చేపల వేట సరదా ధర్మాజీ యాదగిరి ప్రాణాల మీదకు తెచ్చింది. మంచి ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో మృత్యుఒడికి చేరాడు. పట్టణంలోని కాలేజీరోడ్‌కు చెందిన యూదగిరి మంళవారం మధ్యాహ్నం వరుసకు సోదరుడైన సతీశ్‌తో కలిసి గోదావరి నదికి చేపల వేటకు వెళ్లాడు. అరగంటపాటు చేపలు పట్టారు. ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు యాదగిరి నది నీటి మడుగులో పడి గల్లంతయ్యూడు. అతడిని కాపాడేందుకు సతీశ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుటుంబ సభ్యులతోపాటు తహశీల్దార్ కిషన్, అగ్నిమాపక సిబ్బంది నది వద్దకు చేరుకుని రాత్రి ఎనిమిది గంటల వరకు గాలింపు చేపట్టినా యూదగిరి జాడ తెలియరాలేదు.
బుధవారం ఉదయం తొమ్మిది గంట లకు మృత దేహం కరీంనగర్ జిల్లా సరిహద్దు గోదావరి నదిలో లభ్యమైంది. మృతదేహాన్ని చూడగానే కుటుం బ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. కరీంనగర్ జిల్లా రామగుండం పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నా రు. ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మంచిర్యాలకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
పెళ్లరుున ఆరు నెలలకే..
యాదగిరి, శ్రీరాంపూర్‌కు చెందిన సరిత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి మే 18న పెళ్లి చేసుకున్నారు. స్నేహితులు, బంధువులు సర్దిజెప్పడంతో యూదగిరి తల్లిదండ్రులు సమ్మతించారు. కొడు కు, కోడలిని తమ ఇంటికి తీసుకొచ్చారు. యూదగిరి, సరిత కాపురం సంతోషంగా సాగింది. మంచిర్యాలలో బీఎస్సీ బయోమెట్రిక్స్ చదివిన యాదగిరి ఓ ప్రముఖ మెడికల్ కంపెనీ రిప్రజెంటీటివ్ ఉద్యోగం కోసం ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యూడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి తాను ఇం టర్య్వూలో సెలెక్ట్ అయ్యానని, ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు.
దీంతో అంతా ఆనందించారు. ఇక తమ కష్టాలు తీరనున్నాయని ఆ నవ దంపతులు సంబరపడ్డారు. అంతలోనే యూదగిరిని చేపల వేట రూపంలో గోదావరినది బలిగొంది. ఎన్నో ఆశలతో ప్రేమించినోడి వెంట వచ్చి అతడిని పెళ్లి చేసుకున్న సరిత యూదగిరి మృతితో శోకసంద్రంలో ముని గిపోరుుంది. ఆమె దయనీయ స్థితి బంధువులు, స్థాని కులను కంటతడి పెట్టించింది. యాదగిరికి తల్లిదండ్రులు, తమ్ముడు, అక్క, చెల్లె ఉన్నారు. తండ్రి రాజమ ల్లు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.