
దంపతులను ఒకేచోటకు బదిలీ చేయండి: కేసీఆర్
హైదరాబాద్: ఉద్యోగులైన దంపతులు ఒకే చోట పనిచేసేలా బదిలీలు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లతో కేసీఆర్ సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. మహిళలకు ఆత్మ రక్షణ విద్య అన్ని చోట్ల నేర్పాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, క్లీన్ ద విలేజ్ పేరిట పరిశుభ్రమైన గ్రామాలకు కలెక్టర్ అవార్డు పేరిట నగదు ప్రోత్సాహం అందించాలని కేసీఆర్ సూచించారు. కుటుంబంలో ఆసరా పెన్షన్ లబ్దిదారులతోపాటు బీడీ కార్మికులుంటే వారికి భృతి కల్పించాలని, గుడుంబా నివారణ చర్యలతోపాటు తయారీదారులకు ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.