నోయిడా: వంద మీటర్ల ఎత్తయిన జంట సౌధాలను నేలమట్టం చేసే సందర్భాన్ని పరిశోధకులు తమ అధ్యయనం కోసం వినియోగించుకున్నారు. భవిష్యత్ పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు ఈ బహుళ అంతస్తుల భవంతులను ఎంచుకున్నారు.
వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ విధానంలో నోయిడా సెక్టార్93ఏలోని జంట భవనాలను ఆదివారం నేలమట్టంచేయడం తెల్సిందే. పేలుడుపదార్ధాల ధాటికి భవనం నేలను తాకే క్రమం, శిథిలాలు సమీప ప్రాంతాలపై చూపే ప్రభావం, తదితర సమగ్ర సమాచారం సేకరించారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజ్ కెమెరాలతో సంఘటనను అన్ని వైపుల నుంచీ షూట్‌చేశారు.
చదవండి: (నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి)
పేలుడు ప్రభావాన్ని అంచనావేసేందుకు 20 అత్యాధునిక సిస్మోగ్రాఫ్‌లు, 10 బ్లాక్ బాక్స్‌లను ఆ భవనాల్లోనే బిగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్త దేబీ ప్రసన్న చెప్పారు. పేలుడు ధాటికి భూమి కంపనాలను గణించేందుకు సిస్మోగ్రాఫ్‌లను వాడారు. జెట్ డెమోలీషన్స్ అండ్ ఎడిఫీస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ భవనాలకు పేలుడుపదార్థాలు అమర్చి పేల్చేసింది.
బ్లాక్ బాక్స్
బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు.
చదవండి: (నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!)
Comments
Please login to add a commentAdd a comment