సాక్షి, కాకినాడ జిల్లా: ‘సీజ్ ది షిప్’ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మల్టీ డిస్ ప్లయినరీ కమిటీతో స్టెల్లా ఎల్ వన్ నౌకలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో తమ అనుకూల మీడియాకు మాత్రమే కూటమి సర్కార్ అనుమతిస్తోంది.
పోర్ట్ అథారిటీ అధికారంతో స్టెల్లా నౌకను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే అంతర్జాతీయ షిప్‌ను సీజ్ చేసే విషయంలో అధికారులు తర్జనభజర్జన పడుతున్నారు. ఐదు రోజుల క్రిందట "సీజ్ ద షిప్" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సముద్రంలో ఉన్న కెన్ స్టార్ నౌకను పరిశీలించకుండా పవన్ వచ్చేశారు.
ఇదీ చదవండి: డైవర్షన్ క్లాప్.. ఫ్లాప్ బాబు స్క్రిప్ట్ బోల్తా
తమ వియ్యంకుడు బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారంటూ పట్టాభి అగ్రో ఫుడ్ అధినేత కే.వి.కృష్ణారావు గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు. తాజాగా కాకినాడ పోర్టు నుండి పట్టాభి అగ్రో ఫుడ్ చెందిన రా రైస్ (పచ్చి బియ్యం) విదేశాలకు ఎగుమతి అవుతోంది. "బిరస్ బుల్లోగ్" ప్యాకింగ్‌తో పచ్చి బియ్యాన్ని ఎంవీడీడీఎస్ మరీనా నౌకలోకి ఎగుమతి చేస్తున్నారు. ఇండోనేషియాకు 12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని పట్టాభి అగ్రో ఫుడ్ సంస్థ ఎగుమతి చేస్తోంది.
ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్!
Comments
Please login to add a commentAdd a comment