
‘సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలే కాదు.. గిరిజన తండాలను జీపీలుగా మార్చి పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో భూగర్భజలాలు పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్ల భూగర్భ నీటి మట్టం పెరగడం.. ఐఏఎస్ అధికారులకు పాఠ్యాంశమైంది. సిరిసిల్ల మధ్యమానేరు, అనంతగిరి, వేములవాడ ప్రాంతాలను కలిపి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరుతున్నా.’