Welfare of the poor
-
G7 Summit: సమ్మిళిత ఆహార వ్యవస్థ
హిరోషిమా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత దుర్బల స్థితిలో ఉన్న నిరుపేదల సంక్షేమం నిమిత్తం సమ్మిళిత ఆహార వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎరువుల వనరులను చెరపడుతున్న విస్తరణవాద ధోరణికి చెక్ పెట్టాలన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రజాస్వామ్యీకరణ చేయాలి. ఇలాంటి చర్యలు అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి మధ్య వారధిగా ఉంటాయి’ అని అన్నారు. పాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సులో మోదీ మాట్లాడారు. సహజ వనరులను సమగ్రంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా అభివృద్ధి నమూనాను మార్చాలని చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌లతో కూడిన జీ–7 కూటమి సదస్సు ఈసారి జపాన్‌లో జరుగుతోంది. భారత్‌తో పాటు మరో ఏడు దేశాల అధినేతలను సదస్సుకు జపాన్ ఆహ్వానించింది. ఈ మేరకు సదస్సులో పాల్గొన్న ప్రధాని తన ప్రసంగంలో ఆహార భద్రతపైనే అత్యధికంగా దృష్టిసారించారు. ప్రపంచ ఆహార భద్రత సుస్థిరంగా ఉండాలంటే ఆహార వృథాను అరికట్టడం అత్యంత కీలకమని చెప్పారు. సదస్సులో జరుగుతున్న చర్చలు జీ–20, జీ–7 కూటముల మధ్య కీలకమైన అనుసంధానంగా మారతాయని ఆశాభావం వెలిబుచ్చారు. సమ్మిళిత ఆహార విధానం రూపకల్పనలో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులను తొలగించాలి’’ అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రధాని పదేపదే సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ డిజిటల్ టెక్నాలజీ అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మోదీకి బైడెన్ ఆత్మీయ ఆలింగనం జీ–7 సదస్సులో ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ దగ్గరికి వడివడిగా వచ్చారు. ఆయన్ను చూసి మోదీ కుర్చీలోంచి లేచి స్వాగతించారు. నేతలిరువురూ పలకరించుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కూడా మోదీ ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక అంశాలపై మోదీ చర్చించారు. అణు విలయపు నేలపై శాంతిమూర్తి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబుతో భస్మీపటలమై లక్షలాది మంది మృత్యువాత పడ్డ హిరోషిమా పట్టణంలో శాంతి, అహింసలకు సంఘీభావంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు తాను బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని అక్కడే నాటారని తెలిసి సంబరపడ్డారు. హిరోషిమా పేరు చెబితే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని గుర్తు చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి కృషి: మోదీ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మోదీ తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. జీ–7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మానవత్వం, మానవ విలువలకు సంబంధించినదని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభానికి సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొంటానని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటిపై పలు రకాలుగా ప్రభావం చూపింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని రాజకీయ, ఆర్థిక అంశంగా చూడడం లేదు. మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన అంశంగా చూస్తున్నాం. యుద్ధంతో పడే బాధలు మాకంటే మీకే బాగా తెలుసు. ఈ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో పాటు వ్యక్తిగతంగా నేను కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. తాను రూపొందించిన సమగ్ర శాంతి ఫార్ములాలో భారత్ కూడా భాగస్వామి కావాలని జెలెన్స్కీ కోరారు. -
నాకు సమాధి తవ్వే పనిలో... విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
మండ్య/ధార్వాడ/హుబ్లీ: పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిని ఆయన ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తనను సమాధి చేయాలని కాంగ్రెస్ కలలు కంటోందని ఆక్షేపించారు. తనకు ఈ దేశ మాతృమూర్తులు, ఆడపిల్లలు, ప్రజలు రక్షణ కవచంగా ఉన్నారనే సంగతిని విపక్షాలు మరచిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. పేదల బతుకుల్లో మార్పు దేశంలో గడిచిన 9 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది పేదల బతుకుల్లో మార్పు వచ్చిందని మోదీ అన్నారు. పేదల కనీస అవసరాలైన సొంత ఇల్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి పనులను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 9 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద 40 లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించినట్లు చెప్పారు. 140 కోట్ల మందిని అవమానించారు విద్యార్థులు తమ చదువులు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. లండన్‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని జాతికి అంకితం చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా లండన్‌లో మాట్లాడారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులను అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు. ప్రపంచ దేశాలకు ఆశాకిరణం ప్రపంచ దేశాలకు ప్రస్తుతం భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయని తెలిపారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ కర్ణాటకలో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర న్యూఢిల్లీ: చరిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం మహాత్మా గాంధీకి, యాత్రలో పాల్గొన్న నేతలకు నివాళులర్పించారు. బ్రిటిష్ వారిపై ప్రజల పోరాటంగా దండి యాత్ర గుర్తుండిపోతుందన్నారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర అని ట్విట్టర్లో తెలిపారు. మన దేశ చరిత్రలో దండి యాత్ర కీలకమైన ఘట్టమని ఉద్ఘాటించారు. దండి యాత్రగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 5న ముగిసింది. పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ జాతికి అంకితం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని ఆదివారం జాతికి అంకితం ఇచ్చారు. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్‌ఘాట్ రైల్వే సెక్షన్‌ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్ వాటర్ సప్లై స్కీమ్ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మండ్య జిల్లాకేంద్రంలో ప్రధాని రోడ్డు షోలో పాల్గొన్నారు. -
భారత్‌కు భారీ సాయం
న్యూఢిల్లీ: కోవిడ్–19తో ఆర్థికంగా కుదేలైన భారత్‌ను ఆదుకోవడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. నిరుపేదల సంక్షేమం కోసం 1బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) రుణాన్ని విడుదల చేయనుంది. పట్టణాల్లో నిరుపేదలు, వలస కూలీల సంక్షేమం కోసం ఈ రుణాల్ని అందిస్తున్నట్టుగా వరల్డ్ బ్యాంకు ఇండియా డైరెక్టర్ జునాయిద్ అహ్మద్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ దేశాన్ని సరైన దిశగా ప్రయాణించేలా బాటలు వేస్తుందన్నారు. గతంలో ఇచ్చిన సాయానికి అదనంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. -
పల్లె ప్రగతికి ప్రణాళిక..!
గ్రామీణాభివృద్ధికి రూ. 87 వేల కోట్లు గతేడాదికన్నా 8,200 కోట్లు అధికం రైతు, పేదల సంక్షేమం లక్ష్యంగా సాగిన బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా గ్రామీణ రంగానికీ సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి మొత్తంగా రూ.87,765 కోట్లను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయింపు రూ. 79,526 కోట్ల కన్నా రూ.8200 కోట్లు అధికం. గ్రామీణ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు ఇలా.. ♦ పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ. 2.87 లక్షల కోట్ల గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ♦ రూ. 2.87 లక్షల కోట్ల గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ♦ ఒక్కో పంచాయతీకి(సగటున) రూ. 80 లక్షలు ♦ ఒక్కో మున్సిపాలిటీకి(సగటున) రూ. 21 కోట్లు ♦ విద్యుదీకరణకు 8,500 కోట్లు ♦ భూ రికార్డుల ఆధునీకరణకు 150 కోట్లు ► 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు రూ. 2.87 లక్షల కోట్లను సహాయ నిధి(గ్రాంట్ ఇన్ ఎయిడ్)గా అందించనున్నారు. గత ఐదేళ్ల కాలానికి కేటాయించిన మొత్తం కన్నా ఇది 228% అధికం కావడం విశేషం. ఈ నిధుల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 80 లక్షలు, పట్టణ స్థానిక సంస్థకు రూ. 21 కోట్లు అందనున్నాయి. ఈ నిధులకు సంబంధించిన నిబంధనలను ఆయా రాష్ట్రాలను సంప్రదించి.. పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ రూపొందిస్తుంది. ► {పత్యామ్నాయ జీవన వనరులను ప్రోత్సహించేందుకు స్వయం సహాయ బృందాల ఏర్పాటును వేగవంతం చేయాలని నిర్ణయించారు. ► ఉపాధి హామీ పథకం కింద జలసంరక్షణ, సహజ వనరుల నిర్వహణ కోసం ప్రత్యేక సహాయక బృందాల (క్లస్టర్ ఫెసిలిటేషన్ టీమ్స్) ఏర్పాటు. ► శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌లో భాగంగా 300 రూరల్ - అర్బన్ క్లస్టర్ల ఏర్పాటు. ఇవి రైతులకు మౌలిక వసతులు, మార్కెట్ సదుపాయాలు తదితరాల్లో సహకారం అందిస్తాయి. గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి చోదకాల పాత్ర పోషిస్తాయి. ► 2015 ఏప్రిల్ 1 నాటికి 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 నాటికి వాటిలో 5,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించగలిగామని, గత మూడేళ్లలో మొత్తంగా కూడా ఇంత విద్యుదీకరణ జరగలేదని జైట్లీ ప్రకటించారు. మే 1, 2018 నాటికి 100% విద్యుదీకరణకు కట్టుబడి ఉన్నామన్న జైట్లీ.. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సమీకృత విద్యుదీకరణ పథకాలకు రూ. 8,500 కోట్లు కేటాయించారు. ► మొత్తం 16.8 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో దాదాపు 12 కోట్ల గృహాల్లో కంప్యూటర్లు కానీ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్నవారు కానీ లేరు. డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇప్పటికే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్, డిజిటల్ సాక్షరత అభియాన్(దిశ)లను ప్రారంభించాం. త్వరలో మరో కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిద్వారా రానున్న మూడేళ్లలో మరో 6 కోట్ల గృహాలకు డిజిటల్ పరిజ్ఞానాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ► భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా.. 2016 ఏప్రిల్ 1 నుంచి జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం కేంద్ర పథకంగా కొనసాగుతుంది. ఇందుకోసం రూ. 150 కోట్లను కేటాయించారు. ► సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పాలనాపరమైన అభివృద్ధి కోసం ‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్’ను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 665 కోట్లను కేటాయించినట్లు తెలిపింది. ఇక ‘పొగ’ చూర ని వంటిళ్లు! ♦ పేద మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ♦ బడ్జెట్లో రూ.2 వేల కోట్ల కేటాయింపు ♦ 1.50 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు లబ్ధి న్యూఢిల్లీ: పేద మహిళలకు వంటింటి పొగ కష్టాలు తీరుస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. వంటచెరుకు ఉపయోగించి పొయ్యిలపై వంట చేసే మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పొయ్యిల వినియోగం ఒక గంటలో 400 సిగరెట్లు కాల్చడంతో సమానమని నిపుణులు పేర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు పేద మహిళలకు వారి పేరిటే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ప్రకటించారు. ఇందుకు బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల 2016-17 సంవత్సరంలో దారిద్య్ర రేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్న 1.50 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. బీపీఎల్ దిగువన ఉన్న మొత్తం 5 కోట్ల కుటుంబాలు దీనిద్వారా లబ్ధిపొందేందుకు ఈ పథకాన్ని మూడేళ్లపాటు కొనసాగిస్తామని వెల్లడించారు. దీనివల్ల వంటింటి శ్రమ త గ్గడమేగాకుండా మహిళల ఆరోగ్యం కాపాడిన ట్లవుతుందన్నారు. అలాగే గ్యాస్ సరఫరా ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అందుతుందన్నారు. ప్రధాని పిలుపు మేరకు దేశంలో 75 లక్షల మధ్య తరగతి కుటుంబాలు గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మరోవైపు కొత్తగా ఇవ్వనున్న గ్యాస్ కనెక్షన్లలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1,600 రాయితీ అందిస్తామని చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. కరెంటు చార్జీల మోత! న్యూఢిల్లీ/కోల్‌కతా: విద్యుత్ చార్జీల మోత మోగనుంది. ఒక్కో యూనిట్‌పై దాదాపు 16 పైసల వరకు పెరిగే అవకాశముంది. శుద్ధ ఇంధనం సెస్‌ను రెట్టింపు చేస్తామని బడ్జెట్లో ప్రతిపాదించడంతో బొగ్గు ధరలు సుమారు 20 శాతం వరకు పెరగనున్నాయి. బొగ్గు, లిగ్నైట్, పీట్పై టన్నుకు రూ.400 సెస్‌ను ప్రతిపాదించారు. వీటిపై వసూలు చేస్తున్న ‘శుద్ధ ఇంధన సెస్’ పేరును ‘శుద్ధ పర్యావరణ సెస్’గా మారుస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ తన బడ్జెట్లో ప్రసంగంలో ప్రకటించారు. మెట్రిక్ టన్నుకు ప్రస్తుతం రూ.200 ఉందని, దీన్ని రూ.400 కు పెంచుతున్నట్లు చెప్పారు. దీనిపై కేపీఎంజీ సంస్థ ఇంధన, సహజ వనరుల విభాగం అధిపతి మనీశ్ అగర్వాల్ స్పందిస్తూ.. ఒక్కో యూనిట్‌పై సుమారు 12-16 పైసలు పెరిగే అవకాశముందన్నారు. భారత్ అల్యూమినియం కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్కే రూంగ్టా స్పందిస్తూ.. ఈ ప్రతిపాదిత పన్ను వల్ల విద్యుత్ ధరలు పెరుగుతాయని, ధరలను వినియోగదారులకే బదలాయించాల్సి ఉంటుందన్నారు. మహిళా, శిశు అభివృద్ధికి రూ.17,408 కోట్లు న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించడం, అదేసమయంలో మహిళలు, చిన్నారులకు తగిన భద్రత కల్పించడం ధ్యేయంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకాలకు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయింపులను గణనీయంగా పెంచారు. 2016-17 ఆర్థిక సంవత్సరంకోసం ఈ శాఖకు రూ.17,408 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందులో రూ.15,860 కోట్లను చిన్నారుల అభివృద్ధికి వెచ్చిస్తారు. ఐసీడీఎస్కోసం ప్రపంచబ్యాంక్ సాయంతో చేపడుతున్న కార్యక్రమం కింద వెచ్చించే రూ.415 కోట్లు, జాతీయ పౌష్టికాహార మిషన్ కింద వెచ్చించే రూ.300 కోట్ల అదనపు నిధులు ఇందులో ఉన్నాయి. అలాగే ఆహార, పౌష్టికాహార ల్యాబొరేటరీల ఏర్పాటుకోసం కూడా అదనపు నిధులను కేటాయించారు. ► బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపులను తాజా బడ్జెట్లో రూ.75 కోట్ల నుంచి రూ.వంద కోట్లకు పెంచారు. ► అదేవిధంగా మహిళలకోసం షెల్టర్ హోమ్స్ ఏర్పాటుకు సంబంధించి కేటాయింపులనూ పెంచారు. 2015-16 బడ్జెట్లో రూ.52 కోట్లు కేటాయించగా.. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.వంద కోట్లు కేటాయించారు. ► ఇక మహిళలకోసం ఏకీకృత సేవా కేంద్రాల(ఒన్‌స్టాప్ సెంటర్స్) ఏర్పాటుకు చేసిన కేటాయింపుల్లో 500 శాతం పెంపుదల చోటు చేసుకుంది. గత బడ్జెట్లో కేవలం రూ.13 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.75 కోట్లు ఇచ్చారు. ► మరోవైపు మహిళల భద్రతకోసం అదనపు పథకాలను చేపట్టడానికి వీలుగా నిర్భయ నిధికి రూ.500 కోట్లను ఆర్థికమంత్రి తాజా బడ్జెట్లో కేటాయించారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కురవి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కిషన్ కోరారు. గురువారం కురవిలోని శ్రీవీరభద్రస్వామి టాకీసు ఆవరణలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. మండలానికి రేషన్‌కార్డులు తక్కువగా వచ్చాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 20 శాతం అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ అంది స్తామని, సదరం క్యాంపులో సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. పేదలకు పంపిణీ చేసిన భూములను పరిశీలించి పొజీషన్ సర్టిఫికెట్లు అందిస్తామని, ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహాలకు 55వేల పొజీషన్ సర్టిఫికెట్లు ఇచ్చామని, దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు సొంత ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారికి భూమి కొనుగోలు చేసి ఇళ్లు మంజూరు చేస్తామ ని చెప్పారు. గ్రామాల్లో అభ్యుదయ అధికారులను నియమించామని, వారు ప్రతీ శుక్రవారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. సర్పంచ్‌లు అభ్యుదయ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ తప్పని సరి ఉండాలన్నారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, ఇందుకు రూ.9,100 ప్రభుత్వం ఇస్తోందని చెప్పా రు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని ఇవ్వడంతోపాటు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు సమస్యలు ఉంటే నేరుగా తెలిపితే పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గుండ్రాతిమడుగు(స్టేషన్)లో వెయ్యి ఎకరాల భూమి ఉందని, అది ఉక్కు పరిశ్రమకు అనువుగా ఉందా లేదా అనే విష యం పరిశీలిస్తామని, భూమికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆర్డీఓను ఆదేశించారు. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. జంక్షన్ అభివృద్ధికి వంద ఎకరాల స్థలం ఉందని, రైల్వే పరిశ్రమ ఏర్పాటు చేసేం దుకు సహకరించాలన్నారు. ఎస్సారెస్పీ మొద టి దశ పనులు సత్వరమే పూర్తిచేసేలా ఆదేశా లు ఇవ్వాలని కోరారు. రచ్చబండలో 174 రేషన్ కార్డులు, 734 పెన్షన్లు, 64 బంగారు తల్లి, 609 పక్కా గృహాలు, వడ్డీలేని రుణాలు రూ.60.66లక్షలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, మహబూబాబాద్ ఆర్డీఓ మధుసూదన్‌నాయక్, ఐకేపీ ఏసీ అంజనమ్మ, ఎంపీడీఓ మోజెస్, తహసీల్దార్ సత్యపాల్‌రెడ్డి, స్పెషల్ అధికారి విజయ్భాస్క ర్, సమన్వయ కమిటీ సభ్యులు బజ్జూరి పిచ్చిరెడ్డి, సర్పంచ్‌లు ముత్యం సారయ్య, జి.సరోజ తదితరులు పాల్గొన్నారు.