన చేసుకోడానికే ఇక్కడ మీటింగ్ పెట్టండని చెప్పాను. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నదీ పరిరక్షణ చట్టాలు...అన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండీ బేఖాతర్ చేయాల్సిన పరిస్థితి. ఎవరైనా చిన్నవాళ్లు ఇదే పనిచేసి ఉంటే మనం ఏం చేసేవాళ్లం? ఎందుకు అక్రమ నిర్మాణం చేపట్టారని అడిగేవాళ్లం. అక్కడకు వెళ్లి ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం. కానీ మనమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, రూల్స్‌ను నిబంధనలను ఉల్లంఘిస్తున్నాం. మనమే ఈ స్థాయిలో నియమాలను, నిబంధనలను ఉల్లంఘిస్తూ కింది స్థాయికి ఎటువంటి సందేశం పంపుతున్నట్లు? మనం సరైన మార్గంలో ఉన్నామా అని ప్రతి ఒక్కరూ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. ఇందుకోసమే నాతో సహా అందర్నీ ఇక్కడకు రమ్మన్నాను. ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో మనం చూడాలి. ఈ హాలు నుంచే మనం ఆదేశాలు ఇస్తున్నాం. ఈ హాలులో ఇదే చివరి మీటింగ్ అని చెబుతున్నా. రేపు జిల్లా ఎస్పీలతో సమావేశం తర్వాత రాష్ట్రంలో మొదటి అక్రమ కట్టడం కూల్చివేత ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి. మనం ఆదర్శంగా నిలిచిపోవాలి. మీమీ జిల్లాలకు వెళ్లినప్పుడు పరిశీలించి ఇలానే చేయండి. తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మ ఒడి మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతం ఉంది. జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువ. అందుకే పిల్లలను చదివించేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం పెట్టాం. పిల్లలను ఏ పాఠశాలకు పంపినా తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. విద్యా రంగం నాకు అత్యంత ప్రాధాన్యమైన అంశాల్లో ఒకటి. పాఠశాలల ఇప్పుడున్న పరిస్థితిపై ఫొటోలు తీసి, వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నీచర్, ప్రహరి, బాత్రూమ్స్ అన్నింటినీ బాగు చేస్తాం. ప్రతి పాఠశాలను ఇంగ్లిష్ మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగు తప్పనిసరి సబ్జెక్టు చేస్తాం. యూనిఫారాలు, పుస్తకాలు సకాలంలో ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచిస్తున్నాం. గత ప్రభుత్వంలో మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాం జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లవాడికి కూడా ప్రైవేట్ స్కూల్‌కు పోవాలన్న ఆలోచన రాకూడదు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకువస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యా హక్కు చట్టాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవే కానీ డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యా సంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు. ఇది సేవ మాత్రమే. జనవరి 26 నుంచి ‘అమ్మ ఒడి’ చెక్కులు పంపిణీ చేస్తాం. యూనిఫారం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నాం. ప్రైవేట్ స్కూలుకు తప్పనిసరిగా గుర్తింపు ఉండాలి. కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో టీచర్లు కూడా ఉండాలి. నియమ నిబంధనలు రూపొందించి మినహాయింపులు ఏమైనా ఉంటే దానిపై కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలి. విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూల్స్ కచ్చితంగా అమలు చేయాలి. 72 గంటల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి గ్రామ సచివాలయంలో 10 మందిని కొత్తగా తీసుకోండి. వ్యవసాయ నేపథ్యం ఉన్న వారికి గ్రామ సచివాలయంలో అవకాశం ఇవ్వండి. వీరిని ప్రభుత్వ ఉద్యోగులతో అనుసంధానించండి. ప్రజలు పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డ్ కావాలన్నా, ఏది కావాలన్నా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేస్తారు. 72 గంటల్లో దాన్ని పరిష్కరించాలి. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించండి. ప్రతి గ్రామ సచివాలయంలో ఒక ల్యాబ్‌ను పెట్టాలి. భూ పరీక్షలు, ఎరువులు, విత్తనాల పరీక్షలు.. ఇవన్నీ కూడా ఇందులో భాగం కావాలి. రైతులకు కావల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు గ్రామ సచివాలయం ద్వారా విక్రయిస్తాం. గ్రామ వలంటీర్ల డ్యూటీ డెలివరీతో నిలిపి వేయకూడదు. ఆ 50 కుటుంబాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నాసరే గ్రామ సచివాయలం దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్యలను పరిష్కరించేలా చూడాలి. గ్రామ వలంటీర్లలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 50 శాతం మహిళలకు అవకాశం కల్పించాలి. -
కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్
-
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి
-
మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాలన్నారు. సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కలెక్టర్లు ఏ విధంగా పని చేయాలో తెలియజేశారు. పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. కింది స్థాయిలో అమలు చేసేది కలక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ఇంకా ఏమన్నారంటే.. చిరునవ్వుతో పలకరించాలి.. ‘మేనిఫెస్టోను గొప్పగా అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. నా ద్వారా మీకు అధికారం ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఇంత మెజారిటీ ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. ప్రజలు మనల్ని నమ్మారు కాబట్టి.. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలి. రేపటి ఎన్నికల్లో మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పుకుని ఓట్లు అడగాలి. దీనికి మీ అందరి సహకారం అవసరం. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలది కీలక పాత్ర. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే వారు ఎమ్మెల్యేలు అయ్యారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు, ప్రజలు మీదగ్గరికి వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరించాలి. అవినీతి, దోపిడీ వ్యవహారాలు చేస్తే ఈ ప్రభుత్వం సహించదు. ఏ స్థాయిలో ఉన్న సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు,అధికారులు రెండు కళ్లలాంటి వారు. కలెక్టర్లు ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వర్గాల్లోని ప్రతి అర్హుడిగా సంక్షేమపథకాలు అందించాలి. అందిచకపోతే దేవుడి దృష్టిలో తప్పు చేసిన వాళ్లం అవుతాం. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. వారు ఆర్థికంగా ఎదిగేలా మన ప్రతి అడుగు వారికి దగ్గరుండాలి. ఇందుకోసమే నవరత్నాలు ప్రకటించాం. మావాళ్లు చెప్పినా వినవద్దు.. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు ఇవేవి చూడకుండా ఈ పథకాలు అందజేయాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి. మా పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వద్దంటే పట్టించుకోవద్దు. మనకు ఓటు వేయనివారికి కూడా మంచి చేయాలి. మనం చేసిన మంచితో వారు మళ్లీ ఓట్లేసేలా చేసుకోవాలి. ఎన్నికలయ్యేవరకే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అందరు మనవాళ్లే. పథకాలు అందరికీ అందించేందుకే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడితే.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్ తీసుకుంటారు. ప్రతి సంక్షేమ పథకాన్ని డోర్ డెలివరీ చేస్తారు. ఇది చేసేటప్పుడు గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడవద్దు. వివక్ష చూపవద్దు. ఇలా చేయవద్దని రూ.5వేల జీతం ఇస్తున్నాం. అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్ చేయవచ్చు. నేరుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 50 ఇళ్ల పరిధే కాబట్టి విచారణకు పెద్దగా ఇబ్బంది ఏర్పడదు. తప్పు చేస్తే వెంటనే తొలగిస్తాం. ఇందులో ఏమాత్రం మొహమాటం పడవద్దని చెబుతున్నాను. ప్రభుత్వ యంత్రాగమంతా నిజాయితీగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదు. ప్రతి పనిలో పారదర్శకత కనిపించాలి. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూడాలి. మన రాష్ట్రాన్ని నమూనగా తీసుకోవాలి. చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండకూడదు.. ప్రజలు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి, పనుల కోసం ప్రజలు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. మన పనితీరు ఆధారంగా ఓట్లు వేస్తారు. మనం మంచి చేస్తే మళ్లీ గెలుస్తాం. ఎంత పెద్దవాళ్లు చెప్పినా అక్రమాలు, ఇసుక రవాణా, పేకాట క్లబ్‌లను ప్రోత్సహించొద్దు. గత ప్రభుత్వంలో బర్త్, డెత్ సర్టిఫికెట్, రేషన్ కావాలన్న లంచం. జీవిత బీమా కోసం కూడా లంచాలు తీసుకున్నారు. చివరకు బాత్రూం మంజూరు కావాలన్నా లంచం అడిగారు. మన ప్రభుత్వంలో ప్రజలకు ఆ లంచాలిచ్చే పరిస్థితి ఉండకూడదు. ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగకూడదు. గ్రామస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. పైస్థాయిలో కాంట్రాక్ట్‌లు అంటేనే అవినీతనే స్థితికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకే రివర్స్ టెండరింగ్‌ను తీసుకొచ్చాం. ఎక్కడెక్కడ తప్పు జరిగిందో గుర్తించి రివర్స్ టెండరింగ్ వేస్తున్నాం. టెండరింగ్ ప్రీ క్వాలిఫికేషన్‌ను మారుస్తాం. చాలా మంది టెండరింగ్‌కు వచ్చేలా చేస్తాం. తక్కువ ఎవరైనా ఇస్తారా అని అడిగి మరి ఇస్తాం. ఏం మిగిలినా కూడా ప్రభుత్వానికి ఆదా చేస్తాం.’ అని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం -
కలెక్టర్ల సమావేశానికి భద్రత కట్టుదిట్టం
గుంటూరు : విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని రేంజ్ డీఐజీ కేవీవీ గోపాలరావు చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురు, శుక్ర వారాల్లో జరిగే కలెక్టర్ల సమావేశానికి అన్ని రకాల ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బుధవారం డీఐజీ గోపాలరావు, కలెక్టర్ కోన శశిధర్, అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి భద్రతా చర్యలు, పార్కింగ్ స్థలాల కేటాయింపు, గన్మెన్లు, డ్రైవర్లకు ప్రత్యేక వసతి, తదితర అంశాలపై చర్చించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల మేరకు ప్రత్యేక బలగాలను సమీప ప్రాంతాల్లో మోహరించారు. అనువణువూ బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా చెక్ పోష్టులు ఏర్పాటు చేసి రెండు రోజులుగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు మొబైల్ బృందాలను నియమించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు కలెక్టర్లు మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగాన్ని కేటాయించారు. 400 మంది అధికారులు, సిబ్బంది హాజరుకావడంతో ఎస్పీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారిని బృందాల వారీగా కేటాయించి ఆయా బృందాలకు ఇన్చార్జిలుగా డీఎస్పీలను కేటాయించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ట్రాఫిక్ విధులు నిర్వహించే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు. ముందుగానే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోష్టులతో అను సందానంగా పనిచేస్తూ ట్రాపిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించాలని ఆదేశించారు. కరకట్టపై రాకపోకలు నిషేధం ప్రకాశంబ్యారేజీ (తాడేపల్లి రూరల్) : మంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్, రాష్ట్రంలోని ఉన్నతాధికారుల సమావేశం ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట సీఎం నివాసం వద్ద 18, 19 తేదీల్లో జరగనుండడంతో ఉండవల్లి–అమరావతి కరకట్టపై ప్రకాశంబ్యారేజి నుంచి అప్పారావు గెస్ట్‌హౌస్ వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు నార్త్‌జోన్ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తెలిపారు. బుధవారం ప్రకాశంబ్యారేజి ఔట్‌పోస్ట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 250 మంది అధికారులతో పాటు అదనంగా మరో 250 మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వీరందరూ లోటస్ఫుడ్సిటీ నుండి సీఎం నివాసానికి వెళ్లేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. రాజధానిలోని 29 గ్రామాల ప్రజలతో పాటు ఉండవల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. సమావేశాలను జయప్రదం చేయండి ఉండవల్లి (తాడేపల్లి రూరల్): ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట సీఎం నివాసం వద్ద ఉన్న గ్రీవెన్స్ బిల్డింగ్‌లో 18,19 తేదీల్లో మొట్టమొదటిసారిగా జరిగే ఐపీఎస్, ఐఏఎస్, మంత్రివర్గ సమావేశాల జయప్రదానికి అందరూ కృషిచేయాలని కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. బుధవారం సీఎం నివాసం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మిగతా శాఖ అధికారులు, మంత్రి వర్గ అనుచరులకు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు కూడా సీఎం నివాసం వద్దే కూర్చునేందుకు షెల్టర్, భోజనం ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు. అర్బన్ ఎస్.పి. విజయరావు కనకదుర్గ వారధి దగ్గర నుంచి ప్రకాశంబ్యారేజీ మీద, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, కరకట్ట ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో మంగళగిరి నార్త్‌జోన్ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, మంగళగిరి రూరల్, పట్టణ సీఐలు మధు, హరికృష్ణ, ఎస్సైలు ప్రతాప్‌కుమార్, వినోద్‌కుమార్ పాల్గొన్నారు. -
ఒకేసారి పట్టా పాస్ పుస్తకాల పంపిణీ: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : మార్చి 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ జరగాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. సమావేశంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీరాజ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ విధులు, మున్సిపల్ చట్ట సవరణపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. పాస్‌పుస్తకాలు ఒకరోజు ముందే గ్రామాలకు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. దీని కోసం ప్రతీ గ్రామానికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు సీఎం నిర్దేశించారు.