కురవి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కిషన్ కోరారు. గురువారం కురవిలోని శ్రీవీరభద్రస్వామి టాకీసు ఆవరణలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. మండలానికి రేషన్‌కార్డులు తక్కువగా వచ్చాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 20 శాతం అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ అంది స్తామని, సదరం క్యాంపులో సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు.
పేదలకు పంపిణీ చేసిన భూములను పరిశీలించి పొజీషన్ సర్టిఫికెట్లు అందిస్తామని, ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహాలకు 55వేల పొజీషన్ సర్టిఫికెట్లు ఇచ్చామని, దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు సొంత ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారికి భూమి కొనుగోలు చేసి ఇళ్లు మంజూరు చేస్తామ ని చెప్పారు. గ్రామాల్లో అభ్యుదయ అధికారులను నియమించామని, వారు ప్రతీ శుక్రవారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. సర్పంచ్‌లు అభ్యుదయ అధికారులకు సహకరించాలని కోరారు.
ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ తప్పని సరి ఉండాలన్నారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, ఇందుకు రూ.9,100 ప్రభుత్వం ఇస్తోందని చెప్పా రు. అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని ఇవ్వడంతోపాటు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు సమస్యలు ఉంటే నేరుగా తెలిపితే పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గుండ్రాతిమడుగు(స్టేషన్)లో వెయ్యి ఎకరాల భూమి ఉందని, అది ఉక్కు పరిశ్రమకు అనువుగా ఉందా లేదా అనే విష యం పరిశీలిస్తామని, భూమికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆర్డీఓను ఆదేశించారు.
డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. జంక్షన్ అభివృద్ధికి వంద ఎకరాల స్థలం ఉందని, రైల్వే పరిశ్రమ ఏర్పాటు చేసేం దుకు సహకరించాలన్నారు. ఎస్సారెస్పీ మొద టి దశ పనులు సత్వరమే పూర్తిచేసేలా ఆదేశా లు ఇవ్వాలని కోరారు. రచ్చబండలో 174 రేషన్ కార్డులు, 734 పెన్షన్‌లు, 64 బంగారు తల్లి, 609 పక్కా గృహాలు, వడ్డీలేని రుణాలు రూ.60.66లక్షలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్, మహబూబాబాద్ ఆర్డీఓ మధుసూదన్‌నాయక్, ఐకేపీ ఏసీ అంజనమ్మ, ఎంపీడీఓ మోజెస్, తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి, స్పెషల్ అధికారి విజయ్‌భాస్క ర్, సమన్వయ కమిటీ సభ్యులు బజ్జూరి పిచ్చిరెడ్డి, సర్పంచ్‌లు ముత్యం సారయ్య, జి.సరోజ తదితరులు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
Published Fri, Nov 22 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement
Advertisement