
ఫైల్ ఫొటో
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సమావేశం విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్‌లో బుధవారం, గురువారం జరుగనుంది. వృద్ధి రేటు, నిధుల ఖర్చు, ప్రభుత్వ పథకాల అమలు, తొలి అర్థ సంవత్సరం ప్రగతిపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో చర్చించనున్నారు.
అమరావతి, కరవు నివారణ, నీటి నిర్వహణ, క్రిస్మస్, సంక్రాంతి కానుకలతో పాటు పెద్ద నోట్ల రద్దు ప్రభావం, ప్రభుత్వ చర్యలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు రోజులపాటు 8 సెషన్స్‌గా జరుగును.