సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ధాన్యం కొనుగోళ్లపై మంత్రిని రైతులు నిలదీశారు. 10 రోజులైనా ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదని మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు.
ఈ క్రాప్ జరిగినప్పటికీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. 1262 ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రశ్నించడంతో అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదేశించినా ఎందుకు కొనడం లేదంటూ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సాయంత్రానికల్లా ధాన్యం కొని.. రేపటికల్లా డబ్బులు పడేలా చేస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’
Comments
Please login to add a commentAdd a comment