‘స్థానిక’ నోటిఫికేషన్ జారీ | 'Local' Notification | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ నోటిఫికేషన్ జారీ

Published Tue, Mar 18 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

'Local' Notification

  •       50 జెడ్పీటీసీ... 705 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
  •      తొలి రోజు మందకొడిగా నామినేషన్ల దాఖలు
  •      జెడ్పీటీసీ స్థానాలకు 3..  ఎంపీటీసీ స్థానాలకు 22
  •  జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 50 జెడ్పీటీ సీ, 705 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. జెడ్పీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, డీపీఓ ఈఎస్.నాయక్... ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు ఆయా మండలాలకు చెందిన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆదివారం రాత్రి వరకు మంగపేట మండలంలో ఎన్నికలు జరుపాలా...వద్దా అన్న అంశంపై  జిల్లా అధికారులతో  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్‌చర్చించారు.

    దీనిపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆయన కోరినట్లు సమాచారం. ఎస్‌ఈసీ నుంచి అనుమతి రావడంతో జిల్లాలోని మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీకాగా...  మొదటి రోజు సాయంత్రం వరకు జెడ్పీ కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు జెడ్పీటీసీ అభ్యర్థులు ఎవరూ రాలేదు. నామినేషన్ దాఖలు సమయం ముగియనున్న సమయంలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
     
    జెడ్పీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు
     
    తాడ్వాయి మండల జెడ్పీటీసీ స్థానానికి పోటి చేసేందుకు రామసహాయం రజిత నామినేషన్ దా ఖలు చేశారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సతీమణీ అయిన రజిత టీఆర్‌ఎస్ నుంచి పోటి చేస్తున్నట్లు నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. ఏటూరునాగారానికి చెందిన తుమ్మ అనితారెడ్డి ఏటూరునాగారం జెడ్పీటీసీగా పోటీ చేసేం దుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈమె టీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకుడు తుమ్మ మల్లారెడ్డి సతీమణీ.  గూడూరు మండలానికి చెందిన మేకల రవీందర్‌యాదవ్ జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈయన వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్‌లో పేర్కొన్నారు.
     
    ఎంపీటీసీ స్థానాలకు 22 నామినేషన్లు
     
    ఎంపీటీసీ నామినేషన్లు తొలిరోజు మందకొడిగా దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రా ల్లో ఏర్పాటు చేసిన స్వీకరణ కేంద్రాల్లో 22 నామినేషన్లు దాఖలైయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నర్సంపేట డివిజన్‌లో ఒకరు,  వరంగల్, జనగామ డివిజన్‌లో నలుగురు చొప్పున, ములుగు డివిజన్ లో ఎనిమిది మంది, మహబూబాబాద్ డివిజన్‌లో ఐదుగురు నామినేషన్లు వేశారు. కాగా, జెడ్పీ వద్ద సీఐలు కిరణ్‌కుమార్, పృథ్వీధర్‌రావు, ఎస్సై విజ్ఞాన్‌రావు బందోబస్తు నిర్వహించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement