 
							ఆరిలోవ: పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు కావడం..దీనికి వీకెండ్ తోడవడంతో పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి
 
							నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి శనివారం పర్యాటకులతో కళకళలాడింది
 
							ఘాట్ రోడ్డు చెక్‌పోస్టు నుంచి కై లాసగిరి కొండపై ఆర్చ్ వరకు వాహనాలు బారులు తీరాయి
 
							మరో పక్క రోప్‌వే, నడక మార్గం ద్వారా అధిక సంఖ్యలో సందర్శకులు కొండపైకి చేరుకొన్నారు
 
							దీంతో కై లాసగిరిపై ఎక్కడ చూసిన సందర్శకుల సందడి నెలకొంది. సందర్శకులు శివపార్వతులు విగ్రహం వద్ద, వ్యూపాయింట్, ఐ లవ్ కై లాసగిరి పాయింట్, సర్క్యూట్ ట్రైన్ స్టేషన్ వద్ద గుంపులుగా ఫొటోలు తీసుకొన్నారు
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
