సాక్షి, మంచిర్యాల : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేపడుతున్నాయి. జిల్లాస్థాయిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది. ఎన్ని ఉన్నా బాల కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక బాలకార్మిలను గుర్తించిన కార్మిక శాఖాధికారులు కేవలం కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు.
తర్వాత పట్టించుకోవడం లేదు. మంచిర్యాల పట్టణ పరిధిలోని ప లు మురికివాడల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి బదులు పనికి పంపిస్తున్నారు. బె ల్లంపల్లి పరిధిలోని షంషీర్‌నగర్‌లో సుమారు 20 కుటుంబాలు చెత్తపేపర్లు ఏరుకుని జీవిస్తున్నాయి. పెద్దలతోపాటే చిన్నారు లూ వెళ్తారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణం.
మూతబడ్డ రెసిడెన్షియల్ కేంద్రాలు..
జిల్లాలోని బాలకార్మికులను గుర్తించి వారికి చదువు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. బా లలను గుర్తించిన రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఆ కేంద్రాలలో చేర్పించారు. ఒక్కో కేం ద్రంలో 50 మంది చొప్పున ప్రతి విద్యార్థికి ఆహారం, వసతి, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం ఏటా రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు కేటాయిస్తోంది. ఏటా ఆ స్వచ్ఛంద సం స్థలు కేంద్రాలను రెన్యూవల్ చేయించుకునే వారు.
జూన్ 2013 వరకు జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్, మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట, కుభీర్, సిర్పూర్(యు)లలో కేంద్రాలు నిర్వహించారు. కేంద్రాల గడువు పూర్తయిం ది. ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించలేదు. దీంతో ఆర్వీఎం అధికారులు బడిబయట గు ర్తించిన బాలలను సమీప ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలలో చేర్పించారు. అనంతరం వారు ఉన్నారో లేరో పట్టించుకోలేదు. ఈ విషయమై ఆర్వీఎం ప్రత్యామ్నాయ పాఠశాలల కో-ఆర్డినేటర్ సత్తార్‌ను అడుగగా.. రె సిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పా టు కోసం కలెక్టర్‌కు ఫైలు పెట్టాం. ఆదేశా లందిన వెంటనే ప్రారంభిస్తామన్నారు.
మూసివేత దిశగా ఎన్‌సీఎల్పీలు..
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2008-09 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్(ఎన్‌సీఎల్పీ)ను ప్రారంభించింది. నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. ఒ క్కో ప్రాజెక్టు నిర్వహణకు ప్రతినెలా రూ.18 వేలు కేటాయిస్తోంది. కార్ఖానాలు, హోటళ్లు, ఇ టుక బట్టీలు, పరిశ్రమల్లో కార్మికులుగా రోడ్ల పై భిక్షాటన చేస్తూ, కాగితాలు ఏరుకునే తొ మ్మిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయస్సు ఉన్న చి న్నారులను చేర్పించి ప్రాథమిక విద్య అందించాలి.
ఒక్కో పాఠశాలల్లో 50 మందికి మించకుండా విద్యార్థులు ఉండాలి. 2012 వరకు జిల్లా వ్యాప్తంగా 40 ప్రాజెక్టులు కొనసాగాయి. తర్వాత ప్రాజెక్టులపై అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో స్వచ్ఛంద సంస్థలు చిన్నారులు లేకున్నా బినామీలను సృష్టించి నిధులు కాజేశాయి. పలుచోట్ల స్వచ్ఛంద సంస్థలు పాఠశా ల నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శించాయి. విష యం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం విచారణ జరిపి ఆయా కేంద్రాలు రద్దు చేసింది.
ప్ర స్తుతం లక్సెట్టిపేట, మంచిర్యాల, కాగజ్‌నగర్ లో రెండు చొప్పున, రామకృష్ణాపూర్‌లో ఒకటి మొత్తం ఏడు కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ కేంద్రాలూ మూ తబడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి తో డు ప్రస్తుతం కేంద్రం కూడా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం లేదు.
బాల్యం బందీ
Published Wed, Jan 29 2014 3:01 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement