ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈనెల 7వ తేదీన శక్తివంతమైన భూకంపం చోటుచేసుకున్న హెరాట్ ప్రావిన్స్‌లోనే ఆదివారం మళ్లీ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం హెరాట్ ప్రావిన్స్ రాజధాని హెరాట్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో భూమికి 8 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.
తాజా భూకంపం తాకిడికి నలుగురు చనిపోగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు స్వచ్చంద సంస్థలు తెలిపాయి. బలోచ్ ప్రాంతంలోని రబట్ సాంగి జిల్లాలోని కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 7న భూకంపం సంభవించిన హెరాట్ ప్రావిన్స్‌లో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. మొత్తం 2 వేల మందికి పైగా చనిపోగా మృతుల్లో 90 శాతం వరకు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment