ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు విజయవాడలో అట్టహాసంగా సాగుతున్నా విమర్శలు వస్తున్నాయి.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు విజయవాడలో అట్టహాసంగా సాగుతున్నా విమర్శలు వస్తున్నాయి. స్టార్ హోటల్‌లో దాదాపు కోటి రూపాయలు వెచ్చించి సదస్సు ఏర్పాటు చేశారు అధికారులు. ఓ వైపు లోటు బడ్జెట్ అంటూనే అధికారులు ఇంత ఖర్చు చేయటాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. కలెక్టర్ల సదస్సుకు హైదరాబాద్ నుంచి 32 శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, 80 మంది హెచ్వోడీలు హాజరయ్యారు.
అధికారులకు, మంత్రులకు బెజవాడలోని పలు స్టార్ హోటళ్లలో బస, భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇక సదస్సుకు హాజరయ్యేందుకు మంత్రులు, అధికారులకు విమాన ఛార్జీల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయటంపై సీనియర్ అధికారులు విస్తుపోతున్నారు. 13 మంది కలెక్టర్లూ హైదరాబాద్ వచ్చి ఉంటే రూ. కోటి మిగిలేదని పలువురు అధికారులు చెబుతున్నారు.