District education officer
-
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
సాక్షి, మచిలీపట్నం: సెప్టెంబరు 5వ తేదీ గురుపూజోత్సవం సంద ర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అన్నారు. ప్రొఫార్మాలో వివరాలు పూర్తి చేసి సంబంధిత తనిఖీ అధికారులకు ఈ నెల 24వ తేదీలోగా అందజేయాలన్నారు. డీవైఈవో, ఎంఈవోల వరకు వచ్చిన దరఖాస్తులను ఒక్కటి మాత్రమే ఎంపిక చేసి ఈనెల 26వ తేదీలోగా నిర్ణీత ప్రొఫార్మాలో డీఈఓ కార్యాలయానికి అందజేయాలన్నారు. -
ఎక్కడి పుస్తకం అక్కడే..!
దేవుడు వరమిచ్చినా.. పూజారి అనుగ్రహించలేదన్నట్టుంది జిల్లాలో పాఠ్య పుస్తకాల సరఫరా. ప్రతి సంవత్సరం సకాలంలో పుస్తకాలు రాక ఇబ్బంది పడుతుంటే..ఈ సారి సకాలంలో వచ్చినా వాటిని పంపిణీ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. డబ్బుల చెల్లింపులో వచ్చిన పంచాయతీ విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ప్రతి ఏటా జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరడంలో ఆలస్యం జరిగేది.. కానీ, ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు సకాలంలో జిల్లా గోదాంకు చేరినా సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పుస్తకాలు సరఫరా చేసే వాహన కాంట్రాక్టర్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో పాటు, పుస్తకాలను లోడ్ చేసే కూలీలకు వేతనం కూడా ఇవ్వలేదు. దీంతో వారు పాఠ్యపుస్తకాల సరఫరా నిలిపివేశారు. పాఠ్యపుస్తకాలు సరిపడినన్ని ఉన్నా విద్యార్థులకు అందజేయలేని దుస్థితిలో విద్యాశాఖ ఉంది. పాఠశాలలు తెరిచేనాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేస్తామని ప్రకటించిన విద్యాశాఖాధికారులు, నిధులు లేవని చేతులెత్తేయడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 15లక్షల పుస్తకాలే సరఫరా.. జిల్లాలో 2,725 ప్రాథమిక, 578 యూపీఎస్, 657 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటి లో సుమారు 4.50లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి 2015-16 విద్యాసంవత్సరానికి 25,54,404 పాఠ్యపుస్తకాలు అవస రం. వీటిలో జిల్లాకు 24,28, 821 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. పుస్తకాల ను మండల కేంద్రాలకు తరలించేం దుకు టెండర్లు నిర్వహించి రూ.9లక్షలకు ప్రదీప్‌కుమార్ అనే కాంట్రాక్టర్ కు అప్పగించారు. టెండర్ల సందర్భం గా వాహనాల డీజిల్ఖర్చు, లేబర్ చార్జీలకు కొంత మొత్తం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మే 26 నుంచి పాఠ్యపుస్తకాల సరఫరా ప్రా రంభించారు. 20రోజుల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి మొదటి విడత 64 మండలాలకు సరఫరా చేసిన తర్వాత కాంట్రాక్టర్, లే బర్ జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి తమకు డీజిల్‌కు, కూలి డబ్బులు చె ల్లించాలని కోరారు. నిధులు లేవని.. వారంరోజుల్లో ఇస్తామని చెప్పడంతో రెండోవిడత 14మండలాలకు మొత్తం ఇప్పటివరకు 15,12,345 పాఠ్యపుస్తకాలను మండలాలకు సరఫరా చేశా రు. ఒక్క పైసాకూడా విడుదల చేయకపోవడంతో తమకు కూలి డబ్బులు చెల్లిస్తేనే పాఠ్యపుస్తకాలను సరఫరా చే స్తామని లేబర్ రాకపోవడంతో కాం ట్రాక్టర్లు నాలుగు రోజులుగా వాహనాలను గోదాం ఎదుటే నిలుపుకొని ఉన్నారు. ప్రతి ఏటా ముందుగానే చెల్లించే వారు.. ప్రతి ఏటా టెండర్ తర్వాత పుస్తకాలు సరఫరా చేసేట ప్పుడు వాహనాల డీజిల్‌కు, లేబర్ కూలి చెల్లించేందుకు టెండర్ ధరలో 30శాతం నిధులు విడుదల చేసే వారు. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్కపైసా ఇవ్వలేదు. లేబర్ కూలి చెల్లిస్తేనే వస్తమంటున్నారు. డీఈఓ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ప్రతిరోజు వాహనాల కిరాయి రూ.2వేలు చెల్లిస్తూ నాలుగు రోజులుగా వృథాగా గోదాం ఎదుట నిలుపుకున్నాం. -ప్రదీప్‌కుమార్, పుస్తకాల సరఫరా కాంట్రాక్టర్. నిధులు లేకపోవడం వల్లనే... నిధులు లేక పోవడం వల్లే డబ్బులు చెల్లించలేదు. టెండర్ సందర్భంగా మొత్తం సరఫరా చేసిన తర్వాతనే డబ్బులు ఇస్తామని ఏజేసీ చెప్పారు. కానీ, ముందుగానే చెల్లించాలని కాంట్రాక్టర్ అడుగుతున్నాడు. వెంటనే వారికి కొంత డబ్బు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అన్ని మండలాలకు చేరాయి. మిగతా పుస్తకాలు వెంటనే చేరవేసేలా చర్యలు తీసుకుంటాం. -నాంపల్లి రాజేష్ ,జిల్లా విద్యాశాఖాధికారి -
కొత్త డీఈఓగా రాజేశ్వర్
మెదక్/సంగారెడ్డి, న్యూస్‌లైన్: ఎట్టకేలకు జిల్లా విద్యాశాఖాధికారి గాజర్ల రమేష్ బదిలీ అయ్యారు. ఆదివారం ఉదయం కొత్త డీఈఓగా రాజేశ్వర్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రమేష్‌తో ఉపాధ్యాయ సంఘాలకు ఏర్పడిన భేదాభిప్రాయాల వల్ల విద్యాశాఖలో వివాదానికి దారి తీసిన విషయం విదితమే. 2012 ఏప్రిల్‌లో రమేష్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విద్యాశాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విద్యార్థుల స్థాయి, నిధుల వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ పాఠశాలలను సందర్శిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తూ.. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించారన్న వాదనలున్నాయి. 2013 ఫిబ్రవరిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఒక్కసారిగా ఆయనపై మండిపడ్డాయి. రమేష్ కఠిన వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఉపాధ్యాయులంతా సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. స్పందించిన అప్పటి కలెక్టర్ దినకర్‌బాబు ఉపాధ్యాయుల సంఘాలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కాని డీఈఓకు ఉపాధ్యాయ సంఘాల మధ్య అంతరం అలాగే కొనసాగింది. రమేష్ పనిచేసిన రెండేళ్ల కాలంలో పలువురు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతోపాటు సుమారు 46 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఓ ప్రైవేట్ పాఠశాల విషయమై సంగారెడ్డి ఎమ్మెల్యేకు డీఈఓ రమేష్ మధ్య వివాదం నెలకొంది. ఇదే సమయంలో డీఈఓ రమేష్ పదోన్నతులను ఇవ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు నష్టపోయారని, డీసీసీబీ నిధులను తన కార్యాలయానికి వినియోగించుకున్నారని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదాలు ముదిరి పాకాన పడటంతో ఫిబ్రవరి 2014లో డీఈఓ రమేష్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే డీఈఓ రమేష్ అప్పటికే ఎన్నికల విధుల్లో భాగంగా మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా పనిచేస్తున్నందున ఆయన బదిలీ ఆగిపోయింది. అనంతరం ఎన్నికల విధులు ముగిసినందున ఆదివారం రాజేశ్వర్ మెదక్ డీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించగా, రమేష్ బదిలీపై డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు వెళ్లిపోయారు. సమష్టి కృషితోనే విద్యాభివృద్ధి: డీఈఓ రాజేశ్వర్ ఉపాధ్యాయులు, అధికారుల సమష్టి కృషితోనే విద్యాభివృద్ధి జరుగుతుందని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిని సందర్శించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ జిల్లాను విద్యాపరంగా ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట విద్యాశాఖ అధికారులు భుజంగం, గీతా, చర్చి ప్రాపర్టీ మేనేజర్ సుబ్రహ్మణ్యం, సంగారెడ్డి డిప్యూటీ ఈఓ శోభారాణి తదితరులు ఉన్నారు.