కరువు సహాయక చర్యలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
హైదరాబాద్: కరువు సహాయక చర్యలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. శుక్రవారం ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యేకించి మధ్యాహ్నం వేళల్లో ఉపాధి హామీ పనులు చేయించొద్దని చెప్పారు. గ్రామాల్లో పశుగ్రాసం కొరత లేకుండా చూడాలన్నారు. ఖరీఫ్ కు ఇప్పటినుంచే అధికారులు సిద్ధం కావాలని కేసీఆర్ సూచించారు. పత్తి పంటకు భవిష్యత్ లేదని, ప్రత్యామ్నాయం చూడాలన్నారు.
పత్తికి బదులు సోయాబీన్, మొక్కజొన్న పంటలు సాగుచేయాలని ఆయన సూచించారు. త్వరలో మూడో విడత రైతు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది 106 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి చెప్పారు.