సాక్షి, రంగారెడ్డి: గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానాపూర్‌లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యజమానులు వ్యాపార సముదాయాలను నిర్మించారు. దీంతో తెల్లవారుజామున నుంచే కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి విచ్చిన హైదరాబాద్ సిటీతోపాటు, శివారులోని అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రాను (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన అధికారులు కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన నేలమట్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment