హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మెజార్టీ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి పునర్విభజనపై చర్చ కొనసాగుతోంది. దీంతో 14 లేదా 15 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా కేసీఆర్ కలెక్టర్లకు సూచనలు చేశారు. మండలాల పునర్విభజన పూర్తి స్వేచ్ఛగా జరగాలన్నారు. ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యం కావాలని చెప్పారు. గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయాలు సేకరించాలని తెలిపారు. కొత్త జిల్లాలు అభివృద్ధి సూచికలుగా మారాలని కేసీఆర్ సూచించారు. బలవంతంగా మమ్మల్ని వేరేచోట కలిపారన్న మాట రాకూడదని సూచించారు. ఏకపక్ష నిర్ణయలొద్దని చెప్పారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని సూచించారు. సుమారు 50 నుంచి 60 వేల జనాభా ఉండేలా మండలాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అర్బన్ మండలాల్లో లక్షన్నర జనాభా, 20 మండలాలకు ఒక జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 నుంచి 12 మండలాలను ఏర్పాటు చేయాలి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 నుంచి 6 మండలాలు ఉంటాయి. మండలాల పుర్విభజన పూర్తి స్వేచ్ఛగా జరగాలని చెప్పారు. పెద్ద మండలాలను రెండుగా విభజించాలని కేసీఆర్ తెలిపారు.
'కొత్త జిల్లాలు అభివృద్ధి సూచికలుగా మారాలి'
Published Wed, Jun 8 2016 4:17 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement