Development and welfare programs
-
ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు : సీఎం జగన్
వైఎస్సార్ జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటన అప్డేట్స్ 04:15PM పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో అలుపెరగకుండా శ్రమిస్తున్న లింగాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకరిస్తున్న ప్రజలకు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న అందరికీ ఈ సందర్భంగా సీఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. 02:05PM పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ప్రజలు, ముఖ్య నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివరించిన స్థానికులు. 01:35PM వైఎస్సార్ లేక్‌వ్యూ రెస్టారెంట్ వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ 01:20PM సీఎం జగన్ బోటింగ్ సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీలో సీఎం జగన్.. ఎంపీ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. 01:15PM ►సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ 01:00PM వైఎస్సార్ జిల్లా: పార్నపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో బోటింగ్ జెట్టిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు ►రిజర్వాయర్ వద్ద టూరిజం పార్క్, రెస్టారెంట్, బోటింగ్ ఏర్పాటు 12:50PM వైఎస్సార్ జిల్లా: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ►స్వాగతం పలికిన కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జిల్లా అధికారులు. 11:42AM ►గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు బయల్దేరిన సీఎం జగన్ 11:20AM కృష్ణాజిల్లా: తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►గన్నవరం విమానాశ్రయం నుంచి కాసేపట్లో వైఎస్సార్ కడప జిల్లా బయల్దేరనున్నారు. సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. డిసెంబరు 2, 3వ తేదీల్లో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేటి పర్యటన ఇలా.. ►లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్ద బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. ►అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. ►అనంతరం లింగాల మండల నాయకులతో మాట్లడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం కేసీఆర్... దేశానికి ఆదర్శం: కేటీఆర్
‘సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలే కాదు.. గిరిజన తండాలను జీపీలుగా మార్చి పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో భూగర్భజలాలు పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్ల భూగర్భ నీటి మట్టం పెరగడం.. ఐఏఎస్ అధికారులకు పాఠ్యాంశమైంది. సిరిసిల్ల మధ్యమానేరు, అనంతగిరి, వేములవాడ ప్రాంతాలను కలిపి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరుతున్నా.’ -
బంగారు తెలంగాణకు బలమైన పునాదులు
సాక్షి, హైదరాబాద్: ‘ఆరు దశాబ్దాల వలస పాలనతో కుదేలైన తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో చేపట్టింది. సమతుల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షే మం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లోనూ ఎంతో పురోగతి సాధించి, యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఆకలి దప్పులు, ఆత్మహత్యలు లేని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో కూడిన బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయి. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రగతి యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తుంది’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ‘కొత్త పథకాలు, కొత్త చొరవ, కొత్త ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకం..’అని అన్నారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన 72వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. పదోన్నతుల తర్వాత ఒకేసారి ఖాళీల భర్తీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్తో జీతాలు పెంచింది. తక్కువ వేతనాలతో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు, పారిశుధ్య కార్మికులు, 108 సిబ్బంది తదితరుల వేతనాలు పెంచింది. తాజాగా ప్రతి ఉద్యోగికీ, ప్రతి పెన్షనర్‌కు మరోసారి వేతనాలు పెంచాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితినీ పెంచాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పదోన్నతులు పూర్తయిన వెంటనే అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌కు కళ్లెం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని, ప్రభావాన్ని, ప్రాణనష్టాన్ని గణనీయంగా అరికట్టగలిగింది. కోవిడ్ మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.4 శాతం అయితే తెలంగాణలో 0.54 శాతం మాత్రమే. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లు అయిన వైద్య ఆరోగ్య సిబ్బంది, రేయింబవళ్లు సేవలందించిన పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద కార్యకర్తలను మనన్ఫూర్తిగా అభినందిస్తున్నా. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గడంతో బడ్జెట్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆదాయం తగ్గినప్పటికీ పేదల సంక్షేమానికి చేసే ఖర్చులో ప్రభుత్వం ఒక్క పైసా కూడా కోత విధించలేదు. ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు పల్లె సీమల రూపురేఖలు మార్చాలనే మహదాశయంతో ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’కార్యక్రమం నమ్మశక్యం కాని అద్భుత ఫలితాలు అందించింది. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందాయి. ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేస్తోంది. పట్టణాల్లో ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీరు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా ప్రభుత్వం తాగునీటిని సరఫరా చేస్తోంది. 97 శాతం మంది పట్టణ వాసులు ఉచితంగా సురక్షిత మంచినీటి సౌకర్యం పొందగలుగుతున్నారు. పట్టణాలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 కోట్లు విడుదల చేస్తోంది. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు ఇస్తోంది. మిషన్ భగీరథతో రాష్ట్రంలో మంచినీటి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి. రాష్ట్రంలోని 23,968 ఆవాస ప్రాంతాలకు నేడు సురక్షిత మంచినీరు ప్రతిరోజూ అందుతోంది. 98.46 శాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తూ తెలంగాణ రాష్ట్రం గొప్ప విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ప్రకటించడం మనం సాధించిన ఘనతకు దక్కిన గుర్తింపు. అన్నపూర్ణగా మారిన రాష్ట్రం వరి పంట సాగు 35 లక్షల ఎకరాల నుంచి కోటి 4 లక్షల ఎకరాలకు పెరగడం రాష్ట్రంలో మారిన వ్యవసాయ పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రం నేడు దేశానికి అన్నపూర్ణగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరందడం ప్రారంభమయింది. పాలమూరు– రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయడం ద్వారా దాదాపు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. రైతుబంధు కింద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.7,351 కోట్లను ప్రభుత్వం అందించింది. ‘రైతుబీమా’పథకం ప్రారంభించిన నాడు ఏడాది కిస్తీ రూ.630 కోట్లు ఉంటే, నేడు రూ.1,141 కోట్లకు చేరింది. రైతు కుటుంబాల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మొత్తం కిస్తీ చెల్లించి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ధరణి పోర్టల్ 100 శాతం విజయవంతమైంది. రెవెన్యూకు సంబంధించిన అన్ని సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నడుస్తోంది. విద్యుత్, వైద్య రంగాల్లో పురోగతి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ ఏర్పడిన నాడు స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 7,888 మెగావాట్లు కాగా, నేడు 16,245 మెగావాట్లకు చేరింది. తలసరి విద్యుత్ వినియోగం వృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఐసీయూలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్ కిట్ పథకం.. గర్భిణీలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు, ప్రసవ సమయంలో జరిగే మరణాలు గణనీయంగా తగ్గించగలిగింది. రాష్ట్రంలో పదివేల బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలో.. తెలంగాణ వరుసగా మూడో ఏడాది కూడా మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రకటించడం వైద్యరంగంలో రాష్ట్రం సాధించిన పురోగతికి నిదర్శనం. 3.67 శాతం పెరిగిన పచ్చదనం వచ్చే విద్యా సంవత్సరం కోసం జరిగే పోటీ పరీక్షలు, ఎంట్రెన్స్ టెస్టులకు సిద్ధం చేసే విధంగా 9, ఆపై క్లాసుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హరితహారం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 210.68 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. 14.59 లక్షల మందికి ఉపాధి టీఎస్–ఐపాస్ చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రానికి 14,338 పరిశ్రమలు వచ్చాయి. 14,59,639 మందికి ఉద్యోగ అవకాశం లభించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోత్సాహక ఐటీ విధానం వల్ల విశ్వ విఖ్యాత ఐటీ కంపెనీలు తెలంగాణలో కార్యాలయాలు ప్రారంభించాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ రూ. 20,761 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో డేటా సెంటర్ రీజియన్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దుష్ట శక్తులపై ఉక్కుపాదం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం రాజీలేని వైఖరి అవలంభిస్తోంది. సంఘ విద్రోహ శక్తులు, మహిళలను వేధించే దుష్టుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం తెలంగాణలోనే ఉండడం గమనార్హం. పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. సైనిక వందనం స్వీకరించిన గవర్నర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని భారత వాయుసేనకు చెందిన ఎయిర్ వార్ఫేర్ కళాశాల బలగాలు, టీఎస్ఎస్పీ 8వ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సైనిక కవాతు ఆకట్టుకుంది. గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించారు. -
అందరు మెచ్చేలా అభివృద్ధి
మన పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు రెండేళ్లలో ఎంతో చేశాం... ఇంకా చేస్తాం... శాశ్వతంగా కరువు పారదోలేందుకు కృషి దీర్ఘకాలిక ప్రయోజనాలతో పథకాల రూపకల్పన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ అర్బన్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకునేవిధంగా ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 829 మంది గిరిజన వధువులకు రూ.4.22కోట్లు, 1495 మంది ఎస్సీ ఆడపిల్లలకు రూ.7.44కోట్లు, 1651మంది మైనార్టీ వధువులకు రూ.8.42కోట్లు అందజేశాం. బీసీలకు కళ్యాణలక్ష్మి పథకానికి ఇప్పటివరకు 1729 దరఖాస్తులు అందాయి. ఆసరా పథకం ద్వారా వితం తు, వృద్ధాప్య, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, వికలాంగు లు సుమారు 4,35,51 మందికి ప్రతీ నెలా రూ.45.25కోట్లు పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 4141 మహిళా సంఘాలకు రూ.655 కోట్ల లింకేజీ రుణాలు అందించాం. స్త్రీనిధి పథకం కింద 2015–16 ఆర్ధిక సంవత్సరానికి 14307 మహిళా సంఘాలకు రూ.174 కోట్లు రుణాలు ఇచ్చాం. 346 సంక్షేమ హాస్టళ్లలోని 56,034 విద్యార్థులకు ప్రతినెలా 868.780టన్నుల సన్నబియ్యం అందజేస్తున్నాం. ఇంటింటికి నీరు లక్ష్యం : మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లా నీరు లక్ష్యంతో పనులు చేడుతున్నాం. ఈ కార్యక్రమం సీఎం మానస పుత్రికగా ప్రపంచ దేశా ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈనెల 7న ప్రధానిచే ప్రారంభించిన ఈకార్యక్రమం మొదటి దశలో మొత్తం 704 శివారు గ్రామాలకు ఈనెల 31 నాటికి నీరందించే లక్ష్యంతో పనులు పూర్తి చేస్తున్నాం. చెరువుల అభివృద్ధి : కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసి సాగు, తాగునీరు అందించడం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 5839 చెరువులకు గాను మొదటి దశలో రూ.245 కోట్లతో 1059 చెరువులు పునరుద్ధరణ పనులు చేపట్టగా 976 చెరువులు పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా రెండవ దశ పనుల్లో రూ.413కోట్లతో 1085 చెరువు పనులు ప్రారంభించి 253 చెరువు పనులు పూర్తి చేశాం. ములుగు, ఏటూరునాగారం, మంగపేట తాడ్వాయి, మల్లూరుల్లో వర్షా లు కురవడంతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. హరితహారం : వర్షాభావ పరిస్థితులు అధిగమించి అడవుల శాతం పెంచే లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో ఉద్యమ స్పూర్తితో సాగుతోంది. మొదటి దశకార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అదే స్పూర్తిని కొనసాగిస్తూ రెండవ దశ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజల డిమాండ్‌కు తగ్గట్లు పండ్లు, పూల మొక్కలు అందజేసున్నాం. మెరుగైన విద్య : పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాకు ఈ సంవత్సరం 11 సాంఘిక సంక్షేమ, 4డిగ్రీ గురుకులాలు, 4మైనార్టీ గురుకులాలు, 6 గిరిజన గురుకులాలు ప్రారంభించుకున్నాం. జిల్లాను విద్యపరంగా అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా సైనిక్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంరబోత్సవం, గిరిజన విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం,, వ్యవసాయ, వెటర్నరీ కళాశాలల ఏర్పాటు మంజూరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం 476 పాఠశాలల్లో ఆంగ్లమాద్యమం ద్వారా విద్యాభోదన ప్రారంబించాం. ఇటీవల ప్రారంభించుకున్న కాళోజీ హెల్త్ వర్సీటీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. అందుకోసం రూ.25కోట్లు ప్పటికే ప్రభుత్వం మంజూరి చేసింది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీల రూపురేఖలు మారాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నవజాత శిశు సంరక్షణ కోసం ప్రస్తుత కేంద్రాలతోపాటు మహబూబాద్‌లో 20పడకల కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఏజెన్సీ గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధతో వారికి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వాకి వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల రూపొందించాం. రుణమాఫీ నిధులు విడుదల : రెండు విడతల్లో ఇప్పటివరకు రూ.940 కోట్ల రుణ మాఫీ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మూడోవిడతగా రూ.228 కోట్లు రైతుల ఖాతాలో జమచేయడం జరిగింది. త్వరలో నాలుగో విడత నిధులు విడుదలకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు 50శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు పారదర్శకంగా అందజేస్తున్నాం. గోదాముల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లా విభజన : పరిపానా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయసంకల్పించింది. సూక్ష్మస్థాయి పరిశీల న అనంతరం కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం సాదా బైనామాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. అందులో భాగంగా జిల్లాలో సుమారు 3లక్షల వరకు అందిన దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. గ్రేటర్లో అభివృద్ధి ఇలా: వారసత్వ నగరంగా ఎంపికై న ఓరుగల్లు మహానగరంలో హృదయ్, అమృత్, స్మార్ట్సి టీ వంటి పథకాల ద్వారా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నాం. గ్రేటర్ పరిధిలో రూపాయికి నల్లా కనెక్షన్‌కు కోసం 350 దరఖాస్తులు అదాయి. బంగారు తెలంగానకు పునరంకితం సర్వమానవ అభివృద్ధి సాధించినప్పుడు సీఎం కలలుగన్న బంగారు తెలంగాణ లక్ష్యం సాకారం అవుతుంది. ప్రజల విశ్వాçÜం సాధించే దిశగా అభివృద్ధి జరగాల్సింది. ఆ దిశగా బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవుదాం. జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న స్పీకర్ మధుసుదనాచారి, మంత్రి∙చందూలాల్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, రాజ్యసభ, పార్లమెంట్ శాసన మండలి, శాసనసభ సభ్యులకు స్థానిక సంస్థల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ప్రముఖులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసున్నాను.