ఉత్సవాల వెలుగులు..
=పర్యాటకరంగానికి ఊపునిచ్చిన వేడుకలు
=ఎల్లలు దాటిన పేరిణి నృత్యం
=కాకతీయుల చరిత్రపై 20 పుస్తకాలు
=ఓరుగల్లుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు
సాక్షి, హన్మకొండ: ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఏడాదిపాటు జరి గిన కాకతీయ ఉత్సవాలు పది కాలాల పాటు గుర్తుండే తీపి జ్ఞాపకాలను జిల్లా ప్రజలకు పంచింది. వందల ఏళ్లుగా గు ర్తింపుకు నోచుకోని కాకతీయ కళా రూపాలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన ప్రాథమిక చర్యలకు పునాది వేసింది. అంతేకాదు... ఇక్కడి పర్యాటక రంగానికి ఊతమిచ్చే పలు అభివృద్ధి కార్యక్రమాలను పెండింగ్ జాబితా నుంచి తొలగించి నిర్మాణ పట్టాలపైకి మళ్లించింది.
కలెక్టర్ కృషితో కొత్త కళ
కాకతీయ ఉత్సవాలను ప్రారంభించిన తర్వాత కాకతీయ ఔన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ప్రజలు ముందుకు వచ్చారు. వీరి భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా కలెక్టర్‌గా జి.కిషన్ బాధ్యతలు చే పట్టాక కాకతీయ వేడుకలు జనరంజకంగా మారాయి. నిధుల కొరత వెంటాడుతున్నా... ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసి నిధులు వచ్చేలా చూశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే పక్కా ప్రణాళిక రూపొందించారు. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ... వరుసగా నాలుగు నెలలపాటు అన్ని కార్యక్రమాలను విజయవంతమయ్యేలా చూసి సలీకృతుడయ్యూరు.
దేశవ్యాప్త గుర్తింపు
ఉత్సవాల సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, ఇన్‌టాక్ సంస్థలు సంయుక్తంగా పలు కార్యక్రమాలు చేపట్టాయి. వా టి ఆధ్వర్యంలో పేరిణి నృత్యంపై కాకతీయుల సేనాని జ యూపసేనాని సంస్కృతంలో రచించిన నృత్యరత్నావళి గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకం ప్రపంచ భాషలోకి అనువదించడం వల్ల వీరరసం ప్రధానంగా సాగే అరుదైన పేరిణి నృత్యం విశిష్టతను మన రాష్ట్ర ఎల్లలు దా టించి అన్ని ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చినట్లైం ది. అదేవిధంగా విదేశాల నుంచి మనదేశంలో పర్యటించే వారికి కాకతీయ కట్టడాల సొబగులు, నిర్మాణ కౌశలం, శిల్పకళల సౌందర్యాన్ని తెలిపేలా... ప్రపంచ పర్యాటకులకు వ రంగల్ పంపిన ఆహ్వాన పత్రికలా కాకతీయ డైనస్టీ పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ని ముద్రించారు. వీటితో పాటు పలువురు రచయితలు 20కి పైగా పుస్తకాలను రచించారు. అంతేకాకుం డా... ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణాలుగా నిలిచిన నీటి లో తేలియాడే ఇటుకలు, సాండ్‌బాక్స్ టెక్నాలజీ, గొలుసుక ట్టు చెరువులపై న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించడంతో నాటి కాకతీయుల గొప్పదనాన్ని చాటారు.
స్పీడ్ పెంచిన పర్యాటకశాఖ
తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే లక్నవరం, రా మప్ప, ఖిలావరంగల్, వేయిస్తంభాల గుడి, పాకాల వంటి ప్రకృతి, చారిత్రక పర్యాటక ప్రాంతాలకు జిల్లా నెలవుగా ఉం ది. కానీ... ఇక్కడికి వచ్చే పర్యాటకులు బస చేసేందుకు చక్క ని హోటల్ లేదు. ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఊపుతో అప్పటివరకు నెమ్మదిగా సాగుతున్న పలు పనులు వేగం పుంజుకున్నాయి. హన్మకొండలో హరిత కాకతీయ హోటల్ అందుబాటులోకి రావడమే కాదు... ఈ ఏడు ఉత్తమ హోటల్‌గా పర్యాటక శాఖ అవార్డును గెలుచుకుంది. రూ. 5 కోట్లతో ఖిలావరంగల్‌లో సౌండ్ అండ్ లైట్‌షో ఏర్పాటు చేశారు. గణపురం కోటగుళ్లలో రూ.65 లక్షల వ్యయంతో పర్యాటకులకు వసతి సౌకర్యం, లక్నవరంలో లేక్‌కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ ఫెస్టివల్ గుర్తుగా కాజీపేట వడ్డేపల్లి చెరువుపై పైలాన్ నిర్మాణం, కాకతీయుల విశిష్టతను తెలిపే సావనీర్‌ను ఆవిష్కరించారు. జాకారం శివాలయం అభివృద్ధికి రూ.22 లక్షలు విడుదల అయ్యాయి.