దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం | New districts formation to be declared on October 11 | Sakshi
Sakshi News home page

దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం

Published Wed, Jun 8 2016 6:43 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం - Sakshi

దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం

హైదరాబాద్‌: దసరా పండుగ రోజున తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగాంగానే కొత్త జిల్లాల పునర్విభజనకు రోడ్‌ మ్యాప్‌ను బుధవారం తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 20న మరోసారి తెలంగాణ కలెక్టర్లు సమావేశం కానున్నారు. జిల్లాల విభజనపై సమగ్ర నివేదికతో రావాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించినట్టు తెలిసింది. అదేవిధంగా జూన్‌ 30 లోపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో అభిప్రాయ సేకరణ జరగాలన్నారు.

జూలై 5న మరోసారి కలెక్టర్లు సమావేశం కానున్నారు. జూలై 10 లేదా 11న జిల్లాల ఏర్పాటుపై సీఎం నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల ఏర్పాటుపై ఆగస్టు 4 నుంచి 10 లోపు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ వచ్చిన రోజు నుంచి నెలలోపు అభ్యంతరాల స్వీకరణ జరుగనుంది. దాంతో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్‌ 11 దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement