సాక్షి, మచిలీపట్నం: సెప్టెంబరు 5వ తేదీ గురుపూజోత్సవం సంద ర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అన్నారు. ప్రొఫార్మాలో వివరాలు పూర్తి చేసి సంబంధిత తనిఖీ అధికారులకు ఈ నెల 24వ తేదీలోగా అందజేయాలన్నారు. డీవైఈవో, ఎంఈవోల వరకు వచ్చిన దరఖాస్తులను ఒక్కటి మాత్రమే ఎంపిక చేసి ఈనెల 26వ తేదీలోగా నిర్ణీత ప్రొఫార్మాలో డీఈఓ కార్యాలయానికి అందజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment