ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
-
కొద్ది మంది టీచర్లతోనే విద్యాశాఖకు చెడ్డ పేరు
-
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
-
జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
విద్యారణ్యపురి :
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెంచాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో డిప్యూటీ సీఎం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఇప్పటికే చాలా అపవాదులున్నాయని.. వాటిని తొలగించేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. కొద్ది మంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే మొత్తం విద్యాశాఖకే చెడ్డపేరు వస్తుందన్నారు. ఇటీవల ప్రథమ్ ఎన్ జీఓ సంస్థ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, హాజరు శాతం, తల్లిదండ్రులు ఎందుకు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారనే అంశాలపై చేసిన అధ్యయన నివేదికను తాను పరిశీలించే మాట్లాడనని.. ఇందులో ఎవరిని ఉద్దేశపూర్వకంగా నిందించలేదని ఆయన పేర్కొ న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
ఉపాధ్యాయుల అంగీకారంతో ఐదు వేల పా ఠశాలల్లో ప్రస్తుత విద్యాSసంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినట్లు వివరించారు ఎన్‌ఆర్‌ఐ జ్యోతిరెడ్డి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగిన జ్యోతిరెడ్డి అందరికి ఆదర్శమన్నారు. మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సమాజ సేవకు పాటుపడుతున్న జ్యోతిరెడ్డి సేవలు అభినందనీయమన్నారు. జ్యోతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జ్యోతిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధులతో పాటు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించా లన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు బతుకు పాఠం నేర్పించాలన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. సమావేశంలో విద్యావేత్త డాక్టర్ బండా ప్రకాష్, జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పీఆర్‌టీయూ జిల్లా›అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బాధ్యులు ఉపేందర్‌రెడ్డి, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సదయ్య, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా జనరల్‌సెక్రటరీ మాల కొండారెడ్డి, జ్యోతిరెడ్డి భర్త సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.