శ్వేతపత్రం విడుదల చేయాలి | BJP leader Indrasena reddy fires on TRS | Sakshi
Sakshi News home page

శ్వేతపత్రం విడుదల చేయాలి

Published Wed, Apr 12 2017 1:37 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

శ్వేతపత్రం విడుదల చేయాలి - Sakshi

శ్వేతపత్రం విడుదల చేయాలి

కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంపై ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్ల సమావేశం ద్వారా జిల్లాల్లో అభివృద్ధికి ఏ విధమైన దిశానిర్దేశం చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘంగా సాగిన కలెక్టర్ల సమావేశంలో రైతులు మొదలుకుని సామాన్యుల వరకు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన దాఖలాలు కనిపించలేదని పేర్కొన్నారు.

 ప్రతిపక్షాలు పలు కేసుల్లో కోర్టులకు వెళ్లి తెచ్చుకున్న స్టేలపై సంబంధిత శాఖల ముఖ్యకార్యదర్శులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవాలన్న కేటీఆర్, హరీశ్‌ ఆదేశాలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేలా ఉన్నాయని తెలిపారు. దీనిపై హైకోర్టు సుమోటోగా కేసు పెట్టి, విచారించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement