Earthquake center
-
ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదు
కాబూల్: ఆఫ్గనిస్థాన్‌లో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమి లోపల 17 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా తెలియదు. గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఆఫ్ఘనిస్థాన్‌లో ఇదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఇదీ చదవండి: హౌతీలపై అమెరికా మిత్రపక్షాల వైమానిక దాడులు -
Andaman Islands Earthquake: అండమాన్‌లో భూకంపం..
ఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. కాగా, రికార్ట్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాల ప్రకారం.. అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ సందర్భంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, తీవ్ర ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. Earthquake of magnitude 4.1 on the Richter Scale strikes the Andaman Islands at 07:53 am: National Center for Seismology pic.twitter.com/JpjTtIglaN — ANI (@ANI) January 10, 2024 ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. 2024 ఏడాది ప్రారంభంలోనే జపాన్ను వరుస భూకంపాలు వణికించాయి. ఈ భూకంపం ధాటికి 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. -
అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈనెల 7వ తేదీన శక్తివంతమైన భూకంపం చోటుచేసుకున్న హెరాట్ ప్రావిన్స్‌లోనే ఆదివారం మళ్లీ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం హెరాట్ ప్రావిన్స్ రాజధాని హెరాట్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో భూమికి 8 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. తాజా భూకంపం తాకిడికి నలుగురు చనిపోగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు స్వచ్చంద సంస్థలు తెలిపాయి. బలోచ్ ప్రాంతంలోని రబట్ సాంగి జిల్లాలోని కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 7న భూకంపం సంభవించిన హెరాట్ ప్రావిన్స్‌లో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. మొత్తం 2 వేల మందికి పైగా చనిపోగా మృతుల్లో 90 శాతం వరకు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
సముద్రంలో స్వల్ప భూకంపం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2.16 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు 121 కి.మీ. దూరంలోను, ఒడిషాకు 161 కి.మీ., పూరీకి 230 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు తెలిపారు. అయితే.. భూమికి 100 కి.మీ. లోతులో ఈ ప్రకంపనలు రావడంతో పెద్దగా ప్రభావం చూపలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. భూ అంతర్భాగంలో శిలల మధ్య జరిగిన సర్దుబాటు కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు జియాలజీ విభాగ నిపుణులు చెబుతున్నారు. -
అఫ్గాన్‌లో భూకంపం
న్యూఢిల్లీ/కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో శక్రవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు జాతీయ భూకంప కేంద్రం (ఎన్సీఎస్) వెల్లడించింది. రిక్టరు స్కేలుపై 6.3 తీవ్రతతో సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని తెలిపింది. ప్రాణ, ఆర్థిక నష్టం వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. -
శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో శనివారం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కవిటి, సోంపేట సముద్ర తీరగ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించినట్టు భూకంప కేంద్రం పేర్కొంది. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురైన జనం ఇళ్లలోనుంచి భయటకు పరుగులు తీశారు.