ఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. కాగా, రికార్ట్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
వివరాల ప్రకారం.. అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ సందర్భంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, తీవ్ర ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Earthquake of magnitude 4.1 on the Richter Scale strikes the Andaman Islands at 07:53 am: National Center for Seismology pic.twitter.com/JpjTtIglaN
— ANI (@ANI) January 10, 2024
ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. 2024 ఏడాది ప్రారంభంలోనే జపాన్‌ను వరుస భూకంపాలు వణికించాయి. ఈ భూకంపం ధాటికి 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment