Deputy cm Kadiyam Srihari
-
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
కొద్ది మంది టీచర్లతోనే విద్యాశాఖకు చెడ్డ పేరు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు విద్యారణ్యపురి : ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెంచాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో డిప్యూటీ సీఎం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఇప్పటికే చాలా అపవాదులున్నాయని.. వాటిని తొలగించేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. కొద్ది మంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే మొత్తం విద్యాశాఖకే చెడ్డపేరు వస్తుందన్నారు. ఇటీవల ప్రథమ్ ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, హాజరు శాతం, తల్లిదండ్రులు ఎందుకు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారనే అంశాలపై చేసిన అధ్యయన నివేదికను తాను పరిశీలించే మాట్లాడనని.. ఇందులో ఎవరిని ఉద్దేశపూర్వకంగా నిందించలేదని ఆయన పేర్కొ న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఉపాధ్యాయుల అంగీకారంతో ఐదు వేల పా ఠశాలల్లో ప్రస్తుత విద్యాSసంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినట్లు వివరించారు ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగిన జ్యోతిరెడ్డి అందరికి ఆదర్శమన్నారు. మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సమాజ సేవకు పాటుపడుతున్న జ్యోతిరెడ్డి సేవలు అభినందనీయమన్నారు. జ్యోతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జ్యోతిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధులతో పాటు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించా లన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు బతుకు పాఠం నేర్పించాలన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. సమావేశంలో విద్యావేత్త డాక్టర్ బండా ప్రకాష్, జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పీఆర్టీయూ జిల్లా›అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బాధ్యులు ఉపేందర్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సదయ్య, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా జనరల్సెక్రటరీ మాల కొండారెడ్డి, జ్యోతిరెడ్డి భర్త సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మీరేం ఇంజనీర్లయ్యా..?
నీటి నిల్వలపై డిప్యూటీ సీఎం కడియం ప్రశ్నల వర్షం సమాధానం చెప్పకపోవడంతో అధికారులపై అసహనం అవగాహన పెంచుకోవాలని సూచనలు పంటలు ఎండిపోకుండా నీరందించాలని ఆదేశాలు వరంగల్ : జిల్లాలో సాగునీటి శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు తమ విభాగంలోని వివరాలను చెప్పకపోవడంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసహనానికి గురయ్యారు. దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ శాఖల ఇంజనీరింగ్, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి జిల్లాలోని ప్రాజెక్టుల రిజర్వాయర్లలో నీటి నిల్వల పరిస్థితిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక చెరువు కింద పూర్తి ఆయకట్టుకు నీరందించాలంటే ఆ చెరువును ఎన్నిసార్లు నింపాల్సి ఉంటుంది.. ఒకసారి నిం పితే ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చని ఒక ఇం జనీరింగ్ అధికారిని ఆయన ప్రశ్నించారు. దీం తో అధికారి నుంచి సమాధానం రాకపోవడం తో డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంజినీర్లు తమ పరిధిలోని చెరువుల ఆయకట్టుకు నీరందించే వివరాలు, లభ్యత గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు. జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుల్లో నీటిని నింపి వాటి పరిధిలో ఆయకట్టుకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేయాలి.. మొక్కజొన్న, పత్తి పంటల పరిస్థితిపై వ్యవసాయ అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండలాల వారీగా సమీక్షించారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుత ఆగస్టులో ఇప్పటివరకు వర్షాలు పడలేదని, మొక్కజొన్న 61 వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా.. 22వేల హెక్టార్లలో ఎండిపోయే పరిస్థితులు ఏర్పడినట్లు వ్యవసాయాధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేవాదు ల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ ఎల్ఎండీ కాల్వల ద్వారా నీటి లభ్యతకు అనుగుణంగా తాగునీటికి సరిపడే నిల్వలు పోనూ మిగిలిన నీటిని ఆయకట్టుకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులను సెప్టెంబర్‌లో గా నింపేందుకు రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, సాగునీటి పారుదల శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించుకుని పనిచేయాలన్నారు. దేవాదుల పంపింగ్‌తో ధర్మసాగర్ చెరువు కింద దక్షిణ, ఉత్తర కాల్వల ద్వారా బుధవారం(నేటి) నుంచి మొదటి విడత ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఉత్తర కాల్వ ద్వారా 5 క్యూమెక్సులు, దక్షిణ కాల్వ ద్వారా 6 క్యూమెక్సుల నీటిని మొదటి పది రోజులపాటు వార బందీ పద్ధతితో విడుదల చేయాలని సూచించారు. వారం రోజుల తర్వాత సరిపోయే నీటి మట్టం వచ్చిన తర్వాత ఆర్ఎస్.ఘనపురం కుడి కాలు వ ద్వారా పదిరోజుల పాటు వారబందీ పద్ధతి లో అందించాలన్నారు. సెప్టెం బర్ నాటికి వీటి పరిధిలోని అన్ని చెరువులకు నీటిని విడుదల చేయాలన్నారు. నీటి విడుదల సమయంలో కాల్వలకు గండ్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కలెక్టర్ కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీఈ విజయ్‌ప్రకాశ్, దేవాదుల సీఈ వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్ఈ వీరయ్య, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, జేడీఏ ఉషా, అధికారులు పాల్గొన్నారు. -
అందరు మెచ్చేలా అభివృద్ధి
మన పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు రెండేళ్లలో ఎంతో చేశాం... ఇంకా చేస్తాం... శాశ్వతంగా కరువు పారదోలేందుకు కృషి దీర్ఘకాలిక ప్రయోజనాలతో పథకాల రూపకల్పన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ అర్బన్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకునేవిధంగా ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 829 మంది గిరిజన వధువులకు రూ.4.22కోట్లు, 1495 మంది ఎస్సీ ఆడపిల్లలకు రూ.7.44కోట్లు, 1651మంది మైనార్టీ వధువులకు రూ.8.42కోట్లు అందజేశాం. బీసీలకు కళ్యాణలక్ష్మి పథకానికి ఇప్పటివరకు 1729 దరఖాస్తులు అందాయి. ఆసరా పథకం ద్వారా వితం తు, వృద్ధాప్య, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, వికలాంగు లు సుమారు 4,35,51 మందికి ప్రతీ నెలా రూ.45.25కోట్లు పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 4141 మహిళా సంఘాలకు రూ.655 కోట్ల లింకేజీ రుణాలు అందించాం. స్త్రీనిధి పథకం కింద 2015–16 ఆర్ధిక సంవత్సరానికి 14307 మహిళా సంఘాలకు రూ.174 కోట్లు రుణాలు ఇచ్చాం. 346 సంక్షేమ హాస్టళ్లలోని 56,034 విద్యార్థులకు ప్రతినెలా 868.780టన్నుల సన్నబియ్యం అందజేస్తున్నాం. ఇంటింటికి నీరు లక్ష్యం : మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లా నీరు లక్ష్యంతో పనులు చేడుతున్నాం. ఈ కార్యక్రమం సీఎం మానస పుత్రికగా ప్రపంచ దేశా ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈనెల 7న ప్రధానిచే ప్రారంభించిన ఈకార్యక్రమం మొదటి దశలో మొత్తం 704 శివారు గ్రామాలకు ఈనెల 31 నాటికి నీరందించే లక్ష్యంతో పనులు పూర్తి చేస్తున్నాం. చెరువుల అభివృద్ధి : కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసి సాగు, తాగునీరు అందించడం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 5839 చెరువులకు గాను మొదటి దశలో రూ.245 కోట్లతో 1059 చెరువులు పునరుద్ధరణ పనులు చేపట్టగా 976 చెరువులు పూర్తి చేసి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా రెండవ దశ పనుల్లో రూ.413కోట్లతో 1085 చెరువు పనులు ప్రారంభించి 253 చెరువు పనులు పూర్తి చేశాం. ములుగు, ఏటూరునాగారం, మంగపేట తాడ్వాయి, మల్లూరుల్లో వర్షా లు కురవడంతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. హరితహారం : వర్షాభావ పరిస్థితులు అధిగమించి అడవుల శాతం పెంచే లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో ఉద్యమ స్పూర్తితో సాగుతోంది. మొదటి దశకార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అదే స్పూర్తిని కొనసాగిస్తూ రెండవ దశ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజల డిమాండ్‌కు తగ్గట్లు పండ్లు, పూల మొక్కలు అందజేసున్నాం. మెరుగైన విద్య : పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాకు ఈ సంవత్సరం 11 సాంఘిక సంక్షేమ, 4డిగ్రీ గురుకులాలు, 4మైనార్టీ గురుకులాలు, 6 గిరిజన గురుకులాలు ప్రారంభించుకున్నాం. జిల్లాను విద్యపరంగా అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా సైనిక్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంరబోత్సవం, గిరిజన విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం,, వ్యవసాయ, వెటర్నరీ కళాశాలల ఏర్పాటు మంజూరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం 476 పాఠశాలల్లో ఆంగ్లమాద్యమం ద్వారా విద్యాభోదన ప్రారంబించాం. ఇటీవల ప్రారంభించుకున్న కాళోజీ హెల్త్ వర్సీటీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. అందుకోసం రూ.25కోట్లు ప్పటికే ప్రభుత్వం మంజూరి చేసింది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీల రూపురేఖలు మారాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నవజాత శిశు సంరక్షణ కోసం ప్రస్తుత కేంద్రాలతోపాటు మహబూబాద్‌లో 20పడకల కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఏజెన్సీ గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధతో వారికి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వాకి వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల రూపొందించాం. రుణమాఫీ నిధులు విడుదల : రెండు విడతల్లో ఇప్పటివరకు రూ.940 కోట్ల రుణ మాఫీ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మూడోవిడతగా రూ.228 కోట్లు రైతుల ఖాతాలో జమచేయడం జరిగింది. త్వరలో నాలుగో విడత నిధులు విడుదలకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు 50శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు పారదర్శకంగా అందజేస్తున్నాం. గోదాముల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లా విభజన : పరిపానా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయసంకల్పించింది. సూక్ష్మస్థాయి పరిశీల న అనంతరం కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం సాదా బైనామాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. అందులో భాగంగా జిల్లాలో సుమారు 3లక్షల వరకు అందిన దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. గ్రేటర్లో అభివృద్ధి ఇలా: వారసత్వ నగరంగా ఎంపికై న ఓరుగల్లు మహానగరంలో హృదయ్, అమృత్, స్మార్ట్సి టీ వంటి పథకాల ద్వారా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నాం. గ్రేటర్ పరిధిలో రూపాయికి నల్లా కనెక్షన్‌కు కోసం 350 దరఖాస్తులు అదాయి. బంగారు తెలంగానకు పునరంకితం సర్వమానవ అభివృద్ధి సాధించినప్పుడు సీఎం కలలుగన్న బంగారు తెలంగాణ లక్ష్యం సాకారం అవుతుంది. ప్రజల విశ్వాçÜం సాధించే దిశగా అభివృద్ధి జరగాల్సింది. ఆ దిశగా బంగారు తెలంగాణకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవుదాం. జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న స్పీకర్ మధుసుదనాచారి, మంత్రి∙చందూలాల్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, రాజ్యసభ, పార్లమెంట్ శాసన మండలి, శాసనసభ సభ్యులకు స్థానిక సంస్థల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ప్రముఖులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసున్నాను. -
విద్యాకేంద్రంగా ఓరుగల్లు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మడికొండలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం మడికొండ : వరంగల్ నగరాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. మడికొండలో ఏర్పాటుచేసిన ‘ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జిల్లాలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల సొంత భవన నిర్మాణానికి త్వరలోనే 14 ఎకరాల భూమి కేటాయిస్తామని, మిగతా ప్రాంతాల్లోని భవనాలను తలదన్నేలా ఇక్కడ అత్యాధునిక వసతులతో భవనం నిర్మించాలన్నారు. అలాగే, హైదరాబాద్ రామంతాపూర్‌లోని పాఠశాల ప్రమాణాలనే ఇక్కడా కొనసాగించాలని సొసైటీ నిర్వాహకులకు కడియం సూచించారు. త్వరలోనే ఐఐఎం వరంగల్‌లో ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నాయని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే, త్వరలోనే సైనిక్ స్కూల్, రాక్వెల్ స్కూల్‌తో పాటు ఐఐఎం ఏర్పాటుకానున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో ఎలాంటి అభివృద్ధి అయినా తమ నియోజకవర్గం నుండే జర గడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని సుచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు బీ.వీ.పాపారావు, కలెక్టర్ వాకటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, స్థానిక కార్పొరేటర్ జోరిక రమేష్, మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ జగదీశ్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్యాంమోహన్, సొసైటీ సభ్యులు రాఘురాం, గుస్తీ జైన్, మర్రి ఆదిత్యరెడ్డి, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ఈ.వీ.శ్రీనివాస్, స్థానిక నాయకులు మద్దెల నారాయణస్వామి, బైరి కొంరయ్య, తాడూరి మోహన్, రాజేందర్, రవీందర్, రవి పాల్గొన్నారు. -
ఐదు కోట్ల మెుక్కలు నాటాలి
హరితహారంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : హరితహారంలో జిల్లాలో ఐదు కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మంది రంలో మంగళవారం హరితహారం కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ హరితహారంలో జిల్లా లక్ష్యం 4 నుంచి 5 కోట్ల మొక్కలకు పెరిగిందన్నారు. అధికారులు ప్రణాళికను తయారు చేసుకుని జిల్లాలో విరివిగా మెుక్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. గత ఏడాది హరితహారంలో మన జిల్లా మొదటì æస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున అన్ని వర్గాల ప్రజలను మెుక్కలు నాటడంలో భాగస్వాములను చేసి వరంగల్‌ను మరోసారి ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల, వరద కాల్వ ప్రాంతాల్లో, చిన్ననీటి పారుదల శాఖ స్థలాల్లో మొక్కలు పెద్ద ఎత్తున నాటాలన్నారు. డీ గ్రేడెడ్ ఫారెస్టులో యూకలిప్టస్ మెుక్కలను విరివిగా పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి రో డ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఖమ్మం జిల్లా లో మన సరిహద్దు నుంచి రోడ్డుకు ఇరువైపులా మెుక్కలు పెంచారని, మన జిల్లాలో కూడా అదే విధంగా రోడ్లకు ఇరువైపులా పెంచాలన్నారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనని సర్పంచ్‌లకు లేఖలు రాయాలని అధికారులకు సూచించారు. హరితహారంతో జిల్లాను పచ్చదనంతో నింపాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఇంటికి 5 పూలు, 5 పండ్ల మొక్కలు ఇవ్వాలన్నారు. ఈ నెల15 నాటికి ఎంచుకున్న లక్ష్యంలో 80 శాతం పూర్తి చే యాలన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడు తూ ఇప్పటి వరకు జిల్లాలో 2.11 కోట్ల మొక్కలు నాటామని.. 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. 142 ప్రదేశాల్లో 95 శాతం మొక్కలు బతికి ఉన్నాయని తెలిపారు. వచ్చే ఏడాది మొక్కల పెంపకానికి కూడా రెండు రోజుల్లో నర్సరీల వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమీక్షలో జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు రాజయ్య, కొండా సురేఖ, శంకర్‌నాయక్, మునిసిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
కడియం పాలనలో అధ్వానంగా విద్యా వ్యవస్థ
టీడీపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు చిట్యాల : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాలనలో విద్యా వ్యవస్థ అధ్వానంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ధ్వజ మెత్తారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్టీ మండల అధ్యక్షుడు పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సత్యనారాయణరావు మాట్లాడుతూ హాస్టల్ భవనం నాలుగేళ్లుగా నిర్మాణానికే పరిమితం కావడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు ఇన్నేళ్లుగా రాకపోకలు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మోడల్ స్కూల్లో ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేదని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో నీళ్లచారు పోస్తుండగా విద్యార్థులు ఇంటి నుంచి బాక్సు లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. కనీసం స్పీకర్ పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా, మండల నాయకులు తిరుపతిరెడ్డి, దొడ్డి కిష్టయ్య, రత్నాకర్‌రెడ్డి, తోట గట్టయ్య, చిలుకల రాయకొమురు, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, గుమ్మడి శ్రీదేవి, సత్యం, పర్లపల్లి కుమార్, మల్లేష్, రామకృష్ణ, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కడియంకు కేసీఆర్ ఝలక్
హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఝలక్ ఇచ్చారా. కడియం శ్రీహరితో తీవ్ర విబేధాలున్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావును పార్టీలో చేర్చుకోవడం వెనుక ఏం జరిగిందన్న అంశం ఇప్పుడు టీఆర్ఎస్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎర్రబెల్లిని టీఆర్ఎస్లో చేర్చుకోవడం వెనుక కేసీఆర్‌కు పెద్ద వ్యూహమే ఉన్నట్టు పార్టీలో బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులను చేర్చుకోవడం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని, ఆ కారణంగానే ఎర్రబెల్లితో పాటు ప్రకాష్ గౌడ్లను పార్టీలో చేర్చుకోవడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వాదన కేవలం తెరమీద కనిపించేది మాత్రమేనని, కొందరు నేతలను కట్టడి చేయడం కోసమే ఇలాంటి చేరికలను కేసీఆర్ ఆమోదించారని తెరవెనుక మరో అభిప్రాయం కూడా బలంగా ఉంది. వరంగల్ జిల్లాలో రాజకీయ వైరుధ్యం ఉన్న కారణంగా ఇంతకాలం ఎర్రబెల్లి దయాకర్‌రావును టీఆర్ఎస్లోకి రాకుండా కడియం శ్రీహరి అడ్డుకుంటూ వచ్చారు. ఇంతకాలంగా అడ్డుకుంటున్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల విజయోత్సాహం నెలకొన్న తరుణంగా చడీచప్పుడు కాకుండా ఒక్కసారిగా ఎర్రబెల్లిని పార్టీలో చేర్పించుకోవడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే ఇందులో మతలబు వేరే ఉందని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం ప్రాధాన్యతను కొంత మేరకు తగ్గిస్తున్నామన్న పరోక్ష సంకేతాలు పంపించాలన్న ఉద్దేశంతోనే తాజా చేరికలకు కేసీఆర్ అంగీకరించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. విపక్షాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రేటర్ లో పట్టు సాధించడానికి దాని పరిధిలోని 150 డివిజన్లలో మెజారిటీ సాధించడంపైనే వ్యూహరచన చేశారు. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలోకి వచ్చే 23 అసెంబ్లీ సెగ్మెంట్లలో మంత్రులను ఇంచార్జీలుగా నియమించారు. కడియం శ్రీహరిని ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఇంచార్జీగా నియమించారు. అయితే కడియం మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియను వదిలేసి తన కుటుంబ సభ్యులను గడపడానికి విదేశీ పర్యటనకు వెళ్లారని తెలిసింది. ఆయన విదేశాలకు వెళ్లడం కేసీఆర్ ఆగ్రహం తెప్పించిదని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించారని చెబుతున్నారు. కీలకమైన ఎన్నికలకు సంబంధించి బాధ్యతలు అప్పగించినప్పుడు వాటిని తేలికగా తీసుకున్న నేపథ్యంలోనే కడియంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఎర్రబెల్లిని చేర్చుకున్నారన్న అభిప్రాయం పార్టీలోని కొంతమంది నేతలు చెబుతున్నారు. ఇదిలావుండగా, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో వేర్వేరు పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులను టీఆర్ఎస్ లో చేర్పించుకున్న కేసీఆర్ వ్యూహం ముందుముందు ఎలా ఉండబోతోందన్న విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా జిల్లాలో వేర్వేరు ధ్రువాలుగా పనిచేస్తున్న కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కొండా మురళి... వీరు ఒకరి తర్వాత ఒరన్నట్టు టీఆర్ఎస్ లో చేరుతూ వచ్చారు. ఇప్పుడు ఆ ముగ్గురిని సమన్వయ పరుస్తారా... సుదీర్ఘ కాలంగా రాజకీయ వైరుధ్యాలతో పనిచేస్తున్న ఈ నేతలు ఒక్కతాటిపై పనిచేయడం సాధ్యమవుతుందా... ఈ విషయంలో కేసీఆర్ వ్యూహమేంటి అన్న దానిపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చలు మొదలయ్యాయి.