హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా | Hydra Action Against Illegal Constructions In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా

Published Thu, Aug 15 2024 1:21 PM | Last Updated on Thu, Aug 15 2024 2:26 PM

Hydra Action Against Illegal Constructions In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరడా ఝలిపిస్తోంది. బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 

కాగా, నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో నగర శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్‌నగర్‌లలో హైడ్రా ఆధ్వర్యంలో గతవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

 

 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement