
కాబూల్: ఆఫ్గనిస్థాన్‌లో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమి లోపల 17 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా తెలియదు.
గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఆఫ్ఘనిస్థాన్‌లో ఇదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
ఇదీ చదవండి: హౌతీలపై అమెరికా మిత్రపక్షాల వైమానిక దాడులు