
వైఎస్సార్ జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటన అప్‌డేట్స్
04:15PM
పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం.
పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో అలుపెరగకుండా శ్రమిస్తున్న లింగాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకరిస్తున్న ప్రజలకు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న అందరికీ ఈ సందర్భంగా సీఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు.
02:05PM
పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ప్రజలు, ముఖ్య నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివరించిన స్థానికులు.
01:35PM
వైఎస్సార్ లేక్‌వ్యూ రెస్టారెంట్ వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
01:20PM
సీఎం జగన్ బోటింగ్
సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీలో సీఎం జగన్.. ఎంపీ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి బోటింగ్ చేశారు.
01:15PM
►సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
01:00PM
వైఎస్సార్ జిల్లా: పార్నపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్న సీఎం జగన్
►కాసేపట్లో బోటింగ్ జెట్టిని ప్రారంభించనున్న సీఎం జగన్
►చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు
►రిజర్వాయర్ వద్ద టూరిజం పార్క్, రెస్టారెంట్, బోటింగ్ ఏర్పాటు
12:50PM
వైఎస్సార్ జిల్లా: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..
►స్వాగతం పలికిన కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జిల్లా అధికారులు.
11:42AM
►గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు బయల్దేరిన సీఎం జగన్
11:20AM
కృష్ణాజిల్లా: తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
►గన్నవరం విమానాశ్రయం నుంచి కాసేపట్లో వైఎస్సార్ కడప జిల్లా బయల్దేరనున్నారు.
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. డిసెంబరు 2, 3వ తేదీల్లో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేటి పర్యటన ఇలా..
►లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్ద బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు.
►అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు.
►అనంతరం లింగాల మండల నాయకులతో మాట్లడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment