అందరు మెచ్చేలా అభివృద్ధి | All favorites Development | Sakshi
Sakshi News home page

అందరు మెచ్చేలా అభివృద్ధి

Published Tue, Aug 16 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

అందరు మెచ్చేలా అభివృద్ధి

అందరు మెచ్చేలా అభివృద్ధి

  • మన పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు
  • రెండేళ్లలో ఎంతో చేశాం... ఇంకా చేస్తాం...
  • శాశ్వతంగా కరువు పారదోలేందుకు కృషి
  • దీర్ఘకాలిక ప్రయోజనాలతో పథకాల రూపకల్పన
  • ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
  • హన్మకొండ అర్బన్‌ :
     
    ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకునేవిధంగా ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... 
     
    రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 829 మంది గిరిజన వధువులకు రూ.4.22కోట్లు, 1495 మంది ఎస్సీ ఆడపిల్లలకు రూ.7.44కోట్లు, 1651మంది మైనార్టీ వధువులకు రూ.8.42కోట్లు అందజేశాం. బీసీలకు కళ్యాణలక్ష్మి పథకానికి ఇప్పటివరకు 1729 దరఖాస్తులు అందాయి. ఆసరా పథకం ద్వారా వితం తు, వృద్ధాప్య, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, వికలాంగు లు సుమారు 4,35,51 మందికి ప్రతీ నెలా రూ.45.25కోట్లు పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 4141 మహిళా సంఘాలకు రూ.655 కోట్ల లింకేజీ రుణాలు అందించాం. స్త్రీనిధి పథకం కింద 2015–16 ఆర్ధిక సంవత్సరానికి 14307 మహిళా సంఘాలకు రూ.174 కోట్లు రుణాలు ఇచ్చాం. 346 సంక్షేమ హాస్టళ్లలోని 56,034 విద్యార్థులకు ప్రతినెలా 868.780టన్నుల సన్నబియ్యం అందజేస్తున్నాం.
     
    ఇంటింటికి నీరు లక్ష్యం : మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లా నీరు లక్ష్యంతో పనులు చేడుతున్నాం. ఈ కార్యక్రమం సీఎం మానస పుత్రికగా ప్రపంచ దేశా ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.  ఈనెల 7న ప్రధానిచే ప్రారంభించిన ఈకార్యక్రమం మొదటి దశలో మొత్తం 704 శివారు గ్రామాలకు ఈనెల 31 నాటికి నీరందించే లక్ష్యంతో పనులు పూర్తి చేస్తున్నాం.
     
    చెరువుల అభివృద్ధి : కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు  చెరువులు అభివృద్ధి చేసి సాగు, తాగునీరు అందించడం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 5839 చెరువులకు గాను మొదటి దశలో రూ.245 కోట్లతో 1059 చెరువులు పునరుద్ధరణ పనులు చేపట్టగా 976 చెరువులు పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా రెండవ దశ పనుల్లో  రూ.413కోట్లతో 1085 చెరువు పనులు ప్రారంభించి 253 చెరువు పనులు పూర్తి చేశాం. ములుగు, ఏటూరునాగారం, మంగపేట తాడ్వాయి, మల్లూరుల్లో వర్షా లు కురవడంతో చెరువులు జలకళ  సంతరించుకున్నాయి. 
     
    హరితహారం : వర్షాభావ పరిస్థితులు అధిగమించి అడవుల శాతం పెంచే లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో ఉద్యమ స్పూర్తితో సాగుతోంది. మొదటి దశకార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అదే స్పూర్తిని కొనసాగిస్తూ రెండవ దశ కార్యక్రమం కొనసాగుతోంది.  ప్రజల డిమాండ్‌కు తగ్గట్లు పండ్లు, పూల మొక్కలు అందజేసున్నాం. 
     
    మెరుగైన విద్య : పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాకు ఈ సంవత్సరం 11 సాంఘిక సంక్షేమ, 4డిగ్రీ గురుకులాలు, 4మైనార్టీ గురుకులాలు, 6 గిరిజన గురుకులాలు ప్రారంభించుకున్నాం. జిల్లాను విద్యపరంగా అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా సైనిక్‌ స్కూల్‌  ఏర్పాటుకు స్థల పరిశీలన, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంరబోత్సవం, గిరిజన విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం,, వ్యవసాయ, వెటర్నరీ కళాశాలల ఏర్పాటు మంజూరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం 476 పాఠశాలల్లో ఆంగ్లమాద్యమం ద్వారా విద్యాభోదన ప్రారంబించాం. ఇటీవల ప్రారంభించుకున్న కాళోజీ హెల్త్‌ వర్సీటీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. అందుకోసం రూ.25కోట్లు ప్పటికే ప్రభుత్వం మంజూరి చేసింది. 
     
    కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీల రూపురేఖలు మారాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నవజాత శిశు సంరక్షణ కోసం ప్రస్తుత కేంద్రాలతోపాటు మహబూబాద్‌లో 20పడకల కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఏజెన్సీ గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధతో వారికి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వాకి వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల రూపొందించాం.
    రుణమాఫీ నిధులు విడుదల : రెండు విడతల్లో ఇప్పటివరకు రూ.940 కోట్ల రుణ మాఫీ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మూడోవిడతగా రూ.228 కోట్లు రైతుల ఖాతాలో జమచేయడం జరిగింది. త్వరలో నాలుగో విడత నిధులు విడుదలకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు 50శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు పారదర్శకంగా అందజేస్తున్నాం. గోదాముల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
     
    జిల్లా విభజన : పరిపానా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయసంకల్పించింది. సూక్ష్మస్థాయి పరిశీల న అనంతరం కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం సాదా బైనామాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. అందులో భాగంగా జిల్లాలో సుమారు 3లక్షల వరకు అందిన దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. 
    గ్రేటర్‌లో అభివృద్ధి ఇలా: వారసత్వ నగరంగా ఎంపికై న ఓరుగల్లు మహానగరంలో హృదయ్, అమృత్, స్మార్ట్‌సి టీ వంటి పథకాల ద్వారా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నాం. గ్రేటర్‌ పరిధిలో రూపాయికి నల్లా కనెక్షన్‌కు కోసం 350 దరఖాస్తులు అదాయి.
     
    బంగారు తెలంగానకు పునరంకితం
    సర్వమానవ అభివృద్ధి సాధించినప్పుడు సీఎం కలలుగన్న బంగారు తెలంగాణ లక్ష్యం సాకారం అవుతుంది. ప్రజల విశ్వాçÜం సాధించే దిశగా అభివృద్ధి జరగాల్సింది. ఆ దిశగా బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవుదాం. జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న స్పీకర్‌ మధుసుదనాచారి, మంత్రి∙చందూలాల్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, రాజ్యసభ, పార్లమెంట్‌ శాసన మండలి, శాసనసభ సభ్యులకు స్థానిక సంస్థల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ప్రముఖులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసున్నాను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement