- కలెక్టర్ కిషన్
- ఘనంగా ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’
ఎంజీఎం : సమాజంలోని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కలెక్టర్ కిషన్ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవా న్ని పురస్కరించుకుని బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాల్‌లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత వివిధ కళాశాల విద్యార్థు లతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. రక్తదానం, అవయవదానాన్ని ప్రజలందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రక్త సేకరణ లక్ష్యంలో జిల్లాలో గత ఏడాది 99 శాతం సాధించామని, ఈసారి కూడా 27 వేల యూనిట్ల లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు.
రక్త సేకరణకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీ యమన్నారు. అదనపు సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రక్తదానంపై విద్యార్థులు, యువకుల కు అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ రక్తసేకరణలో ఎంజీఎం ఆస్పత్రి రాష్ట్రంలో ఆరుసార్లు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరాం అధ్యక్షతన జరిగిన సదస్సులో నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్, కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సురేష్‌లాల్, కేంద్ర సాహిత్య అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం 20 నుంచి 85 సార్లు రక్తదానం చేసి న వారికి కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. అలాగే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంపశయ్య నవీన్‌ను కలెక్టర్ సన్మానించారు.