illegal constructions collasped
-
గండిపేట్‌లో అక్రమ నిర్మాణలపై హైడ్రా ఉక్కుపాదం
సాక్షి, రంగారెడ్డి: గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానాపూర్‌లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యజమానులు వ్యాపార సముదాయాలను నిర్మించారు. దీంతో తెల్లవారుజామున నుంచే కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి విచ్చిన హైదరాబాద్ సిటీతోపాటు, శివారులోని అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రాను (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన అధికారులు కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన నేలమట్టం చేస్తున్నారు. -
వరంగల్ వరద ముంపు విముక్తికి తెలంగాణ సర్కార్ చర్యలు
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ వరద ముంపు విముక్తికి తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. నాలాల కబ్జా, అక్రమ నిర్మాణాల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. నష్ట నివారణకై మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు నాలాల చుట్టూ ఉన్న నిర్మాణాల తొలగింపుకు మార్కింగ్ ఇచ్చి కూల్చివేత పనుల్లో నిమగ్నమయ్యారు. నయీమ్ నగర్ నాలా నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే నాలాలను ఆనుకుని నిర్మాణాలు చేపట్టిన వారు ఆక్రమణల తొలగింపు చర్యలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య నాలాల కబ్జా తొలగింపు పనులను అధికారులు చేపట్టారు. ఇటీవల కురిసిన కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించగా, వీధులు వాగులుగా మారాయి. వరంగల్‌లో భారీ వర్షంతో వరదలు పోటెత్తి పలు కాలనీలు జలమయం కావడంతో అపార నష్టం సంభవించిన విషయం తెలిసిందే. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
నోయిడా ట్విన్ టవర్స్‌లో అత్యాధునిక సిస్మోగ్రాఫ్, బ్లాక్ బాక్సులు
నోయిడా: వంద మీటర్ల ఎత్తయిన జంట సౌధాలను నేలమట్టం చేసే సందర్భాన్ని పరిశోధకులు తమ అధ్యయనం కోసం వినియోగించుకున్నారు. భవిష్యత్ పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు ఈ బహుళ అంతస్తుల భవంతులను ఎంచుకున్నారు. వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ విధానంలో నోయిడా సెక్టార్93ఏలోని జంట భవనాలను ఆదివారం నేలమట్టంచేయడం తెల్సిందే. పేలుడుపదార్ధాల ధాటికి భవనం నేలను తాకే క్రమం, శిథిలాలు సమీప ప్రాంతాలపై చూపే ప్రభావం, తదితర సమగ్ర సమాచారం సేకరించారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజ్ కెమెరాలతో సంఘటనను అన్ని వైపుల నుంచీ షూట్‌చేశారు. చదవండి: (నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి) పేలుడు ప్రభావాన్ని అంచనావేసేందుకు 20 అత్యాధునిక సిస్మోగ్రాఫ్‌లు, 10 బ్లాక్ బాక్స్‌లను ఆ భవనాల్లోనే బిగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీబీఆర్ఐ) శాస్త్రవేత్త దేబీ ప్రసన్న చెప్పారు. పేలుడు ధాటికి భూమి కంపనాలను గణించేందుకు సిస్మోగ్రాఫ్‌లను వాడారు. జెట్ డెమోలీషన్స్ అండ్ ఎడిఫీస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ భవనాలకు పేలుడుపదార్థాలు అమర్చి పేల్చేసింది. బ్లాక్ బాక్స్ బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!) -
నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!
-ఎస్.రాజమహేంద్రారెడ్డి రెండు ఆకాశ హర్మ్యాలు.. ఒకటి 32 అంతస్తులు, మరొకటి 29 అంతస్తులు. 12 సెకండ్లలో నేలమట్టమయ్యాయి. నోయిడా జంట టవర్ల నిర్మాణానికి అయిన ఖర్చు రూ.70 కోట్లు. కూల్చడానికి అయిన ఖర్చు రూ.20 కోట్లు. వెరసి అక్షరాలా మొత్తం రూ.90 కోట్లు 12 సెకండ్లలో మట్టిలో కలిసిపోయాయి. అక్రమ కట్టడం కుప్పకూలింది. అక్రమార్కులకు ఇదో పెద్ద హెచ్చరిక అని అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ, ఈ అక్రమ కట్టడం ఆకాశం ఎత్తు లేచే వరకు సాయం చేసిన అధికారులను ఏం చేశారు? వాళ్లనెలాగూ కూల్చలేం. కనీసం వాళ్ల ఉద్యోగాలనైనా కూల్చారా? కోర్టులు ఈ విషయంలో చొరవ తీసుకున్నట్టు లేదు. ప్రభుత్వాలు నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నాయి. టవర్లు కోర్టు ఆదేశానుసారం కూలిపోయాయి. శిథిలాలు పోగయ్యాయి. ఎంత ఇంకో మూడు నెలల్లో శిథిలాలను తొలగిస్తాం అని నోయిడా మున్సిపల్ అధికారులు మాటిచ్చేశారు. తాము ఖర్చు పెట్టిన రూ.20 కోట్లలో(కూల్చడానికి) టవర్ల నిర్మాణానికి వాడిన స్టీల్‌ను అమ్ముకుంటే రూ.15 కోట్లయినా వస్తాయని వారి అంచనా. మరి ఈ జంట టవర్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎటుపోవాలి? వారు అప్పో సప్పో చేసి ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారు. ఇంకా నెలసరి వాయిదాలు(ఈఎంఐలు) చెల్లిస్తూనే ఉంటారు. వీరి గోస ఎప్పుడు తీరేనూ? ఢిల్లీలో సొంతింటి కల నెరవేర్చుకోలేక శివార్లలో ఉన్న నోయిడాలో కాస్త తక్కువ ధరకు ఈ కోరిక తీర్చుకొని ఉంటారు. ఈ రెండు టవర్లను(అపెక్స్, సెయాన్) నిర్మించిన సూపర్‌టెక్ కంపెనీ ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.180 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ డబ్బంతా నిరాశ్రయులైన ఫ్లాట్ యజమానులకు తిరిగి చెల్లించాలి. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బోపన్న, జస్టిస్ పార్దీవాలాల ధర్మాసనం ఈ నెల 26న ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తూ ‘కొనుగోలుదారులందరికీ వారు చెల్లించిన డబ్బు మొత్తం 12% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి’’ అని సూపర్‌టెక్ సంస్థకు స్పష్టం చేసింది. ముందస్తు చర్యగా సూపర్‌టెక్ రూ.1 కోటి మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో సెప్టెంబర్ 30లోగా జమ చేయాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలు అందేది ఎప్పుడో? కోర్టు నియమించిన అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ అక్టోబర్ మొదటివారంలో సూపర్‌టెక్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై కొనుగోలుదారులకు రావాల్సిన బకాయిలను లెక్కతేల్చి సమర్పిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సూపర్‌టెక్ కంపెనీ నెలవారీ ఆదాయం రూ.20 కోట్లని, అందులో రూ.15 కోట్లను ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుందని అమికస్ క్యూరీ వివరించారు. మిగతా రూ.5 కోట్ల సొమ్మును ఫ్లాట్ల కొనుగోలుదారులకు బకాయిలు చెల్లించేందుకు వినియోగిస్తామన్నారు. 59 మంది కొనుగోలుదారులకు చెల్లించాల్సి ఉందని మిగతా వాళ్లలో చాలామందికి డబ్బు తిరిగి చెల్లించడం గానీ, వేరే టవర్లలో ఫ్లాట్ కేటాయించడం గానీ జరిగిందని సూపర్‌టెక్ యజమాన్యం వెల్లడించింది. కొనుగోలుదార్లలో చాలామందికి ఎంతోకొంత ఇంకా రావాల్సి ఉందని తెలిసింది. టవర్లయితే 12 సెకండ్లలో నేటమట్టమయ్యాయి. కానీ, చివరి కొనుగోలుదారుడికి బకాయిలు అందేసరికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశం కాబట్టి కొనుగోలుదారులందరికీ వారి కష్టార్జితం వడ్డీతో సహా అందుతుందనే ఆశిద్దాం. వడ్డీ కడుతూనే ఉన్నాం.. సెయాన్‌లో ఫ్లాట్ కొనేందుకు 2011లో రూ.26 లక్షలు అప్పు తీసుకున్నాం. అన్ని అనుమతులు వచ్చాక నిర్మాణం చేపట్టారని నమ్మాం. అందుకే అప్పు తెచ్చి మరీ కొన్నాం. అక్రమ నిర్మాణమని కోర్టులు తేల్చడంతో గుండెలో రాయి పడ్డట్టు అయ్యింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక మా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. తెచ్చిన అప్పునకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాం. పెట్టిన డబ్బంతా మా చేతికి వస్తేగానీ కుటుంబం కుదుటపడదు. – కె.వర్మ (ఉద్యోగి) కనువిప్పు కావాలి 2009లో రూ.50 లక్షలు అప్పు తెచ్చి అపెక్స్ టవర్‌లో ఫ్లాట్ బుక్ చేశా. కోరుకున్న చోట ఇల్లు కొంటున్నామన్న సంతోషం కోర్టు ఆదేశంతో నీరుగారిపోయింది. అక్రమ కట్టడమని తేల్చడానికి అన్ని రోజులు ఎందుకు పట్టిందో అర్థం కాలేదు. అనుమతులన్నీ ఉన్నాయని నిర్మాణ సంస్థ బుకాయించడం కూడా జీర్ణం కాలేదు. విధిలేక ఈ ఫ్లాట్‌కు బదులుగా సూపర్‌టెక్ సంస్థ ఇవ్వజూపిన వేరే ఫ్లాట్‌తో సరిపెట్టుకోవాల్చి వచ్చింది. కూల్చివేతతో వివాదం ముగిసినప్పటికీ డబ్బు చెల్లించాక మాకు ఇష్టమైన ఫ్లాట్‌ను పొందలేకపోయామన్న బాధ మిగిలే ఉంది. అక్రమ నిర్మాణాలకు తెగబడే బిల్డర్లకు, వారితో లాలూచీ పడి కళ్లు మూసుకొని అన్ని అనుమతులు మంజూరు చేసే అధికారులకు ఈ సంఘటన కనువిప్పు కావాలి. – గుప్తా (వ్యాపారి) ఆరంభం నుంచి నేలమట్టం దాకా.. ► 2004: నోయిడా ‘సెక్టార్ 93ఎ’లో గృహ సముదాయం కోసం సూపర్‌టెక్ సంస్థకు స్థలం కేటాయింపు (ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ సొసైటీలో) ► 2005: ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ సొసైటీ భవన నిర్మాణ ప్లాన్‌కు నోయిడా అథారిటీ అనుమతి మంజూరు. 10 అంతస్తుల చొప్పున 14 రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణానికి అనుమతి ► 2006: మరింత స్థలం కావాలన్న సూపర్‌టెక్ సంస్థ వినతికి నోయిడా అథారిటీ అంగీకారం. తొలుత అనుమతి ఇచ్చిన భవన నిర్మాణ ప్లాన్‌కు సవరణలు. 14 టవర్లకు బదులుగా మరో టవర్ నిర్మాణానికి ఓకే. దీంతో మొత్తం 15 టవర్లకు అనుమతి ఇచ్చింది. ► 2009: నిర్మాణ సంస్థ మరోసారి ప్లాన్‌ను మార్చి మరో రెండు టవర్ల(అపెక్స్, సెయాన్)ను అదనంగా చేర్చింది. అయితే, ఈ రెండు టవర్లలో 24 అంతస్తులు ఉండేటట్టుగా ప్లాన్ మార్చడంతోపాటు వెంటనే నిర్మాణం కూడా చేపట్టింది. దీనికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ► 2012: నిర్మాణ సంస్థ మరోసారి తన ప్లాన్‌ను సవరించి అపెక్స్, సెయాన్ టవర్లను 40 అంతస్తులకు పెంచింది. నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ► 2012 డిసెంబర్: ఎమెరాల్డ్ కోర్టు సొసైటీలోని కొందరు ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టుకు విన్నవిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ► 2014: జంట టవర్లను కూల్చివేయాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని నోయిడా అథారిటీని తప్పుపట్టింది. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ► 2014 మే: అనుమతులన్నీ ఉన్నాయంటూ సూపర్‌టెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ► 2021 ఆగస్టు 31: దాదాపు ఏడేళ్ల వాదోపవాదాల తర్వాత జంట టవర్లను కూల్చివేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా పని పూర్తికావాలని ఆదేశించింది. ► 2022 ఫిబ్రవరి: మే 22న కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ► 2022 మే 17: కూల్చివేత కాల పరిమితిని సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది. ► 2022 ఆగస్టు 28: జంట టవర్లు నేలమట్టం. సూపర్‌టెక్ సంస్థ నిర్మించిన 15 టవర్ల ఎమెరాల్డ్ కోర్టు హౌజింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం 650 ఫ్లాట్లు ఉన్నాయి. నేలమట్టమైన అపెక్స్, సెయాన్ టవర్లు ఇప్పటికీ నిలిచి ఉంటే మరో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు అదనంగా ఉండేవి. రూ. 31.5 లక్షలు రావాలి ‘‘నేను 2010లో సెయాన్‌లో రూ.42 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ కట్టడం అక్రమమని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే మా కుటుంబం యావత్తూ కుంగిపోయాం. బిల్డర్స్‌తోపాటు నోయిడా అథారిటీ కూడా దీనికి బాధ్యత వహించాలి. అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఎలా మంజూరు చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇదో పెద్ద అవినీతి సౌధం. 12 శాతం వడ్డీతో కలిపి నాకు రూ.80 లక్షలు బకాయిపడ్డారు. ఇందులో భాగంగా వేరేచోట ఇంకో ఫ్లాట్ ఇచ్చారు. అదిపోనూ ఇంకా రూ.31.5 లక్షలు రావాల్సి ఉంది’’ – పునీత్ (వ్యాపారి) -
గోల్మాల్ గోవిందా !
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చమగోదావరి) : అక్రమార్కులపై అధికారులు మళ్లీ కొరడా ఝుళిపించారు. పార్కింగ్ నిమిత్తం ప్లానులో చూపించిన స్థలంలోనూ దుకాణ సముదాయాలు(షాపింగ్‌మాల్) నిర్మించి సొమ్ములు చేసుకున్న వారి పనిపట్టారు. గణేష్ రైస్ మిల్లు ప్రాంతంలో అక్రమంగా మూడు అంతస్తులుగా నిర్మించిన 33 దుకాణాల సముదాయాన్ని మున్సి పల్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం కూల్చివేశారు. అక్రమార్కులు ఎంతటి వారైనా కఠినంగా ఉంటామనే సంకేతాలు పంపారు. ఇటీవలే దేవదాయ భూముల్లో ఆక్రమణల తొలగింపు గత ప్రభుత్వ హయాంలో అగ్రనేతలు మా వెనుక ఉన్నారనే అహంతో పట్టణంలోని తాళ్లముదునూరుపాడు బాల వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన భూములను భుజ బలంతో ఆక్రమించుకొని, రెక్కాడితే కాని డొక్కాడని అల్పాదాయ వర్గాల వారికి అమ్మి బురిడీ కొట్టించిన వారి వ్యవహారాన్ని ఇటీవలే దేవదాయశాఖ అధికారులు బట్టబయలు చేశారు. ఆ భూములలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను, రహదారులను ధ్వంసం చేశారు. ఆనక విషయం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లడంతో మిగిలిన తంతు తాత్కాలికంగా ఆగింది. ఇదిలా ఉంటే తాజాగా స్థానిక గణేష్ రైస్ మిల్లు ప్రాంతంలో ఉన్న వ్యాపార సముదాయానికి పార్కింగ్ స్థలంగా మున్సిపాలిటీకి చూపించి ఆ తర్వాత ఆ స్థలంలోనూ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం.. పార్కింగ్ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. దీంతో నిర్మాణదారులు అప్పటి పాలకులతో లాలూచీ చేసుకుని పార్కింగ్ స్థలంలోనూ అక్రమ నిర్మాణం చేపట్టారు. మూడు అంతస్తుల్లో 33 దుకాణాలు నిర్మించారు. మార్కెట్ ప్రాంతం కావడంతో భారీగానే అమ్మకాలు సాగించారు. ఇదే అంశంపై భవన నిర్మాణదారులు కొన్ని వర్గాలను సంతృప్తి పర్చే విషయంలో అంకెల లెక్కలు సరితూగక కౌన్సిల్లో రచ్చ కూడా సాగింది. తర్వాత షరా ‘మామూలే’ అక్రమ నిర్మాణం సజావుగా సాగిపోయింది. అధికారులు నోరు మెదపలేదు. న్యాయపరమైన ప్రతిబంధకాలను తట్టుకునేలా నిర్వాహకులు ముందుకు సాగారు. అయితే సీఎం వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాల విషయంలో రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో అక్రమ కట్టడాల తొలగింపునకు అధికారులు నడుంబిగించారు. కమిషనర్ ఆదేశాలతో రికార్డుల ఆధారంగా భవన సముదాయాన్ని కూల్చివేశారు. కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలోని 200 మంది పోలీసుల బందోబస్తు నడుమ కూల్చివేత కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశారు. అక్రమ నిర్మాణాలు కనుక కూల్చివేశాం గణేష్ రైస్ మిల్లు ప్రాంతంలో నిర్మించిన దుకాణ సముదాయాలకు పార్కింగ్ స్థలంగా చూపించి అందులోనూ మూడు అంతస్తులలో 33 దుకాణాలను నిర్మించారు. ఈ నిర్మాణాలకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతీ లేదు. దీంతో అధికారుల ఆదేశాలతో రికార్డుల ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. 4048.97 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అక్రమ నిర్మాణం సాగింది. – మధుసూదనరావు, అసిసెంటు సిటీ ప్లానర్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ -
అనధికార నిర్మాణాలపై ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం : బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి. అనధికార నిర్మాణాల్ని జేసీబీలతో కూలగొడుతుంటే.. వెన్నులో వణుకుపుట్టింది. సమ్మెటలతో నిర్మాణాల్ని ఛిద్రం చేస్తుంటే.. రానున్న రోజులు తలచుకొని కబ్జాదారులకు చెమటలు పట్టాయి. టీడీపీ ఎమ్మెల్యేల అండతో.. నిబంధనలంటే లెక్కలేనితనంతో విచ్చలవిడిగా పెరిగిన అనధికార నిర్మాణాలపై జీవీఎంసీ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి కూలగొడుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన చీఫ్ సిటీ ప్లానర్ ఆర్జే విద్యుల్లత.. ప్రతి వార్డులోనూ జల్లెడ పడుతూ.. అనధికార భవనాలపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఎక్కడ అక్రమ నిర్మాణం కనిపించినా వెంటనే కూల్చివేస్తున్నారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించినా.. అదనపు అంతస్తులు కనిపించినా పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. గురువారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో జోన్–1, 2, 3, 4, 5, 6తో పాటు అనకాపల్లిలో మొత్తం 15 భవనాలను జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చేశారు. జోన్–1 పరిధిలో 1, 3 వార్డుల్లో ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మిస్తున్న అదనపు అంతస్తుల్ని కూల్చేశారు. జోన్–2లోని కేఆర్ఎం కాలనీతో పాటు 18వ వార్డులో జీ ప్లస్–2 ప్లాన్ తీసుకొని అనధికారికంగా నిర్మిస్తున్న అంతస్తుని ధ్వంసం చేశారు. జోన్–3లో 26,27 వార్డుల్లో పెంట్ హౌస్‌తో పాటు.. అక్రమంగా ఫ్లోర్ నిర్మించేందుకు వేసిన పిల్లర్లను కూల్చేశారు. జోన్–4లోని 40, 41వ వార్డుల్లో అనధికార నిర్మాణాల్ని, జోన్–5 చిన గంట్యాడలో శ్రీనివాసా కల్యాణ మండపం భవనంలో వేస్తున్న అనధికార ఫ్లోర్‌ని పగులగొట్టారు. జోన్–6లోని పల్లి నారాయణపురం, వేపగుంటలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను కూల్చివేశారు. అనకాపల్లి జోన్ పరిధిలో గవరపాలెం, గాంధీనగర్‌లో పార్కింగ్ ప్రాంతంలో నిర్మించిన గదులతో పాటు, అనధికార ఫ్లోర్‌ని టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కూల్చివేశారు. ఈ డ్రైవ్ అనధికార నిర్మాణాలు పూర్తిగా తొలిగించే వరకూ కొనసాగుతుందని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఆర్జే విద్యుల్లత స్పష్టం చేశారు. ఇకపై జీవీఎంసీ పరిధిలో ఈ తరహా ఫిర్యాదులు రాకుండా ఉండేంత వరకూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఏసీపీలు నాయుడు, కె.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పులో కొనసాగిన కూల్చివేతలు ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ కట్టడాల తొలగింపు పక్రియ తూర్పు నియోజకవర్గంలో గురువారం కూడా కొనసాగింది. జోన్–2 టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో రెండు చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. ఆ వివరాలను జోన్–2 అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాయుడు తెలిపారు. 10వ వార్డు కేఆర్ఎం కాలనీకి చెందిన కేఎస్ నారాయణరావు చేపట్టిన అక్రమ నిర్మాణంలోని 3వ అంతస్తు శ్లాబులను తొలగించారు. 18వ వార్డులోని కె.చిన్నారావుకు చెందిన భవనం 3వ ఫ్లోర్‌ను కూడా కూల్చివేశామన్నారు. ఆరిలోవలో ఆక్రమణలపై కొరడా ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవలో అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఆరిలోవ పరిధి పెదగదిలి, చినగదిలి ప్రాంతాల్లో ఒకటో జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులు గురువారం నాలుగు అక్రమ నిర్మాణాలను తొలగించారు. పెదగదిలి సాలిపేటలో మూడో అంతస్తు, చినగదిలిలో మూడో ఫ్లోరు, దీనదయాల్పురంలో రెండు భవనాలపై మూడో అంతస్తులను అక్రమ నిర్మాణాలుగా గుర్తించి కూల్చివేశారు. సాలిపేటలో మూడు అంతుస్తుతో పాటు దానిపై అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని తొలగించారు. ఈ అక్రమ అంతస్తులన్నీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అండతో నిర్మించినవే. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వాటి వద్దకు వెళితే నేరుగా ఆయనే ఫోన్ చేసి నిర్మాణాలకు అడ్డుపడొద్దంటూ హుకుం జారీ చేసేవారు. ఇప్పుడు ఆయన చేసేదిలేకపోవడంతో అనధికార నిర్మాణాల తొలగింపు ప్రక్రియను అధికారులు సజావుగా సాగించారు. ఆరిలోవ ప్రాంతంలో ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని గుర్తించి తొలగిస్తామని బిల్డింగ్ ఇన్‌స్టెక్టర్ ఒ.వెంకటేశ్వరరావు తెలిపారు. -
కేపీహెచ్బీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కూకట్పల్లి: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ టెలిఫోన్ ఎక్స్ఛెంజ్ భవనం ఎదుట రోడ్డును ఆక్రమించుకొని ఉన్న నిర్మాణాలను బుధవారం అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డుపై నిర్మించుకున్న సుమారు 70 గుడిసెలను అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నపలంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా చెప్తున్న బేఖాతరు చేస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు.