ష్‌.. సైలెన్స్‌ | babu mohan clapped shsh silence movie | Sakshi
Sakshi News home page

ష్‌.. సైలెన్స్‌

Published Fri, May 4 2018 12:25 AM | Last Updated on Fri, May 4 2018 12:25 AM

babu mohan clapped shsh silence movie - Sakshi

నటీనటులపై క్లాప్‌ ఇస్తున్న బాబూమోహన్‌

కిషన్, డానియల్‌ హీరోలుగా, సుమ హీరోయిన్‌గా రంజిత్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ష్‌.. సైలెన్స్‌’. నాగలక్ష్మి ఆర్ట్‌ క్రియేషన్స్‌పై వి. రమణబాబు, డానియల్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్‌ క్లాప్‌ ఇచ్చారు. వి.రమణబాబు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.

కథ నచ్చడంతో సినిమా నిర్మాణం ప్రారంభించాం. ఈ నెల ద్వితీయార్ధంలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నా. ఈ చిత్రం నాకు మంచి పేరు, గుర్తింపు ఇస్తుంది’’ అన్నారు కిషన్‌. ‘‘చక్కటి కథతో రూపొందుతోన్న చిత్రంలో కీ రోల్‌ పోషిస్తున్నాను. ఈ చిత్రబృందానికి మంచి పేరు తెస్తుంది’’ అన్నారు డానియల్‌. విక్కీ, బుల్లెట్‌ సుధాకర్, బళ్లారి బాబు తదితరులు నటి స్తోన్న ఈ చిత్రానికి సంగీతం: దేవేందర్, కెమెరా: ఏ. విజయ్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement