Seismographic
-
Andaman Islands Earthquake: అండమాన్‌లో భూకంపం..
ఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. కాగా, రికార్ట్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాల ప్రకారం.. అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ సందర్భంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, తీవ్ర ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. Earthquake of magnitude 4.1 on the Richter Scale strikes the Andaman Islands at 07:53 am: National Center for Seismology pic.twitter.com/JpjTtIglaN — ANI (@ANI) January 10, 2024 ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. 2024 ఏడాది ప్రారంభంలోనే జపాన్ను వరుస భూకంపాలు వణికించాయి. ఈ భూకంపం ధాటికి 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. -
భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు..
న్యూఢిల్లీ: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్‌లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణలు అంచనావేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజరూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. గుజరాత్లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు రాగా.. తాజాగా సోమవారం ఉదయం సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రత నమోదైంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని యుక్సోం ప్రాంతంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం ట్విట్టర్లో తెలిపింది. ఉదయం 4:15 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు పేర్కొంది. Earthquake of Magnitude:4.3, Occurred on 13-02-2023, 04:15:04 IST, Lat: 27.81 & Long: 87.71, Depth: 10 Km ,Location: 70km NW of Yuksom, Sikkim, India for more information Download the BhooKamp App https://t.co/FgmIkxe9Q2@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/1FuxFI7Ire — National Center for Seismology (@NCS_Earthquake) February 13, 2023 అస్సాం, గుజరాత్‌లోనూ ఆదివారం అస్సాంలోనూ భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. అంతుకుముందు రోజు గుజరాత్ సూరత్‌లోనూ 3.8 తీవ్రతో భూమి కంపించింది. దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్‌లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. మనకు ముప్పు ఎంత? -
షాకింగ్.. భూకంపం ధాటికి 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ!
ఇస్తాన్‌బుల్: టర్కీలో సోమవారం 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘోర వివత్తులో వేల మంది చనిపోయారు. అయితే భూకంపం కారణంగా టర్కీ దేశం ఐదారు మీటర్ల దూరం పక్కకు జరిగినట్లు భూవిజ్ఞాన పరిశోధకులు తెలిపారు.. ట 'సోమవారం టర్కీలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలు అది ఉన్న టెక్టోనిక్ ప్లేట్లను మూడు అడుగుల నుంచి 10 మీటర్ల వరకు కదిలించి ఉండవచ్చు. టర్కీ పశ్చిమం వైపు సిరియాతో పోలిస్తే ఐదు నుంచి ఆరు మీటర్లు పక్కకు జరిగే అవకాశం ఉంది.' అని ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతంలోని మార్పుల గురించి మాట్లాడుతూ.. 190 కిలోమీటర్ల పొడవు, 25 వెడల్పుతో భారీ పగుళ్లు ఏర్పడి, భూమి భీకరంగా కదిలిందని పేర్కొన్నారు. తొమ్మిది గంటల వ్యవధిలో రెండు అత్యంత శక్తివంతమైన భూకంపాలు వచ్చాయన్నారు. వాస్తవానికి భూమి కంపిస్తూనే ఉందని రిక్టర్ స్కేల్‌పై 5-6 డిగ్రీల వద్ద తరచుగా గణనీయమైన తీవ్రతతో నాశనం అవుతూనే ఉందన్నారు. అదే సమయంలో చిన్నపాటి కుదుపులకు గురైనట్లు వివరించారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని పేర్కొన్నారు. చదవండి: 38 ఏళ్లోచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేదు.. నా కుమారుడులో ఏదో లోపం ఉంది.. ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లికి షాక్..! -
నోయిడా ట్విన్ టవర్స్‌లో అత్యాధునిక సిస్మోగ్రాఫ్, బ్లాక్ బాక్సులు
నోయిడా: వంద మీటర్ల ఎత్తయిన జంట సౌధాలను నేలమట్టం చేసే సందర్భాన్ని పరిశోధకులు తమ అధ్యయనం కోసం వినియోగించుకున్నారు. భవిష్యత్ పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు ఈ బహుళ అంతస్తుల భవంతులను ఎంచుకున్నారు. వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ విధానంలో నోయిడా సెక్టార్93ఏలోని జంట భవనాలను ఆదివారం నేలమట్టంచేయడం తెల్సిందే. పేలుడుపదార్ధాల ధాటికి భవనం నేలను తాకే క్రమం, శిథిలాలు సమీప ప్రాంతాలపై చూపే ప్రభావం, తదితర సమగ్ర సమాచారం సేకరించారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజ్ కెమెరాలతో సంఘటనను అన్ని వైపుల నుంచీ షూట్‌చేశారు. చదవండి: (నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి) పేలుడు ప్రభావాన్ని అంచనావేసేందుకు 20 అత్యాధునిక సిస్మోగ్రాఫ్‌లు, 10 బ్లాక్ బాక్స్‌లను ఆ భవనాల్లోనే బిగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీబీఆర్ఐ) శాస్త్రవేత్త దేబీ ప్రసన్న చెప్పారు. పేలుడు ధాటికి భూమి కంపనాలను గణించేందుకు సిస్మోగ్రాఫ్‌లను వాడారు. జెట్ డెమోలీషన్స్ అండ్ ఎడిఫీస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ భవనాలకు పేలుడుపదార్థాలు అమర్చి పేల్చేసింది. బ్లాక్ బాక్స్ బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!) -
అంగారకుడిపై కంపనాలు
వాషింగ్టన్: అంగారకుడిపై మొదటిసారి కంపనాలకు సంబంధించిన శబ్దాలు రికార్డయ్యాయి. మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ‘ఇన్సైట్’ అంతరిక్ష నౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తించింది. ఇన్‌సైట్‌లో అమర్చిన సిస్మిక్ ఎక్స్పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్(ఎస్ఈఐఎస్) పరికరం ఈ నెల 6వ తేదీన ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. గతేడాది మేలో ఇన్‌సైట్‌ను ప్రయోగించగా డిసెంబర్లో సిసిమోమీటర్ను అది అంగారకుడి ఉపరితలంపై ఉంచింది. ఈ కంపనాల్ని మార్టియన్ సోలార్ 128 కంపనాలుగా పిలుస్తున్నారు. ఇక అంగారకుడి అంతర్భాగం నుంచి మొట్టమొదటిసారి వచ్చిన కంపనాలు ఇవే కావడం గమనార్హం. ఇప్పటివరకు అంగారకుడిపై మార్చి 14, ఏప్రిల్ 10, ఏప్రిల్ 11 తేదీల్లో అత్యంత చిన్న చిన్న కంపనాలను కూడా సిసిమోమీటర్ గుర్తించింది. అయితే సోలార్ 128 కంపనాలు ఇంతకుముందు నాసా చేపట్టిన మూన్ మిషన్‌లో కనుగొన్న కంపనాలను పోలి ఉన్నాయి. దీంతో సోలార్ 128 కంపనాలపైనే శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కంపనాలు ఏర్పడటానికి గల అసలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ కంపనాలు చాలా చిన్నవని, ఇటువంటి చిన్న చిన్న కంపనాలను గుర్తించడమే ఇన్సైట్ నౌక అసలు లక్షమని ఇన్సైట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ బ్రూస్ బానెర్డ్ తెలిపారు. ఇన్సైట్ బృందానికి 128 కంపనాలు మైలురాయి లాంటిదని, ఇలాంటి సంకేతాల కోసం కొన్ని నెలలుగా తాము ఎదురుచూస్తున్నామని శాస్త్రవేత్త ఫిల్ లాగ్నొన్నె తెలిపారు. -
భయం.. భయం
► హడలెత్తిస్తున్న భూ ప్రకంపనలు ► ఉదయగిరిలో ఏడాదిలోపు 28 సార్లు కంపనాలు ► శనివారం ఒక్కరోజే ఐదుసార్లు కంపించిన భూమి ► రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదు ఉదయగిరి: పెళపెళమంటూ భారీ శబ్దం.. ఆ వెంటనే కాళ్లకింద భూమి కదులుతున్నట్లు భావన.. ఇళ్లల్లో సామాన్లు కిందపడిపోవడం.. పాత ఇళ్లు బీటలువారడం.. దీంతో వణికిపోతూ బయటకు పరుగులు పెడుతున్న జనం.. ఇవి ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలోని పది ఇరవై రోజులకోసారి చోటుచేసుకుంటున్న అలజడి. ఈప్రాంతం భూకంపాల జోన్లో లేదని సిస్మోగ్రాఫిక్ అధికారులు చెబుతున్నప్పటికీ అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు చెందిన సిస్మోగ్రాఫిక్ అధికారులు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పరిశోధనలు చేసి భూమి పైపొరల్లో సర్దుబాటు వల్ల సంభవించే సాధారణ ప్రక్రియ అని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ఈ ప్రకంపనలు మాత్రం ఆగకపోగా.. క్రమేణా తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం ఒక్కరోజే ఐదుసార్లు భూమి కంపించడంతో అనేక గ్రామాల ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లేందుకే భయపడుతున్నారు. ఇంటిబయట వీధుల్లోనూ, చెట్లకింద ఎక్కువసేపు గడుపుతున్నారు. ఐదుసార్లు కంపించిన భూమి ఇటీవల నేపాల్‌లో పెద్ద పెద్ద భవనాలు భూకంపంతో పేకమేడలా కూలిపోయిన దృశ్యాలు జనా ల కళ్లల్లో ఇట్టే కనిపిస్తున్నాయి. భూకంపం అం టేనే దాని తీవ్రత అధికమా, స్వల్పమా అనేదాని గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉండదు. ఏడాది వ్యవధిలోనే 28సార్లు భూమి కంపిస్తే దాని ప్రభావం ఆ ప్రాంత ప్రజలపై ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఐదుసార్లు భూమి కంపించడంతో హడలిపోయా రు. వింజమూరు మండలం చాకలికొండ కేం ద్రంగా రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. గతం లో ఒకట్రెండు సెకన్లపాటు భూమి కంపించేది. కానీ క్రమేణా కంపనాల వ్యవధి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐదారు సెకన్లు పైగా భూమి కంపిస్తుండడంతో భవిష్యత్తులో ఏ ప్రమాదానికి దారితీస్తుందోనన్న ఆందోళన కని పిస్తోంది. ఏడాదిలో 28సార్లు ప్రకంపనలు ఉదయగిరి నియోజకవర్గంలో మొదటిసారిగా 2015 అక్టోబరు 9వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో నాలుగుసార్లు భూమి కంపించింది. అప్పటినుంచి నేటివరకు 28సార్లు సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి మండలాలలో భూప్రకంపలు వచ్చాయి. అక్టోబరు 16, 21 తేదీల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో అనేకసార్లు భూమి కంపించింది. నవంబరులో రెండుసార్లు, డిసెంబరులో మూడుసార్లు ఇదే తరహా లో భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో ఐదుసార్లు కంపించింది. ఫిబ్రవరిలో రెండుసార్లు, మార్చిలో రెండుసార్లు కంపించింది. పది రోజుల క్రితం అర్ధరాత్రి దుత్తలూరు, ఉదయగిరి మండలాల్లో కంపనాలు వచ్చాయి. తాజాగా శని వారం ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మం డలాల తోపాటు ఆత్మకూరు, సంగం మర్రిపా డు, ఏఎస్‌పేట, పొదలకూరు మండలాల్లో ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఐదుసార్లు భూమి కంపించింది. సిస్మోగ్రాఫిక్ అధికారుల సందర్శన అనేకసార్లు భూప్రకంపనాలు రావడంతో జిల్లా కలెక్టర్ హైదరాబాద్‌లోని సిస్మోగ్రాఫిక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఏడాది జనవరి చివరి వారంలో మూడురోజులపాటు వరికుంట పాడు, దుత్తలూరు, వింజమూరులోని పలు గ్రా మాల్లో పర్యటించారు. వింజమూరులో, వరి కుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో భూకంపలేఖినిలు ఏర్పాటు చేశారు. భయపడాల్సిన అవసరం లేదు : ఇన్చార్జి కలెక్టర్ ఇంతియాజ్ ఉదయగిరి,కొండాపురం, కలిగిరి, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల తహసీల్దార్లు,కావలి, ఆత్మకూరు ఆర్డీవోలతో శనివా రం సాయంత్రం భూకంపంపై ఇన్చార్జ్ కలెక్టర్ ఇంతియాజ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విం జమూరు మండలం చాకలికొండ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైందని ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు. 5.0 లోపు వచ్చే ప్రకంపనాలపై ఆం దోళన చెందాల్సిన అవస రం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని తహసీల్దార్లకు సూచించారు. వరి కుంటపాడు ఇన్చార్జ్ తహసీల్దార్ వాకా శ్రీనివాసులురెడ్డి సాక్షితో మాట్లాడుతూ మండలంలో భూకంప తీవ్రత ఈసారి కాస్త ఎక్కువగా ఉందన్నారు. 5.0లోపు వచ్చే ప్రకంపనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.