Voluntary organizations
-
Lok Sabha Election 2024: పెరిగేదే లే!
ఓటెయ్యండి బాబూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండమ్మా.. ఓటు విలువ తెలుసుకో యువతా అంటూ ఒకవైపు ఎన్నికల సంఘం, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు చెవిలో ‘ఈవీఎం’ కట్టుకుని పోరుతున్నా ఓటర్లలో మాత్రం ఉత్సాహం పెద్దగా కనిపించడం లేదు! ఇప్పటిదాకా జరిగిన మూడు విడతల పోలింగ్‌లో ఓటింగ్ మందకొడిగానే నమోదైంది. 2019తో పోలిస్తే తగ్గింది కూడా. సుదీర్ఘ షెడ్యూల్, మండుటెండలతో పాటు పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణాలుగా కని్పస్తున్నాయి. తక్కువ ఓటింగ్ మన దేశంలో కొత్తేమీ కాదు. ఈ పరిణామంతో అధికార, ప్రతిపక్షాల్లో ఎవరికి నష్టం, ఎవరికి లాభమన్న చర్చ ఊపందుకుంది...ఈసారి సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మూడు అంకాలు ముగిశాయి. మే 7న మూడో విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ స్థానాల్లో 2019లో నమోదైన 67.33 శాతంతో పోలిస్తే 1.65 శాతం తగ్గినట్లు ఈసీ డేటా చెబుతోంది. తొలి రెండు విడతల్లోనూ ఇదే తంతు. 102 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం ఓట్లు పడ్డాయి. 2019లో ఈ స్థానాల్లో 69.4 శాతం ఓటింగ్ నమోదైంది. 88 సీట్లకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్‌లో 66.71 శాతం ఓటింగే నమోదైంది. 2019లో ఆ స్థానాల్లో వీటికి 69.2 శాతం ఓటింగ్ జరిగింది. మరో నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో మే 13న జరిగే నాలుగో దశలో అత్యధికంగా 96 సీట్లున్నాయి. చివరి మూడింట్లో పోలింగ్ జరగాల్సిన స్థానాలు 164 మాత్రమే. 2019లో రికార్డు ఓటింగ్... 2019లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటిదాకా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రికార్డు. 1951–52 తొలి లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 45.67 శాతం ఓటింగ్‌తో పోలిస్తే ఓటర్లలో చైతన్యం పెరుగుతూ వస్తోందనే చెప్పాలి. అయినా ఇప్పటికీ కనీసం 70 శాతాన్ని కూడా చేరకపోవడం మాత్రం ఆందోళనకరమే. రికార్డు పోలింగ్ నమోదైన గత ఎన్నికలనే తీసుకుంటే జనాభా భారీగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఓటింగ్ నమోదవడం గమనార్హం. బిహార్ (57.33%), ఉత్తరప్రదేశ్ (59.21), ఢిల్లీ (60.6%), మహారాష్ట్ర (61.02), ఉత్తరాఖండ్ (61.88%), తెలంగాణ (62.77%), గుజరాత్ (64.51%), పంజాబ్ (65.94%), రాజస్థాన్ (66.34%), జమ్మూ కశీ్మర్ (44.97%), జార్ఖండ్ (66.8%) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. 2014లో 66.44 శాతం ఓటింగ్ నమోదైంది. 2009లో నమోదైన 58.21 శాతంతో పోలిస్తే ఏకంగా 8.23 శాతం పెరిగింది! మన దేశంలో ఓటింగ్ ఒకేసారి అంతలా ఎగబాకడం కూడా రికార్డే.ఎందుకు తగ్గుతోంది...! ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికైతే ఓటింగ్ సరళి నిరాసక్తంగానే ఉంది. మిగతా నాలుగు విడతల్లో ఓటర్లు భారీగా బాగా బారులు తీరితేనే కనీసం 2019 స్థాయిలోనైనా ఓటింగ్ నమోదయ్యే అవకాశముంటుంది. లేదంటే భారీగా తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి... ⇒ పట్టణ ఓటర్లు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఓటింగ్ శాతం పడిపోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి. మూడు విడతల్లో పట్టణ నియోజకవర్గాల్లో పేలవ ఓటింగే ఇందుకు నిదర్శనం. ⇒ యూపీలోని గాజియాబాద్‌లో 2019లో 55.88 శాతం ఓట్లు పడగా ఈసారి 49.88 శాతానికి దిగజారింది. కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్లో 54.31 శాతం నుంచి 54.06 శాతానికి; బెంగళూరు సౌత్‌లో 53.69 శాతం నుంచి 53.17 శాతానికి తగ్గింది. ⇒ 2019లో కూడా పట్టణ ఓటర్లలో ఇదే ధోరణి కనబడింది. అత్యంత తక్కువ ఓటింగ్ నమోదైన 50 లోక్‌సభ స్థానాల్లో 17 మెట్రోపాలిటన్, పెద్ద నగరాల్లోనే కావడం గమనార్హం. ⇒ తక్కువ ఓటింగ్‌కు వలసలు కూడా కారణమే. పొట్టకూటి కోసం వలస వెళ్లేవాళ్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఓటింగ్ తగ్గుతున్నట్లు తేలింది. ⇒ వచ్చి ఓటేసేంత స్థోమత లేకపోవడం, కూలి డబ్బులను వదులుకోలేని అశక్తత వల్ల వారు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోతున్నారు. ⇒ దేశంలో అత్యధిక ఓటర్లున్న ఉత్తరప్రదేశ్‌లో అతి తక్కువ ఓటింగ్ నమోదవడం దీనికి నిదర్శనం. ⇒ మండుటెండలు కూడా ఓటింగ్‌కు గండికొడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ⇒ రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగేలా ఉండటంతో మిగతా నాలుగు విడతల ఓటింగ్‌పైనా తీవ్ర ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.ఫలితాలపై ప్రభావం.. ఎప్పుడెలా...?! 1951 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే భారీగా ఓటింగ్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు అనూహ్య ఫలితాలే వచ్చాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల్లో ఓటింగ్ 5 శాతం పైగా పెరిగి 60 శాతం దాటింది. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఘోర పరాజయం పాలై జనతా కూటమికి అధికారం దక్కింది. 1980లో ఓటింగ్ మళ్లీ భారీగా పడిపోయింది. అధికార జనతా పార్టీ ఓడి కాంగ్రెస్ విజయం సాధించింది. 1984 ఎన్నిక్లలో ఓటింగ్ 7 శాతం పైగా పెరగడం ఇందిర మరణంపై వెల్లువెత్తిన సానుభూతికి నిదర్శనంగా నిలిచింది. రాజీవ్‌గాంధీ ఘన విజయం సాధించారు. 1989లో మళ్లీ ఓటింగ్ తగ్గింది. కాంగ్రెస్ ఏకంగా సగానికి పైగా సీట్లను కోల్పోయింది. 1991 ఎన్నికల్లోనూ ఓటింగ్ 6 శాతానికి పైగా తగ్గింది. మళ్లీ అధికార పక్షానికి షాక్ తగిలి కాంగ్రెస్ గద్దెనెక్కింది. 2004లో ఓటింగ్ స్వల్పంగానే తగ్గినా ఐదేళ్ల వాజ్‌పాయి సర్కారు ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు కొలువుదీరింది. 2009 ఓటింగ్ స్వల్పంగా పెరిగింది. యూపీఏ ప్రభుత్వమే కొనసాగింది. 2014లో ఓటింగ్ రికార్డు స్థాయిలో 8 శాతానికి పైగా పెరిగింది. బీజేపీ తొలిసారి ఘనవిజయం కొట్టింది. పెరిగిన ఓటింగ్ మోదీ వేవ్‌కు అద్దం పట్టింది. 2019లోనూ 1 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మెజారిటీ మరింత పెరిగింది. ఆ లెక్కన ఈసారి ఓటింగ్ భారీగా తగ్గితే కచి్చతంగా అనూహ్య ఫలితాలే రావచ్చంటున్నారు రాజకీయ పండితులు.అధికార పార్టీకే నష్టమా? 2019లో 67.4 శాతం ఓటింగ్ జరిగినా వాస్తవంగా చూసుకుంటే 30 కోట్ల మంది ఓటే వేయలేదు! ఇదే నిరాసక్తత ఈసారి కూడా కొనసాగితే ఓటింగ్‌కు దూరంగా ఉండేవారి సంఖ్య 35 కోట్లకు పెరగవచ్చు. ఓటింగ్ భారీగా తగ్గడం దేనికి సంకేతమన్న దానిపైనా పలు రకాలు వాదనలున్నాయి. ఓటింగ్ పడిపోవడం అధికార పారీ్టకే ఎక్కువ నష్టమని చరిత్ర చెబుతోంది, అయితే ఇది అన్నివేళలా నిజం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘‘ఓటింగ్ తక్కువగా నమోదైనప్పుడు ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓటింగ్ తగ్గుదల 5 శాతం లోపుంటే ప్రజలు మార్పు కోరుకోవడం లేదని, పెద్దగా స్తబ్ధత లేదని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో స్థానికాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలు రావచ్చు. ఏదైనా జరగొచ్చు’’ అంటున్నారు రాజీకీయ విశ్లేషకుడు నోమిత పి.కుమార్. ఓట్ల శాతం భారీగా తగ్గడం వల్ల మెజారిటీలకు గండిపడి ఒక్కోసారి ఫలితాలు భారీగా తారుమారవుతాయన్నది మరికొందరి వాదన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈనెల 7వ తేదీన శక్తివంతమైన భూకంపం చోటుచేసుకున్న హెరాట్ ప్రావిన్స్‌లోనే ఆదివారం మళ్లీ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం హెరాట్ ప్రావిన్స్ రాజధాని హెరాట్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో భూమికి 8 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. తాజా భూకంపం తాకిడికి నలుగురు చనిపోగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు స్వచ్చంద సంస్థలు తెలిపాయి. బలోచ్ ప్రాంతంలోని రబట్ సాంగి జిల్లాలోని కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 7న భూకంపం సంభవించిన హెరాట్ ప్రావిన్స్‌లో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. మొత్తం 2 వేల మందికి పైగా చనిపోగా మృతుల్లో 90 శాతం వరకు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
పేదల కడుపు నింపుతున్న స్వచ్చంధ సంస్థలు
-
ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 2016లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు తోడుగా నదీపరీవాహక ప్రాంతాల్లో తవ్వకాలకు సంబంధించి మహారాష్ట్ర కేసులో తాము ఇచ్చిన ఆదేశాలే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ రాఘవేంద్ర రాథోర్ బెంచ్ పేర్కొంది. ‘నదీ పరీవాహక ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరి. మైనింగ్ విలువను బట్టి 25 శాతం వ్యయాన్ని ఆ ప్రాంతంలో జీవావరణాన్ని పెంచడానికి వసూలు చేసేలా నిబంధనలు ఉండాలి. అక్రమ తవ్వకాలు జరిపితే దాని వ్యయం సహా పర్యావరణానికి ఎంతమేర నష్టం కలిగిందో అంచనా వేసి నష్టపరిహారాన్ని వసూలు చేయాలి. ఇప్పటివరకు ఇచ్చిన మైనింగ్ అనుమతులకు హద్దులు ధ్రువీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. తవ్వకాలకు సంబంధించి ఏటా ఒక థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేయించి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి’అని ఎన్జీటీ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మైనింగ్లను నిరంతరం పర్యవేక్షించేందుకు శాశ్వతవ్యవస్థను రూపొందించుకోవాలని సూచించింది. పూడికతీతపేరుతో తెలుగు రాష్ట్రాల్లో అక్ర మ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ గతంలోనే ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఏర్పాటైన కమిటీ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించిందని చెప్పారు. ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ కేసు విచారణను ట్రిబ్యునల్ ముగించింది. -
స్త్రీలపై నేరాల కేసుల్లో 48 మంది చట్టసభ్యులు
న్యూఢిల్లీ: అత్యాచారాలు సహా మహిళలపై అనేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న 48 మంది ప్రస్తుతం దేశంలోని వివిధ చట్టసభల్లో దర్జాగా సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో అత్యధికంగా బీజేపీ నుంచే 12 మంది ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసే సమయంలో అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే ప్రమాణ పత్రాల్లోని కేసులను విశ్లేషించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఎన్నికల సంస్కరణల కోసం శ్రమిస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ మొత్తం 4,845 ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన మీదట ఓ నివేదికను తయారుచేసింది. నేరాలకు పాల్పడి చట్టసభల్లో కూర్చుంటున్న ఈ 48 మందిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు కాగా, మిగిలిన 45 మంది వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 12 మంది, పశ్చిమ బెంగాల్లో 11 మంది, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో చెరో 5 మందితో కలిపి 48లో మొత్తం 33 మంది ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. పార్టీల వారీగా అయితే ఈ 48 మందిలో బీజేపీకి చెందినవారు 12 మంది, శివసేన పార్టీ వారు ఏడుగురు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు కలిపి ఈ మూడు పార్టీల నుంచే 25 మంది ఉన్నారు. తీవ్ర నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్లో నిర్ణీత సమయంలో త్వరితగతిన విచారణ పూర్తి చేసి, నేరం రుజువైతే వారి సభ్యత్వాలను రద్దుచేయడం తదితర సంస్కరణలను ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. అన్ని పార్టీలూ నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నాయనీ, గత ఐదేళ్లలో ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీల అభ్యర్థుల్లో మొత్తం 327 మందిపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. -
నవ్విన చోటే నిలిచి.. గెలిచి..!
తాగునీటి కోసం గ్రామీణ మహిళల కష్టాలు ఆమెను కదిలించాయి. నీటి సమస్య పరిష్కారానికి ఎన్నో మార్లు అధికారులకు విన్నవించారు. స్వచ్ఛంద సేవలను ఆశ్రయించారు. తన నగలను తాకట్టు పెట్టి మçహారాష్ట్ర, రాజస్తాన్ వెళ్లారు. అన్నాహజరే, రాజేంద్రసింగ్ల సలహాలు తీసుకున్నారు. మొదట ఓ కొలను తవ్వారు. ఈ ప్రయత్నానికి కొందరు నవ్వుకున్నారు.ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నా కుంగిపోలేదు. కొలను నిండడంతో పరిసరాల్లో భూగర్భజలాలు కొంత మేరకు పెరిగాయి. అదే స్ఫూర్తితో స్వచ్ఛంద సంస్థల, యువత సహకారం తీసుకుని మరో ఎనిమిదికొలనులు తవ్వించారు. ప్రస్తుతం కొలనులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నవ్వినచోటే నిలిచి గెలిచారు తిరువళ్లూరు సమీపంలోని నల్లటూరు గ్రామానికి చెందిన సుమతి. తిరువళ్లూరు: సాగర చక్రవర్తి అశ్వమేధయాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి కపిల మహర్షి దగ్గర కట్టేశాడట. ఆ ఆశ్వాన్ని చూసిన యువరాజులు ఆ మహర్షిని నిందించడంతో ఆగ్రహించిన రుషి వారందరిని భస్మం చేశాడట. నిజం తెలుసుకున్న సాగరచక్రవర్తి రెండో భార్య కుమారుడు అసమంజ రాజకుమారుల ఆత్మకు శాంతి ప్రసాదించాలని రుషిని ప్రార్థించగా.. దేవలోకం నుంచి గంగను భూమికి తీసుకువస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపాడట. దీంతో అసమంజ మనవుడు భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భూమి మీదకు తెచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇదే విధంగా అదిగత్తూరు సమీపం 5 గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి భగీరథ యత్నమే చేసింది ఆమె. భర్త సహకారం, సమీప పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ యువకులతో వర్షం నీటి ఆదాకు కొలను తవ్వకానికి నిధులు సేకరించారు. అలా పదేళ్ల క్రితం ప్రారంభించి ఇప్పటివరకు గ్రామంలో తొమ్మిది కొలనుల తవ్వించారు. పచ్చదనం కోసం రెండు వేల మొక్కలను నాటి శభాష్ అనిపించుకుంటున్నారు సమాజికవేత్త సుమతి. కుటంబ నేపథ్యం.. తిరువళ్లూరు సమీపం, నల్లటూరు గ్రామానికి చెందిన సుమతి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమెకు 14 ఏళ్ల క్రితం చిదంబరనాథన్తో వివాహం జరిగింది. వివాహం జరిగిన మరుసటి రోజు నుంచే కన్నీటి కష్టాలు ఎదురయ్యాయి. తాగునీటి కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయబావి వద్ద తాగునీటిని తెచ్చుకోవాలి. ఇలా నీటికోసం పడిన కష్టాలు ఆమెను కదిలించాయి. సమస్య పరిష్కారం ఆమె మాటల్లోనే.. ఈ శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. 2006లో నిర్వహించిన గ్రామసభలో ఏకాటూరు వద్ద ఉన్న కూవం నదిపై అనకట్ట కట్టాలని తీర్మానం చేశాం. అధికారులు సైతం వచ్చి వెళ్లినా పని కాలేదూ కదా.. మళ్లీ సమస్య ఉగ్రరూపం దాల్చింది. అప్పడే ఇండియా వాటర్‌మెన్ రాజస్థాన్‌కు చెందిన రాజేంద్రసింగ్, అన్నాహజారే గురించి పుస్తకాల్లో చదివా. గ్రామాల్లో నీటిని ఆదాచేయడానికి స్వచ్ఛంద సంసల సహకారంతో కొలను తవ్వారన్నది అందులోని సారాంశం. ప్రభుత్వాన్ని నమ్మి ప్రయోజనం లేదని నగలను తాకట్టు పెట్టి మహరాష్ట్ర, రాజస్తాన్‌కు బయలుదేరా. అన్నాహజరే, రాజేంద్రసింగ్‌ను కలిసి గ్రామంలోని తాగునీటి సమస్యను వివరించా. కొలను తవ్వి నీటిని ఆదా చేయమని చెప్పారు రాజేంద్రసింగ్. మొదట్లో నమ్మకం లేకపోయినా హజారే స్వగ్రామమైన రాలేగన్ సిద్ధి్ద, రాజస్థాన్‌లో తవ్విన కొలనులను పరిశీలించాక నమ్మకం ఏర్పడింది. నిధుల కోసం వినతి.. గ్రామపంచాయతీ అధ్యక్షుడికి కొలను తవ్వకం కోసం నిధులను సేరించాలని కోరా. అయితే అందుకు అయ్యే ఖర్చును గుర్తుచేస్తూ నన్ను ఎగతాలి చేశారు. అయినా నేను గ్రామంలోని యువకులు, స్వచ్ఛంద సంస్థలు, సమీప కంపెనీలను ఆశ్రయించి నిధులు సేకరించా. ఆ నిధులతో తాగునీటి ట్యాంకర్ కోసం ఏర్పాటు చేసిన బోరుకు సమీపంలో పెద్ద కొలనును ఆరునెలల పాటు శ్రమించి తవ్వాం. కొలనుకు నాలుగు వైపులా రాళ్లను పేర్చాం. ఆ ఏడాదే మంచి వర్షం. కొలను నీటితో నిండి జలకళను సంతరించుకుంది. దీంతో భూగర్భజలాలు కొంత మేరకు పెరగడంతో ఆరు నెలల పాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. మొత్తం తొమ్మిది కొలనులు.. అదే జోష్‌తో మరో ఎనిమిది కొలనులను తవ్వాలని పనులు ప్రారంభించా. మొదట్లో మమ్మిల్ని ఎగతాళి చేసిన వారే మాతో చేతులు కలిపారు. ఏడాదికి ఒక కొలను చొప్పున ఎనిమిదింటిని పూర్తి చేశాం. ప్రస్తుతం గ్రామంలో తొమ్మిది కొలనులను తవ్వాం. ప్రవేటు వ్యక్తి చేతిలో ఆక్రమణకు గురైన మరో కొలనును స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేశాం. కొలనుల తవ్వడానికి తాను చేసిన ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నప్పుడు కొంచెం బాధపడ్డా. కానీ కొలనుల్లో నీరు నిండి ప్రవహిస్తుండడంతో పలువురు శభాష్ అంటూ ప్రశంసిస్తుంటే ఆ బాధను మరిచిపోతున్నా. భర్త సహకారం.. సుమతి సాధించిన విజయం వెనుక భర్త చిదంబరనాథన్ ప్రోత్సహం, యువకుల సహకారం ఎంతో ఉంది. ప్రస్తుతం అదే టీం లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించి రెండువేల మొక్కలను నాటి పరిరక్షిస్తున్నారు. సుమతి సమాజసేవకు గాను పలు అవార్డులు వచ్చాయి. గ్రామస్తులు సైతం పంచాయతీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే ఎన్నికలు నిలిచిపోయాయి. భవిష్యత్‌లో పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికై సమాజ సేవ చేయాలని ఆశిద్దాం. -
ఎన్కౌంటర్ స్థలానికి వెళ్లడానికి వీల్లేదు
* పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అనుమతి నిరాకరణ * శ్రీవారిమెట్టు వద్దనే అడ్డుకున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, తిరుపతి/చంద్రగిరి: శేషాచలం అడవుల్లో ఎర్రకూలీలు చనిపోయిన స్థలానికి తమను అనుమతించకపోవడంపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటలపాటు నిరీక్షింపజేసి చివరకు అనుమతించక పోవడంపై ఈ నెల 23న హైదరాబాద్‌లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(ఎన్హెచ్ఆర్ఓ)కు ఫిర్యాదు చేయనున్నామని పీపుల్స్‌వాచ్ కమిటీ(పీడబ్ల్యూసీ) ఆర్గనైజర్ హెన్రీ డిఫెన్ తెలిపారు. శేషాచల అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ ఘటనపై నిజానిజాలు తెలుసుకోవడానికి పీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ముంబై హైకోర్టు రిటైర్డ్ జడ్జి సురేష్, ఎన్హెచ్ఆర్వో ఆర్గనైజింగ్ మెంబర్ ఛత్రపాల్, రిటైర్డ్ డీజీపీ రామ్మోహన్, పాకిస్తాన్‌లోని భారత మాజీ రాయబారి సత్యప్రతాప్, ఫోరెన్సిక్ నిపుణులు సేవియార్, ప్రముఖ న్యాయవాది అజిత, తమిళనాడు ముస్లిం మునేట్ర కలగమ్ పార్టీ అధ్యక్షుడు, రామనాథపురం ఎమ్మెల్యే జవహరుల్లాతో కూడిన బృందం మంగళవారం శ్రీవారిమెట్టుకు చేరుకుంది. ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.అనంతరం డిఫెన్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్వో అనుమతితోనే ఇక్కడికొచ్చామని, నిజానిజాలు తెలుసుకునేందుకు వస్తే అటవీ శాఖాధికారులు అనుమతించలేదని తెలిపారు. దీనిపై ఎన్హెచ్ఆర్వోకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికే వచ్చాం 40 సంవత్సరాలకుపైగా భారతదేశానికి ఎనలేని సేవలు చేశాం. రిటైర్డ్ సీనియర్ జడ్జి అని చూడకుండా 2 గంటలపాటు నిరీక్షణకు గురిచేశారు. ఇక్కడ జరిగిందేమిటో తెలుసుకోవడానికే వచ్చాం. అధికారులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీనిపై ఎన్హెచ్ఆర్వోకు ఫిర్యాదు చేస్తాం. -సురేష్, ముంబై హైకోర్టు రిటైర్డ్ జడ్జి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి శేషాచలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై పోలీసు అధికారులు ఒకవిధంగా, మీడియా ప్రతినిధులు మరోవిధంగా పొంతన లేకుండా వార్తలు వస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకునేందుకు ఇక్కడికొస్తే అధికారులు అనుమతించలేదు. - రామ్మోహన్, రిటైర్డ్ డీజీపీ -
గుజరాత్‌కు పెట్టుబడుల వెల్లువ!
వైబ్రంట్ గుజరాత్ సదస్సులో కార్పొరేట్ల క్యూ ⇒ రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రకటించిన ⇒ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ⇒ ఆదిత్య బిర్లా రూ.20,000 కోట్ల పెట్టుబడులు... ⇒ జాబితాలో విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు కూడా.. గాంధీనగర్: గుజరాత్‌కు పెట్టుబడులు పోటెత్తనున్నాయి. ఆదివారం ఇక్కడ ప్రధాని మోదీ ప్రారంభించిన ఏడో వైబ్రంట్ గుజరాత్ సదస్సు(వీజీఎస్)లో దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు పోటాపోటీగా భారీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. ఈ మూడు రోజుల సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. గుజరాత్ సీఎంగా మోదీ హయాంలో 2003లో తొలిసారిగా ఆరంభించిన వీజీఎస్ అప్పటినుంచీ ప్రతి రెండేళ్లకోసారి జరుగుతూ వస్తోంది. కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, తీవ్ర ఒడిదుడుకులు ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ ఈ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. స్థిరమైన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌తో కలిసికట్టుగా సాగేందుకు ప్రపంచంలో అనేక దేశాలు ముందుకొస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ముకేశ్ అంబానీ జోష్... వీజీఎస్ ప్రారంభం రోజే రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడులను గుజరాత్లో వెచ్చించనున్నట్లు ప్రకటించారు. రానున్న 12-18 నెలల కాలంలో తమ గ్రూప్‌లోని పలు వ్యాపార విభాగాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించనుందని ముకేశ్ చెప్పారు. పెట్రోకెమికల్ ప్లాంట్లలో సామర్థ్య విస్తరణ, 4జీ టెలికం బ్రాడ్‌బ్యాండ్ సేవల ప్రారంభంతోపాటు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యకలాపాల్లో రిలయన్స్ తమవంతు సహకారాన్ని అందిస్తుందన్నారు. ఇప్పటిదాకా జరిగిన వీజీఎస్లన్నింటికీ తాను హాజరయ్యానన్న ముకేశ్... మోదీని ప్రపంచ నాయకుడిగా అభివర్ణించారు. భారత్‌కు ఆయన గర్వకారణమని వ్యాఖ్యానించారు. గుజరాత్‌కే ప్రాధాన్యం: బిర్లా కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వీజీఎస్ సందర్భంగా గుజరాత్లో రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సిమెంట్ ఇతరత్రా ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు బిర్లా తెలిపారు. గ్రూప్‌నకు గుజరాత్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడుల గమ్యస్థానమని కూడా పేర్కొన్నారు. హాజరైన ఇతర కార్పొరేట్లలో అడాగ్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ, హిందూజా గ్రూప్‌నకు చెందిన శశి రూయా, భారతీ గ్రూప్ సునీల్ మిట్టల్, ఆది గోద్రెజ్, ఉదయ్ కొటక్, ఏఎం నాయక్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ, ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ తదితరులు ఉన్నారు. ఇక విదేశీ కంపెనీల విషయానికొస్తే.. ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం రియో టింటో గుజరాత్‌లోని వజ్రాలు సానబట్టే పరిశ్రమలో 30,000 కొత్త ఉద్యోగాల కల్పించనున్నట్లు వెల్లడించింది. అంత్యంత నమ్మకమైన వ్యాపార గమ్యంగా నిలుస్తున్న గుజరాత్‌తో మున్ముందు మరింతగా కలిసి పనిచేస్తామని కంపెనీ సీఈఓ శామ్ వాల్ష్ చెప్పారు. తమ కంపెనీ భారత్‌పై చాలా ఆశావహంగా ఉందని.. గడిచిన ఏడాది వ్యవధిలో 25 కోట్ల డాలర్లను ఇక్కడ వెచ్చించినట్లు మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం కానుందని జపాన్ వాహన దిగ్గజం సుజుకీ చైర్మన్ ఒసాము సుజుకీ పేర్కొన్నారు. గుజరాత్లో నిర్మిస్తున్న తమ కొత్త ప్లాంట్ 2017కల్లా ఉత్పత్తికి సిద్ధమవుతుందన్నారు. ఈ ప్లాంట్కోసం రూ.4,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మరిన్ని సంస్కరణలు అవసరం... వీజీఎస్లో పాల్గొన్న కార్పొరేట్ దిగ్గజాలు, నిపుణులు భారత్‌లో మరిన్ని ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాలని సూచించారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి పన్నులు, సబ్సిడీల్లో కీలక సంస్కరణలు ఆవశ్యకమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ అద్భుత పాలనను ఇప్పుడు భారత్‌వ్యాప్తంగా ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారని మాస్టర్ కార్డ్ చీఫ్, అమెరికా-ఇండియా వ్యాపార మండలి చైర్మన్ అజయ్ బంగా చెప్పా రు. అమెరికా ఇన్వెస్టర్లు భారత్‌పై చాలా ఆసక్తిగా ఉన్నారని.. ఇరు దేశాల మధ్య వారధిగా వ్యహరించేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అదానీ హల్చల్.. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్, అమెరికా కంపెనీ సన్ ఎడిసన్ కలిపి గుజరాత్లో భారీ సోలార్(సౌర విద్యుత్) పార్క్‌ను నెలకొల్పనున్నాయి. ఇరు కంపెనీలు జాయింట్ వెంచర్(జేవీ)గా నిర్మించే ఈ సోలార్ పార్కు కోసం రూ.25,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వైబ్రంట్ అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు 20,000 ఉద్యోగాలను ఇది కల్పించనుందని కూడా తెలిపింది. అదానీ గ్రూప్‌తో జట్టుకట్టడం ద్వారా భారత్‌లోనే అతిపెద్ద ఫోటోవోల్టాయిక్(సోలార్) ప్యానల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండం తమకు గర్వకారణమని సన్ ఎడిసన్ సీఈఓ అహ్మద్ చాటిలా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ద్రవీకృత సహజవాయువు(ఎన్ఎన్జీ) దిగుమతితోపాటు చమురు-గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిలో సహకారం కోసం ఆస్ట్రేలియా ఇంధన దిగ్గజం ఉడ్‌సైడ్ ఎనర్జీతో అదానీ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్య ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఉడ్‌సైడ్ ఎనర్జీ సీఈఓ పీటర్ కోల్మన్ సంతకాలు చేశారు. మోదీతో అదానీకి సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగురేఖ భారత్: కిమ్ గాంధీనగర్: మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగురేఖగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పేర్కొన్నారు. ఆదివారమిక్కడ మొదలైన వైబ్రంట్ గుజరాత్ సదస్సులో మాట్లాడుతూ... ఈ ఏడాది(2015)లో ఇండియా వృద్ది రేటు 6.4 శాతానికి పుంజుకోవచ్చని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఈ జోరు మరింత పెరగనుందని కూడా చెప్పారు. అయితే, కుల పరమైన పక్షపాత ధోరణలు, ఇతరత్రా అంశాలు ప్రగతికి అడ్డంకిగా నిలుస్తాయని ఆయన హెచ్చరించారు. దేశ ఆర్థిక ఫలాలను ప్రజలందరికీ పంచే విధంగా ప్రధాని మోదీ పలు పథకాలపై దృష్టిపెట్టారని... దీనివల్ల వృద్ధి రేటు కూడా పుంజుకోవడానికి దోహదపడుతుందని కిమ్ అభిప్రాయపడ్డారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోయిన వృద్ధి రేటు ప్రస్తుత 2014-15 సంవత్సరంలో కొంత మెరుగుపడిన(క్యూ1లో 5.7%, క్యూ2లో 5.3%) సంగతి తెలిసిందే. ఈ ఏడాది 7 శాతం వృద్ధి: పీడబ్ల్యూసీ నిర్మాణాత్మక సంస్కరణల నేపథ్యంలో భారత్‌లో ఈ ఏడాది(2015) వృద్ధి రేటు 7 శాతాన్ని అందుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ముడి చమురు ధరల భారీ క్షీణత స్వల్పకాలంలో జీడీపీకి చేయూతనిస్తాయని అభిప్రాయపడింది. మరోపక్క, చైనాలో వృద్ధి రేటు మందగించొచ్చని పేర్కొంది. కాగా, పెట్టుబడులు ఇంకా పుంజుకోవాల్సిన నేపథ్యంలో 2014-15 ద్వితీయార్ధంలో(క్యూ3, క్యూ4) వృద్ధి రేటు కాస్త తగ్గే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. అయితే, సంస్కరణలను వేగంగా అమలు చేయడం, ముడిచమురు దరల తగ్గుముఖం... వృద్ధికి చేయూతనిస్తాయని హెచ్ఎస్బీసీ తెలిపింది. -
డిపాజిటర్ల అవగాహన కోసం ఆర్బీఐ గ్రాంట్లు
స్వచ్ఛంద సంస్థల దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 27 న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిటర్లకు అవగాహన కల్పించటానికి రిజర్వుబ్యాంక్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనికోసం ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’ను ఏర్పాటుచేసింది. డిపాజిటర్లకు అవగాహన కల్పించే వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక తోడ్పాటునివ్వటానికి ఈ ఫండ్ నుంచి వాటికి గ్రాంట్లను మంజూరుచేయనుంది. గ్రాంట్లు పొందే సంస్థలు డిపాజిటర్లకు సురక్షితమైన బ్యాంకు లావాదేవీలు, భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాల్ని, సదస్సులను నిర్వహించాలని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక విధానాలు, విషయాలపట్ల ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాల్ని కూడా చేపట్టవచ్చని తెలిపింది. డిపాజిటర్లకు అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు గ్రాంటు కోసం ఫిబ్రవరి 27 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అలాగే ఫండ్ కోసం ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను విడుదలచేసింది. పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని, వినియోగంలోలేని అకౌంట్ల డబ్బుల్ని బ్యాంకులు వడ్డీతో సహా ఈ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించింది. ఈ ఫండ్ ఒక కమిటీ ఆధీనంలో ఉంటుందని పేర్కొంది. -
స్వచ్ఛందంగా చొరవ తీసుకోవాలి
కర్నూలు(అగ్రికల్చర్) : గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యానికి స్వచ్ఛంద సంస్థలు తగిన చొరవ తీసుకోవాలని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తెలిపారు. శుక్రవారం సమావేశ మందిరంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, విద్యపరంగా గ్రామాలు అభివృద్ధి చెందడంలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. ప్రతి స్వచ్ఛంద సంస్థ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రభుత్వ సహకారంతో సంపూర్ణ పారిశుద్ధ్యానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో దాదాపు 50 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, ఒక్కొక్కటి ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని సంపూర్ణ పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన తెచ్చి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేయాలని కోరారు. చిత్తశుద్ధితో పనిచేసిన సంస్థలకు సహకారం ఉంటుందని వివరించారు. జిల్లాలో 6.44 లక్షల కుటుంబాలను సర్వే చేయగా కేవలం 2 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయని, ఇంకా 4.44 లక్షల కుటుంబాలకు లేవని తెలిపారు. ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు రూ.12 వేలు ఇస్తుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. భూగర్భ జలాలను అభివృద్ధి చేసే విధంగా ఫారంపాండ్, చెక్ డ్యామ్‌లు, నీటి కుంటలు నిర్మించుకునేలా చూడాలన్నారు. మార్చి 31లోపు అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబానికీ మరుగుదొడ్డి ఉండే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, సీపీవో ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జయచంద్రబాబు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జాయ్ ఆఫ్ సేవ
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేముసైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న పదకొండవ కథనమిది... నలుగురు స్నేహితులు ఓ చోట కూడితే...ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారు. కానీ నలుగురి కోసం ఏం చేయాలనే ఆలోచిస్తే.. ‘సంభవామి’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఇలాంటి స్నేహితుల బృందమే. వరంగల్ కిట్స్ (కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) కాలేజీలో చదువుకున్న ఓ నలభై మంది విద్యార్థులు ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పేద పిల్లలకు సాయం చేయాలనే ఆలోచనతో ఈ సంస్థను స్థాపించారు. చదువు... మొదలు ప్రకృతి వైపరీత్యాల వరకూ.. చేతనైనంత సాయం చేస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సదా మీ సేవలో.. చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. వురెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సవూజం కోసం మీరు చేతులు కలిపి చేసిన చేతల వివరాలు వూకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సవుంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. ఇలా ఉత్తమ సేవలు అందిస్తూ సమాజహితానికి పాటుపడుతున్న ‘సేవకుల’ను సవుంత పలకరిస్తారు. ఒక్క సవుంత వూత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి వురెందరో సెలబ్రిటీలు వుుందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెరుుల్ టు.. sakshicityplus@gmail.com నాలుగేళ్ల క్రితం స్నేహితులంతా కలిసినపుడు తోచినట్టు చేసుకుపోవడం కాకుండా ఏదైనా సంస్థని స్థాపిస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. ‘కాలేజీ రోజుల నుంచే మాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. చిన్న చిన్న సహాయాలు చేస్తుండేవాళ్లం. మా ఫ్రెండ్స్ మొత్తం నలభై మంది వరకూ ఉంటారు. అందరూ చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సెటిల్ అయ్యారు. ఒకరోజు అందరం కలిసి స్వచ్ఛంద సంస్థని స్థాపించాలనుకుని ‘సంభవామి’ పేరుతో సేవకు సిద్ధపడ్డాం. మొదట్లో అందరం నగరంలోని అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్లి అక్కడ కాసేపు గడిపి వచ్చేవాళ్లం. వెళ్లేటప్పుడు ఊరికే వెళ్లకుండా...బియ్యం, నోటు పుస్తకాలు, బట్టలు, కూరగాయలు వంటివి తీసుకెళ్లేవాళ్లం. అలా నాలుగైదు సార్లు వెళ్లాక ఏదో ఒక సంస్థకు పూర్తిస్థాయిలో అండగా నిలబడితే బాగుంటుందనుకుని ఆశ్రీత అనాథాశ్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయడం మొదలుపెట్టాం. దీంతో పాటు వార్తాపత్రికల్లో వచ్చే కథనాలకు స్పందించి జిల్లాలకు వెళ్లి కూడా తోచిన సాయం చేస్తున్నాం’ అని చెప్పారు అలైఖ్య. ఈసీఐ కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అలైఖ్య.. తన స్నేహితులైన అఖిల, హర్ష, విక్రమ్, శ్రీనివాస్, అనూషల సేవాభావాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఆశ్రీతతో పాటు... ఒంటరి సేవలు కాకుండా...ఒక బృందంగా ముందుకెళ్లాలన్న ఆలోచన తేజశ్వినిది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్న తేజశ్విని ‘సంభవామి’ టీమ్‌కి లీడర్. ఆమె మాటల్లో చెప్పాలంటే ‘విద్యార్థి దశలో వచ్చిన ఆలోచనలు పెద్దయ్యాక ఆచరణలో పెడితే మంచి లక్ష్యాలను చేరుకున్నవాళ్లమవుతాం. ఏ స్వార్థమూ తెలియని వయసులో మనసుకు వచ్చే ఆలోచనలు చాలా స్వచ్ఛమైనవి. జీవితంలో స్థిరపడే వయసులో ఇలాంటి బాధ్యతలు నెత్తినేసుకోవడం మన ఎదుగుదలకు అడ్డంకి అవుతుందనే ఆలోచనతో చాలామంది రిటైర్ అయ్యాక సేవాకార్యక్రమాలకు ముందుకొస్తారు. కానీ మేం అలా చేయాలనుకోలేదు. ఏం చేసినా ఈ వయసులోనే చేయాలి. సొంతపని, సమాజం పని....రెండింటినీ చేసే సామర్థ్యం ఈ వయసులోనే ఉంటుందనేది మా ఉద్దేశం. అందుకే పుట్టింది ‘సంభవామి’. ఈ టీం అనాథ పిల్లల బాగోగులతో పాటు సొంత జిల్లా వరంగల్‌కి కూడా వెళ్లి అక్కడున్న ఆర్ఫనైజ్ హోమ్స్కీ సహాయపడుతోంది. జిల్లాలకేగి... కిందటేడు ‘సంభవామి’ బృందం వరంగల్ పబ్లిక్ గార్డెన్లో ‘ప్లాస్టిక్లెస్ ఎర్త్’ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మూడు రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో ఇరవై పాఠశాలల్లో వీడియో ప్రజెంటేషన్లు వేశారు. రోజంతా ర్యాలీ నిర్వహించారు. పిల్లలతో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. ‘ఉద్యోగాలకు సెలవులు పెట్టి మేమంతా ఓ నాలుగు రోజులు వరంగల్‌లోనే ఉండిపోయాం. ప్లాస్టిక్లెస్ ఎర్త్ కార్యక్రమం అక్కడి ప్రజల్లో మంచి అవగాహన పెంచిందని చెప్పాలి. ఎందుకంటే వాటి వాడకం విషయంలో ప్రత్యామ్నాయ వస్తువుల్ని వాడడం గమనించాం మేం. అలాగే ఖమ్మం జిల్లా కొత్తూరు తండాలో ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారనే వార్త చదివి అక్కడికి వెళ్లాం. బట్టలు, రాగి, గోధుమ పిండి ప్యాకెట్లను తీసుకెళ్లి పంచాం. దానికోసం తెలిసినవాళ్ల దగ్గర మేమే స్వయంగా బట్టలు సేకరించాం. కొన్నింటిని కొత్తవి కొన్నాం’ అంటూ తన సంస్థ కార్యక్రమాల్ని వివరించారు అలైఖ్య. హుద్‌హుద్ కోసం... విశాఖపట్నంలో అల్లకల్లోలం సృష్టించిన హుద్‌హుద్ సంఘటనపుడు ‘సంభవామి’ సంస్థ వెంటనే స్పందించింది. పది మంది బృందం అక్కడికి చేరుకుంది. తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్న పల్లెలకు చేరుకుని వాటర్‌ప్యాకెట్లను, ఆహారపొట్లాలను పంచారు. వారి సమస్యల కోసం... కంటికి కనిపించిన, చెవికి వినిపించిన ఎలాంటి సమస్యపైనైనా స్పందించే ‘సంభవామి’ సంస్థ ఆశయం నెరవేరుస్తున్న ఈ స్నేహితులు మరింతమందకి ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం. - teamsambhavami@gmail.com ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
విదేశాలకు తరలిన నల్లధనమెంత?
* కేంద్రం, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకుల తలో లెక్క * 12 వేల కోట్ల నుంచి 90 లక్షల కోట్ల వరకు వేర్వేరు అంచనాలు న్యూఢిల్లీ: నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిన నేపథ్యంలో విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల అక్రమ సొత్తు ఎంత ఉంటుందన్న దానిపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక లెక్కలు లేనప్పటికీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు, ప్రైవేట్ ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం పలు అంచనాలు మాత్రం ఎప్పటికప్పుడు వెలువడుతున్నాయి. కానీ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గతంలో వెల్లడించిన మొత్తం మాత్రం బాగా ప్రచారంలోకి వచ్చింది. భారతీయుల విదేశీ ఖాతాల్లోని నల్లధనం విలువ దాదాపు రూ. 28 లక్షల కోట్లు ఉంటుందని 2011లో ఆయన పేర్కొన్నారు. అమెరికాకు చెందిన అధ్యయన సంస్థ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ రూపొందించిన నివేదికల ఆధారంగా ఈ లెక్క చెబుతున్నట్లు కూడా అద్వానీ తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు కట్టకుండా, ఆస్తులు వెల్లడించకుండా విదేశీ ఖాతాల్లో అక్రమంగా సొమ్ము దాచుకున్న భారతీయులు 782 మంది ఉన్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. బీజేపీ కూడా భారీ అంచనాలనే వెల్లడించింది. నల్లధనం మొత్తం దాదాపు 30 నుంచి 90 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అప్పట్లో పేర్కొంది. ఇక 2012లో పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రం ప్రకారం నల్లధనం లెక్క రూ. 12,600 కోట్లు మాత్రమే. మరోవైపు 2006లో స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ విడుదల చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన నివేదికలోని భారీ లెక్క కూడా గతంలో వెలుగులోకి వచ్చింది. అయితే దీన్ని స్విస్ అధికారులు, బ్యాంకుల సంఘం కూడా అప్పట్లోనే ఖండించాయి. కాగా, ఈ ఏడాది మే నెలలో కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ మరో అధ్యయన నివేదికను విడుదల చేసింది. నల్లధనంపై భారత్ ఆందోళన సబబేనని అందులో పేర్కొంది. 2002 నుంచి 2011 మధ్య కాలంలో దేశం దాటిన నల్లధనం మొత్తం దాదాపు రూ. 21 లక్షల కోట్లుగా ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. అక్రమ సొమ్ము ప్రవాహం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. -
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి
కలెక్టర్ కిషన్ ఘనంగా ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’ ఎంజీఎం : సమాజంలోని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కలెక్టర్ కిషన్ అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవా న్ని పురస్కరించుకుని బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాల్లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత వివిధ కళాశాల విద్యార్థు లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. రక్తదానం, అవయవదానాన్ని ప్రజలందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రక్త సేకరణ లక్ష్యంలో జిల్లాలో గత ఏడాది 99 శాతం సాధించామని, ఈసారి కూడా 27 వేల యూనిట్ల లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. రక్త సేకరణకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీ యమన్నారు. అదనపు సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రక్తదానంపై విద్యార్థులు, యువకుల కు అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ నాగేశ్వర్రావు మాట్లాడుతూ రక్తసేకరణలో ఎంజీఎం ఆస్పత్రి రాష్ట్రంలో ఆరుసార్లు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరాం అధ్యక్షతన జరిగిన సదస్సులో నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సురేష్‌లాల్, కేంద్ర సాహిత్య అవా ర్డు గ్రహీత అంపశయ్య నవీన్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం 20 నుంచి 85 సార్లు రక్తదానం చేసి న వారికి కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. అలాగే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంపశయ్య నవీన్‌ను కలెక్టర్ సన్మానించారు. -
యాచకులకు ‘గౌరవం’
‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ గౌరవ సదన్ల ఏర్పాటుకుసర్కార్ ప్రత్యేక దృష్టి యాచకుల విముక్తికి కార్యాచరణ స్వచ్ఛంద సంస్థల ద్వారా సర్వే ఉపాధి కల్పించే అవకాశం సమీక్షించిన జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అడుక్కునే వారుండకూడదని సర్కార్ భావిస్తోంది. ఆ వృత్తిని నిషేధించి అందులో ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేసేం దుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’లో భాగంగా నగరంలో భిక్షాటన చేసే వారిని గుర్తించి వారు ఆ వృత్తి నుంచి బయట పడేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం వారికి ‘గౌరవ్ సదన్’లో ఆశ్రయం కల్పించడంతోపాటు ఆసరాగా నిలవాలని చూస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పటికే ఓ దఫా యాచకులపై సర్వే చేపట్టింది. ఇప్పటివరకు 16 ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్ల వద్ద 239 మంది యాచకులతో మాట్లాడి వివరాలు సేకరించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ సమాచారాన్ని జీహెచ్ఎంసీకి అందజేశారు. అయితే సమగ్ర సర్వే జరిపి ఆగస్టు 15లోగా తుది నివేదిక అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులకు సూచించారు. ఒకే పర్యాయంలో యాచకులు తమ మనోభావాల్ని వెల్లడించలేరనే భావనతో మూడు దఫాలుగా సర్వే చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు. ఏయే ప్రాం తాల్లో యాచిస్తున్నారు..?, ఏయే పద్ధతుల్లో వృత్తి కొనసాగిస్తున్నారు..?, రోజుకు సగటు ఆదాయం ఎంత?, వారు చేస్తున్న ఖర్చు?, ప్రస్తుతం ఎక్కడ ఆశ్రయం పొందుతున్నా రు?, సంపాదనతో ఏం చేస్తున్నారు?, ఎలాం టి ఆసరా కోరుకుంటున్నారు..? తదితర వివరాలను తాజాగా చేపట్టే సర్వేలో రాబట్టనున్నారు. ఈ అంశంపై శనివారం ఏపీఐఐసీ వైస్ చైర్మన్ , ఎండీ జయేశ్‌రంజన్‌తో కలిసి సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యాచకుల పునరావాసం కోసం తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా దిగువ కార్యక్రమాలు పూర్తిచేయాల్సిందిగా సూచించారు. ఏయే ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, యాచకుల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న జంక్షన్ల వివరాలు. ట్రాఫిక్ పోలీసుల నుంచి జంక్షన్ల వివరాలు సేకరించి యాచకుల బెడద ఎక్కువగా ఉన్న 100 ప్రాంతాలను గుర్తించాలి. ఆయా జంక్షన్లలోని యాచకుల పునరావాస బాధ్యతలను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం. అందుకోసం ముందు కు వచ్చే ఔత్సాహిక స్వచ్ఛంద సంస్థలకు ఆగస్టు ఒకటిన శిక్షణ కార్యక్రమం. ఒక్కో ట్రాఫిక్ జంక్షన్‌కు ఓ కౌన్సెలర్‌ను నియమించి.. అక్కడి యాచకుల వివరాలతో నివేదిక. యాచకుల ఫొటోతో సహా వ్యక్తిగత వివరాల సేకరణ. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15లోగా పూర్తిచేయాలి. యాచకులను ఏ విధంగానూ ప్రోత్సహించరాదని, పునరావాసం ద్వారా సమాజంలో వారికి తగిన గౌరవం కల్పించాల్సిందిగా ప్రజలకు సూచిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం. వృద్ధులు, వికలాంగుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలను గుర్తించి.. యాచకుల్లోని వృద్ధు లు, వికలాంగులకు సేవలందించేందుకు భాగస్వాములు కావాల్సిందిగా ప్రకటనల ద్వారా కోరడం. యాచకులకు తగిన ఆశ్రయం కల్పించేం దుకు తొలిదశలో జోన్‌కు ఒకటి చొప్పున తగిన భవనాలను గుర్తించి.. వాటిని ‘గౌరవ్ సదన్’లుగా తీర్చిదిద్దడం. గౌరవ్ సదన్లలోకి తరలించే వారికి అవసరమైన ఆహారం, దుస్తులు, సబ్బులు, తలనూనెతోపాటు కొంత నగదు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారికి ఉపాధి చూపించాలి. భిక్షాటనలో ఎన్నో వింతలు.. నగరంలో ఎక్కడ చూసినా యాచకులు కన్పిస్తుంటారు. ఆలయాలు.. మసీదులు.. చర్చిలు, బస్టాప్‌లు, ట్రాఫిక్ సిగ్నళ్లు.. ఫుట్‌పాత్‌ల వద్ద వారు తప్పక ఉంటారు. ఇది కొందరికి కడుపు నింపుతుండగా మరికొందరికి ఉపాధి మార్గంగా మారింది. ఇందులో బాలలు, వృద్ధులు, వికలాంగులు ఎక్కుగా కన్పిస్తుంటారు. ఇక వీరి సంపాదన విషయానికొస్తే రోజుకు రూ.200 నుంచి రూ.1,000 వరకు ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే కొందరు మహిళలు పార్ట్‌టైమ్‌గా భిక్షాటన చేస్తూ మిగతా సమయంలో వ్యభిచారం చేస్తున్నట్టు సమాచారం. ఒక్కో జంక్షన్ వద్ద ఒక్కోపూట యాచిస్తున్న వారూ ఉన్నారు. ఓ జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు వెళ్లేం దుకు ఆటోలున్న వారూ ఉన్నారు. యాచక వృత్తి నుంచి వారిని విముక్తి చేసేందుకు జీహెచ్ఎంసీ పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద నిర్వహించిన తొలి దశ సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఏ పనీ చేయలేని అశక్తులు, వికలాంగులతోపాటు పనులు చేయగల శక్తి కలిగిన వారూ ఉన్నారు. సీజన్‌ను బట్టి కొందరు ఆయా ప్రాంతాల్లో యాచిస్తుంటారు. పండుగలు.. ప్రాంతాలను బట్టి ‘డ్రెస్ కోడ్’ పాటిస్తుంటారు. సంపాదనలో ఒక పూట భోజనం కోసం మాత్రం డబ్బు ఖర్చుచేస్తున్నారు. పగటిపూట భోజనాన్ని అన్నదాన కేంద్రాల్లో చేస్తున్నారు. నగరంలో యాచకవృత్తి చేస్తున్నవారిలో వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు. వికారాబాద్, శంకర్పల్లి, కంది, షాద్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి రోజూ బస్సులు, ఆటోల్లో వచ్చి ఈ వృత్తి కొనసాగిస్తున్నారు. నగర శివార్లు, పొరుగు జిల్లాల నుంచే కాక అనంతపురం వంటి దూరప్రాంతాల నుంచి వచ్చి యాచిస్తున్న వారు కూడా ఉన్నారు. సమీప జిల్లాల వారు ఉదయం 7 గంటలకు నగరానికి చేరుకొని తిరిగి సాయంత్రం తిరిగి వెళ్తున్నారు. సీజన్లను బట్టి భిక్షాటన కోసం నగరానికి వచ్చేవారు. యాచకుల్లో ఓటరుకార్డులు కలిగిన వారి నుంచి వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్నవారు. తాము సంపాదించే సొమ్మును కూడబెట్టి స్థానికుల వద్ద దాచుకుంటున్నారు. కొందరు స్వల్ప సమయాలకు తక్కువ రేటుకు వడ్డీలకు ఇస్తున్నారు. కొసమెరుపు: పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు చాలామంది విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ పథకాలపై తమకు నమ్మకం లేదంటున్నారు. -
తెగనమ్మేకన్నా తిరిగి వాడటం మిన్న!
పండ్ల తోటల్లో వాడి.. తీసేసిన లేటరల్ పైపులను తెగనమ్ముకుంటున్న రైతులు వీటిని ఇతర పంటల్లో పునర్వినియోగానికి తోడ్పడుతున్న స్వచ్ఛంద సంస్థలు రైతులు ఉపయోగించే బిందు సేద్య పరికరాలు, లేటరల్స్ పదేళ్లు పనిచేస్తాయని అంచనా.అయితే, కొన్ని పండ్ల తోటల్లో వేసినవి వివిధ కారణాల వల్ల నాలుగైదేళ్లకే నిరుపయోగంగా మారుతున్నాయి. వీటిని తిరిగి ఇతర పంటల్లో వాడుకోవడం ఎలాగో తెలియకపోవడంతో.. కొందరు రైతులు లేటరల్ పైపులను అతి తక్కువ ధరకే పాత సామాను వ్యాపారులకు అమ్మేస్తూ తీవ్రంగా నష్టపడుతున్నారు. అయితే, పండ్ల తోటల్లో వాడి తీసేసిన లేటరల్ పైపులకు స్వల్ప మార్పులు, చేర్పులు చేసి, ఇతర పంటల సాగుకు కొన్నేళ్లపాటు చక్కగా తిరిగి వినియోగించుకునే మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 5 ఎకరాల పండ్ల తోటల్లో వాడిన లేటరల్ పైపులకు కొన్ని మార్పులు చేసి ఒక ఎకరంలో ఆరుతడి, కూరగాయ పంటలకు వాడుకోవచ్చు. లేటరల్ పైపులను తిరిగి వినియోగించుకోవడంలో రైతులకు సుస్థిర భూగర్భజల యాజమాన్యం (సుగమ్) ప్రాజెక్టు ఉపయోగపడుతోంది. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సీడబ్ల్యూఎస్), రిడ్స్ స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామ రైతులు లేటరల్ పైపులను తిరిగి వినియోగించుకుంటున్నారు. కోటంకలో రైతులు 450 ఎకరాల్లో 54 వేల చీనీ చెట్లను పెంచారు. కొన్నేళ్ల తర్వాత బోర్లు ఎండిపోయి ఎంతో ఆశతో పెంచుకున్న చెట్లను విధిలేక నరికేశారు. 5 ఎకరాల్లో రూ.75 వేలతో అమర్చుకున్న లేటరల్ పైపులను, పరికరాలను రూ.4,500కే అమ్మేశారు. దాచి ఉంచుకున్న కొద్దిమంది రైతులు మాత్రం స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో వీటిని కూరగాయ పంటలకు అనువుగా మార్చి వాడుకుంటున్నారు. అప్పటికే తోటలు ఎండిపోయి నష్టపోయి ఉన్న రైతులు ఈ లేటరల్స్‌ను వేరే పంటలకు వాడుకోవాలంటే మరికొంత ఖర్చవుతుంది. అయితే, ఈ ఖర్చులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు (కొన్ని జిల్లాల్లో మాత్రమే) చెల్లిస్తుండడం రైతులకు ఊరట కలుగుతోంది. ఇలా లబ్ధిపొందిన కోటంకకు చెందిన రైతుల్లో వై.రామలింగారెడ్డి(94900 29375) ఒకరు. ఆయన ఇలా చెప్పారు: ‘బోరు కింద 5 ఎకరాల్లో చీనీ (బత్తాయి) మొక్కలు నాటి. బిందు సేద్య పరికరాలను సబ్సిడీపై తీసుకొని అమర్చాను. బోరులో నీరు తగ్గిపోవటం, తెగులు సోకడంతో చీనీ చెట్లను నరికి వేశా. 5 ఎకరాల పండ్ల తోటలో వాడిన లేటరల్ను 1 ఎకరంలో కూరగాయ పంటలకు తిరిగి వేసుకోవడానికి ‘సుగమ్’ ప్రాజెక్టు సిబ్బంది తోడ్పడ్డారు. ఖర్చులో రూ.10,328ను సీడబ్ల్యూఎస్ సంస్థ ఇవ్వగా, మరో రూ.4,450లు నేను భరించాను. బటన్ డ్రిప్పర్లు వాడితే ఈ ఖర్చు తగ్గుతుంది. మరో పది మంది రైతులు కూడా లేటరల్ పైపులను తిరిగి వాడుకుంటున్నారు..’ - జె.ఆదినారాయణ, న్యూస్‌లైన్, గార్లదిన్నె, అనంతపురం పాత లేటరల్స్ వాడకంపై శిక్షణ రైతు దగ్గర ఉన్న పాత లేటరల్ పైపులను తిరిగి ఇన్స్టాల్ చేయడానికి మా సంస్థ ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తుంది. వీటిని తిరిగి ఇన్స్టాల్ చేయడానికి అవసరమైన ఇతర పరికరాల కొనుగోలుకు ఎకరానికి రూ.7 వేల నుంచి 10 వేలు ఖర్చవుతుంది. అనంతపురం, వరంగల్ జిల్లాల్లో రైతులకైతే ఈ ఖర్చులో కొంత భాగాన్ని మా సంస్థ ఆర్థిక సాయంగా అందిస్తుంది. ఇతర జిల్లాల రైతులకు ఆర్థిక సహాయం చేయలేకపోయినా.. రైతుల దగ్గరున్న పాత లేటరల్ పైపులను ఉచితంగానే ఇన్స్టాల్ చేయిస్తాం. అయితే, ప్రస్తుతం ఇన్స్టాల్ చేసే నిపుణుల కొరత ఉంది. దీనిపై యువ రైతులు, గ్రామీణ యువకులకు 2 రోజుల శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. శిక్షణ పొందదల చిన వారు సంప్రదించాల్సిన చిరునామా: సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సుగమ్ ప్రాజెక్టు), 12-13-451, వీధి నం:1, తార్నాక, సికింద్రాబాద్. ఫోన్: 040-27007906 - పి. రజనీకాంత్ (98495 75147), సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ‘సుగమ్’ ప్రాజెక్టు -
బాల్యం బందీ
సాక్షి, మంచిర్యాల : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేపడుతున్నాయి. జిల్లాస్థాయిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది. ఎన్ని ఉన్నా బాల కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక బాలకార్మిలను గుర్తించిన కార్మిక శాఖాధికారులు కేవలం కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. మంచిర్యాల పట్టణ పరిధిలోని ప లు మురికివాడల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి బదులు పనికి పంపిస్తున్నారు. బె ల్లంపల్లి పరిధిలోని షంషీర్‌నగర్‌లో సుమారు 20 కుటుంబాలు చెత్తపేపర్లు ఏరుకుని జీవిస్తున్నాయి. పెద్దలతోపాటే చిన్నారు లూ వెళ్తారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణం. మూతబడ్డ రెసిడెన్షియల్ కేంద్రాలు.. జిల్లాలోని బాలకార్మికులను గుర్తించి వారికి చదువు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. బా లలను గుర్తించిన రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఆ కేంద్రాలలో చేర్పించారు. ఒక్కో కేం ద్రంలో 50 మంది చొప్పున ప్రతి విద్యార్థికి ఆహారం, వసతి, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం ఏటా రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు కేటాయిస్తోంది. ఏటా ఆ స్వచ్ఛంద సం స్థలు కేంద్రాలను రెన్యూవల్ చేయించుకునే వారు. జూన్ 2013 వరకు జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్, మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట, కుభీర్, సిర్పూర్(యు)లలో కేంద్రాలు నిర్వహించారు. కేంద్రాల గడువు పూర్తయిం ది. ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించలేదు. దీంతో ఆర్వీఎం అధికారులు బడిబయట గు ర్తించిన బాలలను సమీప ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలలో చేర్పించారు. అనంతరం వారు ఉన్నారో లేరో పట్టించుకోలేదు. ఈ విషయమై ఆర్వీఎం ప్రత్యామ్నాయ పాఠశాలల కో-ఆర్డినేటర్ సత్తార్‌ను అడుగగా.. రె సిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పా టు కోసం కలెక్టర్‌కు ఫైలు పెట్టాం. ఆదేశా లందిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. మూసివేత దిశగా ఎన్సీఎల్పీలు.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2008-09 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్(ఎన్సీఎల్పీ)ను ప్రారంభించింది. నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. ఒ క్కో ప్రాజెక్టు నిర్వహణకు ప్రతినెలా రూ.18 వేలు కేటాయిస్తోంది. కార్ఖానాలు, హోటళ్లు, ఇ టుక బట్టీలు, పరిశ్రమల్లో కార్మికులుగా రోడ్ల పై భిక్షాటన చేస్తూ, కాగితాలు ఏరుకునే తొ మ్మిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయస్సు ఉన్న చి న్నారులను చేర్పించి ప్రాథమిక విద్య అందించాలి. ఒక్కో పాఠశాలల్లో 50 మందికి మించకుండా విద్యార్థులు ఉండాలి. 2012 వరకు జిల్లా వ్యాప్తంగా 40 ప్రాజెక్టులు కొనసాగాయి. తర్వాత ప్రాజెక్టులపై అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో స్వచ్ఛంద సంస్థలు చిన్నారులు లేకున్నా బినామీలను సృష్టించి నిధులు కాజేశాయి. పలుచోట్ల స్వచ్ఛంద సంస్థలు పాఠశా ల నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శించాయి. విష యం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం విచారణ జరిపి ఆయా కేంద్రాలు రద్దు చేసింది. ప్ర స్తుతం లక్సెట్టిపేట, మంచిర్యాల, కాగజ్‌నగర్ లో రెండు చొప్పున, రామకృష్ణాపూర్లో ఒకటి మొత్తం ఏడు కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ కేంద్రాలూ మూ తబడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి తో డు ప్రస్తుతం కేంద్రం కూడా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం లేదు. -
ఉత్సవాల వెలుగులు..
=పర్యాటకరంగానికి ఊపునిచ్చిన వేడుకలు =ఎల్లలు దాటిన పేరిణి నృత్యం =కాకతీయుల చరిత్రపై 20 పుస్తకాలు =ఓరుగల్లుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు సాక్షి, హన్మకొండ: ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఏడాదిపాటు జరి గిన కాకతీయ ఉత్సవాలు పది కాలాల పాటు గుర్తుండే తీపి జ్ఞాపకాలను జిల్లా ప్రజలకు పంచింది. వందల ఏళ్లుగా గు ర్తింపుకు నోచుకోని కాకతీయ కళా రూపాలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన ప్రాథమిక చర్యలకు పునాది వేసింది. అంతేకాదు... ఇక్కడి పర్యాటక రంగానికి ఊతమిచ్చే పలు అభివృద్ధి కార్యక్రమాలను పెండింగ్ జాబితా నుంచి తొలగించి నిర్మాణ పట్టాలపైకి మళ్లించింది. కలెక్టర్ కృషితో కొత్త కళ కాకతీయ ఉత్సవాలను ప్రారంభించిన తర్వాత కాకతీయ ఔన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ప్రజలు ముందుకు వచ్చారు. వీరి భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా కలెక్టర్‌గా జి.కిషన్ బాధ్యతలు చే పట్టాక కాకతీయ వేడుకలు జనరంజకంగా మారాయి. నిధుల కొరత వెంటాడుతున్నా... ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసి నిధులు వచ్చేలా చూశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే పక్కా ప్రణాళిక రూపొందించారు. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ... వరుసగా నాలుగు నెలలపాటు అన్ని కార్యక్రమాలను విజయవంతమయ్యేలా చూసి సలీకృతుడయ్యూరు. దేశవ్యాప్త గుర్తింపు ఉత్సవాల సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, ఇన్టాక్ సంస్థలు సంయుక్తంగా పలు కార్యక్రమాలు చేపట్టాయి. వా టి ఆధ్వర్యంలో పేరిణి నృత్యంపై కాకతీయుల సేనాని జ యూపసేనాని సంస్కృతంలో రచించిన నృత్యరత్నావళి గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకం ప్రపంచ భాషలోకి అనువదించడం వల్ల వీరరసం ప్రధానంగా సాగే అరుదైన పేరిణి నృత్యం విశిష్టతను మన రాష్ట్ర ఎల్లలు దా టించి అన్ని ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చినట్లైం ది. అదేవిధంగా విదేశాల నుంచి మనదేశంలో పర్యటించే వారికి కాకతీయ కట్టడాల సొబగులు, నిర్మాణ కౌశలం, శిల్పకళల సౌందర్యాన్ని తెలిపేలా... ప్రపంచ పర్యాటకులకు వ రంగల్ పంపిన ఆహ్వాన పత్రికలా కాకతీయ డైనస్టీ పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ని ముద్రించారు. వీటితో పాటు పలువురు రచయితలు 20కి పైగా పుస్తకాలను రచించారు. అంతేకాకుం డా... ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణాలుగా నిలిచిన నీటి లో తేలియాడే ఇటుకలు, సాండ్‌బాక్స్ టెక్నాలజీ, గొలుసుక ట్టు చెరువులపై న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించడంతో నాటి కాకతీయుల గొప్పదనాన్ని చాటారు. స్పీడ్ పెంచిన పర్యాటకశాఖ తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే లక్నవరం, రా మప్ప, ఖిలావరంగల్, వేయిస్తంభాల గుడి, పాకాల వంటి ప్రకృతి, చారిత్రక పర్యాటక ప్రాంతాలకు జిల్లా నెలవుగా ఉం ది. కానీ... ఇక్కడికి వచ్చే పర్యాటకులు బస చేసేందుకు చక్క ని హోటల్ లేదు. ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఊపుతో అప్పటివరకు నెమ్మదిగా సాగుతున్న పలు పనులు వేగం పుంజుకున్నాయి. హన్మకొండలో హరిత కాకతీయ హోటల్ అందుబాటులోకి రావడమే కాదు... ఈ ఏడు ఉత్తమ హోటల్‌గా పర్యాటక శాఖ అవార్డును గెలుచుకుంది. రూ. 5 కోట్లతో ఖిలావరంగల్‌లో సౌండ్ అండ్ లైట్షో ఏర్పాటు చేశారు. గణపురం కోటగుళ్లలో రూ.65 లక్షల వ్యయంతో పర్యాటకులకు వసతి సౌకర్యం, లక్నవరంలో లేక్కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ ఫెస్టివల్ గుర్తుగా కాజీపేట వడ్డేపల్లి చెరువుపై పైలాన్ నిర్మాణం, కాకతీయుల విశిష్టతను తెలిపే సావనీర్‌ను ఆవిష్కరించారు. జాకారం శివాలయం అభివృద్ధికి రూ.22 లక్షలు విడుదల అయ్యాయి. -
‘నాకో’ నిధులు కాజేశారు!
ఎయిడ్స్ నియంత్రణ మండలి నిధులకు ‘స్వచ్ఛంద’ రోగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి(ఏపీ శాక్స్)లో కోట్లాది రూపాయల నిధులను కొన్ని స్వచ్ఛంద సంస్థలు గద్దల్లా తన్నుకుపోయాయి. ‘స్వచ్ఛంద’ ముసుగులో కోట్లకు కోట్లు తినేశాయి. ఎల్లయ్య, పుల్లయ్య.. ఇలా రకరకాలుగా నకిలీ పేర్లు సృష్టించి హెచ్ఐవీ పరీక్షలు చేసేశారు. రికార్డుల్లో నమోదైన వారి చిరునామాలకు వెళ్లి క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ చేయగా వందకు ఒక్కటి కూడా నిజమైంది లేదని తేలింది. అంతేకాదు.. కాల పరిమితి తీరిన కిట్లను సైతం పరీక్షలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. నిధుల వినియోగానికి, ఎయిడ్స్ పరీక్షా కిట్లకూ ఎక్కడా పొంతన లేదని ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగితాలపై పేర్లు చూపి కోట్లు స్వాహా రాష్ట్రంలో హెచ్ఐవీ పరీక్షల పేరిట భారీగా గోల్మాల్ జరిగింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(నాకో) ఇచ్చిన నిధులను కొన్ని ఎన్జీవోలు తప్పుడు లెక్కలు చూపి కాజేశాయి. హెచ్ఐవీ రోగులకు కౌన్సెలింగ్, వైద్యం, రోగుల గుర్తింపు చేపట్టకుండానే రూ.35 కోట్లు స్వాహా చేశాయి. హెఎల్ఎఫ్ పీపీటీ, అలియన్స్ తదితర బడా ఎన్జీవోలకు కోట్లాది రూపాయలు కేటాయించగా అవి చిన్న ఎన్జీవోలకూ సబ్ కాంట్రాక్టు ఇచ్చాయి. కనీసం రూ.10 కోట్లకు కూడా నికరంగా వైద్య పరీక్షలు చేయలేదని ఆడిట్లో వెల్లడైంది. జిల్లాల్లో స్థానికంగా పర్యవేక్షించే ప్రాజెక్ట్ మేనేజర్లు ఎన్జీవోల వద్ద వసూళ్లు చేసి జేడీలకు ముట్టచెపుతున్నట్లు తెలిసింది. గత నాలుగేళ్లలో కనీసం రూ.60 కోట్లు దుర్వినియోగమైంది. కాలం చెల్లిన కిట్ల బాగోతం బట్టబయలు ఎయిడ్స్ పరీక్షా కిట్లను నిర్దేశిత గడువు తేదీకి మించి ఒక్క రోజు కూడా ఎక్కువగా వాడకూడదు. అలా వాడితే ఫలితాలు తారుమారై తీవ్ర అనర్ధాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కాలం చెల్లిన ఎయిడ్స్ టెస్ట్ కిట్లు హైదరాబాద్ మల్కాజిగిరిలోని ఓ స్వచ్ఛంద సంస్థ వద్ద ఇటీవల వెలుగుచూశాయి. తొలుత వీఎస్ఎస్ఏ(వెంకటేశ్వర సోషల్ సర్వీస్ ఏజెన్సీ)లో బయటపడ్డాయి. నిజామాబాద్ నుంచి సుమారు 10 వేల ఎక్స్పైరీ కిట్లు రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ తదితర ప్రాంతాలకు తరలించారు. వీటిని సంచార పరీక్షా కేంద్రాలు(మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్స్)లో వాడుతున్నట్లు తేలింది. ఈ విషయం బయటపెట్టిన క్షేత్రస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు బెదిరించటంతో నోరు మూసుకున్నారు. ఈ కిట్లు వీఎస్ఎస్ఏ, లెప్రా ఇండియా ఎన్జీవోల నుంచి బయటపడ్డాయి. మొబైల్ ఐసీటీసీలకు అనుమతిపై ఏపీ శాక్స్ సంయుక్త సంచాలకులు డా.జయచంద్రారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా... లెప్రా ఇండియా, వాసవి మహిళా మండలి అనే రెండు ఎన్జీవోలకు నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టు ఇచ్చానని, తాము ఎవరివద్దా డబ్బు తీసుకోలేదన్నారు. ఎక్స్పైరీ కిట్లను వాడటంపై విచారణ చేస్తున్నామన్నారు.