సాక్షి, హైదరాబాద్/ నల్లకుంట: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఇంద్రసేన్‌రెడ్డి (81) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమాజి గూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కళాశాల రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఇంద్రసేన్‌రెడ్డి 1960 దశకం మొదట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి యూని యన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1972లో ఉమ్మడి ఏపీ యూత్‌కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన 1975లో జాతీయ యువ జన కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. ఏపీసీసీ ఉపా ద్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్ర సేన్‌రెడ్డి ఏఐసీసీ సభ్యుడిగా, ఏపీ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్‌గా, టి. అంజయ్య మంత్రివర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, ఏపీఐడీసీ చైర్మన్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు.
సీఎం సంతాపం
మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి మృతి పట్ల ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఎంతో సేవ చేసిన ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment