gandipet
-
రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
-
గండిపేట్‌లో అక్రమ నిర్మాణలపై హైడ్రా ఉక్కుపాదం
సాక్షి, రంగారెడ్డి: గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖానాపూర్‌లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యజమానులు వ్యాపార సముదాయాలను నిర్మించారు. దీంతో తెల్లవారుజామున నుంచే కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి విచ్చిన హైదరాబాద్ సిటీతోపాటు, శివారులోని అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రాను (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెందిన అధికారులు కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన నేలమట్టం చేస్తున్నారు. -
నిండిన గండిపేట
-
‘జీవో 111’ ట్రబుల్ వన్.. ఆ 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం జారీ చేసిన 111 జీవోను రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది కావస్తున్నా.. నేటికీ అడుగు ముందుకుపడలేదు. ప్రస్తుతం రాజధాని దాహార్తిని తీర్చేందుకు ఈ జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచి్చన 111 జీవోను రద్దు చేస్తూ గతేడాది ఏప్రిల్ 19న జీవో నంబర్ 69ను విడుదల చేసింది. జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని ప్రకటించింది. కానీ నేటికీ ఆయా గ్రామాలు హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం జీవసంరక్షణ మండలి(బయో కన్జర్వేషన్ జోన్)లోనే కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఆంక్షలే ఇప్పటికీ అమలులో ఉండడంతో నిర్మాణదారులకు ఇక్కట్లు తప్పడంలేదు. చిత్తశుద్ధిలేని కమిటీ.. కొత్త మాస్టర్ ప్లాన్‌ను సాధ్యమైనంత త్వరగా రూపొందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందుకోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని వేసింది. పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీ.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను కూడా ఖరారు చేసింది. రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను సూచించాలని అలాగే ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు విధానాలను రూపొందించాలని ఆదేశించింది. మురుగు, వరద కాల్వల నిర్మాణం, మురుగునీటి నిర్వహణ ప్లాంట్ల (ఎస్టీపీలు) ఏర్పాటు, నిధుల సమీకరణ, లేఅవుట్లు, నిర్మాణాల అనుమతికి సంబంధించిన విధివిధానాలతో పాటు న్యాయపరమైన అంశాలనూ పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు తొలిసారి భేటీ అయిన కమిటీ కేవలం ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించి మమ అనిపించింది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో జీవో 69 అమలుపై ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిర్మాణదారులకు ఇక్కట్లు.. జంట జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఆయా భూముల్లో ఇప్పటికే సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు తక్కువ ధరకు పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. ఇవే కాకుండా అనధికారిక లే–అవుట్లూ వేల సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం 111 జీవో ఎత్తివేసినందున నిర్మాణాలపై ఆంక్షల్లేవని భావించి అనుమతుల కోసం స్థానిక పట్టణ, పంచాయతీలను ఆశ్రయిస్తున్న రియల్టర్లు/భవన నిర్మాణదారులకు నిరాశే మిగులుతోంది. పర్మిషన్లు జారీ చేయకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, 111 జీవో ఇంకా మనుగడలోనే ఉందని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించడంతో 69 జీవో అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు ఏదైనా నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోసం వెళితే ఆంక్షల నెపంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, అదే పలుకుబడి ఉన్న నాయకులు, ఆమ్యామ్యాలు సమర్పించుకునే డెవలపర్లకైతే ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ సమీకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లో భూములను విక్రయించి, రూ.కోట్లు సేకరించిన ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి శివారు జిల్లాలను ఎంచుకుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 25.01 ఎకరాల భూములను విక్రయించాలని నిర్ణయించింది. మొత్తం 1,21,060 చదరపు గజాల వేలంతో సుమారు రూ.15 వేల కోట్లు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధికంగా రంగారెడ్డిలో 11.3 ఎకరాలలో 54,692 గజాలను వేలం వేయనుంది. వీటిలో కోకాపేట, గండిపేట, పుప్పాలగూడ, నల్లగండ్ల వంటి హాట్ లొకేషన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈసారి కొత్తగా వరంగల్ జాతీయ రహదారిలోనూ ప్రభుత్వ స్థలాలను వేలంలో పెట్టింది.. ఘట్కేసర్లోని కొర్రెములలో 2662 చదరపు గజాలను వేలం వేయనుంది. కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం, బౌరంపేట ప్రాంతాల్లోనూ స్థలాలను అమ్మనుంది. ఈసారి భూముల వేలం జాబితాలో వాలంతరీ, వీడీఓ, టూరిజం భూములు కూడా ఉండడం విశేషం, గతంలో ఈ భూములను ఐటీ హబ్‌కు కేటాయించాలని నిర్ణయించిన సర్కారు..తాజాగా వేలంలో పెట్టడం గమనార్హం. వేలంలో అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో బౌరంపేటలో 302 గజాలు, అత్యధికంగా పుప్పాలగూడలో 9,680 గజాల స్థలాన్ని వేలం వేయనున్నారు. తాజా వేలంలో 2 వేల గజాల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 16న రిజి్రస్టేషన్‌కు ఆఖరు గడు వు, 18న వేలం ఉంటుందని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రకటించింది. చదవండి: తగ్గిన స్థిరాస్తి లావాదేవీలు..!.. పెరిగిన ధరలు...రిజిస్ట్రేషన్ చార్జీలు మార్కెట్ రేటు రెండింతలు.. వేలంలో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే మార్కెట్ రేటు రెట్టింపుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంచనా వేసిన రూ.15 వేల కోట్ల ఆదాయ సమీకరణ సులువు అవుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా కోకాపేట, మంచిరేవుల, గండిపేట, నల్లగండ్ల వంటి ఐటీ, సంపన్నులుండే ప్రాంతంలో స్థలాల వేలం ఉండటంతో స్థానిక డెవలపర్లతో పాటు ఇతర రాష్ట్ర కంపెనీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతంలో గజానికి రూ.60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించగా.. ప్రస్తుతం మార్కెట్ విలువ అక్కడ సుమారు రూ.లక్షపైనే పలుకుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట, ఖానామెట్‌లో భూములను వేలం వేసినప్పుడు గజం రూ.1.50 లక్షలు పలకడంతో.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రారంభ ధరే రూ.1.50 లక్షలుగా నిర్ధారించారని ఓ డెవలపర్ తెలిపారు. కోకాపేట కంటే నల్లగండ్లలో నిర్ధారించిన ధర ఎక్కువగా ఉందంటే ఆయా ప్రాంతం వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉండటమే కారణమని అభిప్రాయపడ్డారు. ఘట్కేసర్ ప్రాంతంలో గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దేశించగా.. ఆయా ప్రాంతంలో అభివృద్ధి నేపథ్యంలో ఈ ధర ఎంతవరకు పలుకుతుందనేది ఆసక్తిగా మారింది. -
హైదరాబాద్ : సర్వాంగ సుందరంగా గండిపేట ఎకో పార్క్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో కొత్త పోలీస్స్టేషన్లు.. ఎక్కడంటే!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. దశాబ్ద క్రితం వరకూ శివారు ప్రాంతాలు అనుకున్నవన్నీ నేడు ప్రధాన నగరంలో కలిసిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డును దాటేసి.. రీజినల్ రింగ్ రోడ్ వైపు పరుగులు పెడుతోంది. దీంతో అదే స్థాయిలో శాంతి భద్రతలను కల్పించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సైబరాబాద్‌లో కొత్తగా నాలుగు ఠాణాలు, రాచకొండలో ఒక డివిజన్, పీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అనేది జనాభా, నేరాల సంఖ్యను బట్టి ఉంటుంది. ఐటీ కంపెనీలతో పశ్చిమ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ తదితర ప్రాంతాలు నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో శాంతి భద్రతలను పెంచాల్సిన అవసరం ఉందని ఓ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సైబరాబాద్‌లో నాలుగు పీఎస్‌లు.. సెబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దేశంలో లక్ష జనాభాకు 138 మంది పోలీసులు ఉండగా.. సైబరాబాద్‌లో 86 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు, 9 డివిజన్లలో 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మాదాపూర్ డివిజన్లోని నార్సింగి, మియాపూర్ డివిజన్లోని ఆర్సీపురం, చేవెళ్ల డివిజన్లోని శంకర్పల్లి పీఎస్‌ల పరిధిని కుదించి.. ఆయా ప్రాంతాలతో పాటూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కలిపి కొత్తగా సైబరాబాద్ కమిషనరేట్‌లో నాలుగు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో నార్సింగి పీఎస్‌లోని గండిపేట, మెకిల్ల.. ఆర్సీపురం పీఎస్‌లోని కొల్లూరు, శంకర్పల్లి పీఎస్‌లోని జన్వాడ పేరిట కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రధాన నగరంలోని పోలీస్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గడంతో పాటూ నేరాల నియంత్రణ సులువవుతుందని తెలిపారు. 2 నుంచి 3 వేల పోలీస్ సిబ్బంది కూడా.. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పోలీస్ స్టేషన్లతో పాటూ కొత్తగా రానున్న వాటిల్లో పోలీసుల నియామం చేపట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు సమాచారం. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అదనంగా 2–3 వేల మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌కు 9,403 మంది సిబ్బంది మంజూరు కాగా.. ప్రస్తుతం అన్ని ర్యాంక్‌లలో కలిపి 6,599 మంది సిబ్బంది ఉన్నారు. 2,804 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. (ట్యాంక్‌బండ్‌పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?) రాచకొండలో కొత్త డివిజన్, పీఎస్.. 5,091.48 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న రాచకొండ ఏరియా వారీగా దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్. రాచకొండలో అత్యధిక జనాభా ఉన్న ఎల్బీనగర్ జోన్ నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త డివిజన్, పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న నాగోల్‌ను ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎల్బీనగర్ జోన్‌లోని వనస్థలిపురం డివిజన్‌ను విభజించి ప్రత్యేకంగా బాలాపూర్ పోలీస్ డివిజన్ ఏర్పాటు కానుంది. వనస్థలిపురంలోని డివిజన్లోని కొన్ని ప్రాంతాలను, బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లతో పాటు, ఇబ్రహీంపట్నం డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లను కలుపుకొని కొత్తగా బాలాపూర్ డివిజన్ ఏర్పాటు కానుంది. (చదవండి: హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఫ్లైఓవర్లు) -
హైదరాబాద్ గండిపేట్ దగ్గర రోడ్డు ప్రమాదం
-
ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్
-
ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ : ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ గండిపేట చెరువుకు వెళ్లే దారిలో అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ.. దానిని ముట్టడించడానికి రేవంత్ రెడ్డి తన అనుచరులతో వెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ వద్ద అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని, వారితో పాటు అనుచరులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టు సందర్భంగా జన్వాడ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, 111 జీవోను అతిక్రమించి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్‌లు చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని రేవంత్ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఫామ్‌హౌస్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని దుయ్యబట్టారు. -
‘టీడీపీతో లాభం లేదు.. మరోసారి పొత్తు వద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆపార్టీ నేతలతో సమావేశమైయ్యారు. ఆదివారం గండిపేటలోని ఆమె ఫాంహౌజ్‌లో జరిగిన ఈ సమావేశాంలో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డితో సహా పలువురు కీలక నేతలు హాజరైయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కేవలం కొన్ని జిల్లాల్లోనే ప్రభావం చూపిందని అన్నారు. అన్ని జిల్లాల్లో పొత్తు ఉపయోగం ఉండదని తాము ముందు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని ఆమె వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. తాను లోక్‌సభకు పోటీచేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అరుణ తెలిపారు. ఓడిపోవడానికి అనేక కారణాల్లో టీడీపీతో పొత్తు కూడా ప్రధానమన్నారు. టీఆర్ఎస్ ఒక్కొక్క నేతను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ను ఓడించిందని, పాలమూరులో ఓటమిపై అనేక అనుమనాలున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, రాజగోపాల్ రెడ్డి, హరిప్రియానాయక్, హర్షవర్ధన్, జానారెడ్డి, దామోదర, సునీతా లక్ష్మారెడ్డి పొన్నాల తదితరులు హాజరైయ్యారు. -
గండిపేటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
-
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థుల బాహాబాహీ
-
సీబీఐటి దగ్గర విద్యార్థుల ఆందోళన
-
నార్సింగిలో కాల్పుల కలకలం
హైదరాబాద్: నార్సింగి మండలం గండిపేట్‌లో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. గండిపేట్ గ్రామ సర్పంచి ప్రశాంత్ ఇంటికి వచ్చిన ఆయన బంధువు వరంగల్‌కు చెందిన ప్రభాకర్‌గౌడ్ తన తుపాకీతో కాల్పులు జరిపాడని అంటున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, అది మిస్ ఫైరా? కావాలనే కాల్చాడా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇతర రాష్ట్రాల ఇసుకకు 'చెక్'
హైదరాబాద్: ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న అక్రమ ఇసుక వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వివిధ శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చెక్‌పోస్టుల నిర్వహణ కఠినతరం చేయాలన్నారు. అవసరమైతే చెక్‌పోస్టులు భారీగా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని 14 మండలాల్లో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్‌ను వెంటనే అరికట్టాలని అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ కింద గండిపేట్ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. గండిపేట చెరువు పునరుద్ధరణకు టెండర్లు పిలిచి పనులను ప్రారంభించాలని సూచించారు. రూ. 12 కోట్లతో ఫస్ట్ ఫేజ్ పనులను ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
బైక్ రేసింగ్ లో పాల్గొన్న 30 మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలో బైక్ రేసింగ్ లో పాల్గొన్న 30 మంది యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటన శివారు ప్రాంతం గండిపేట వద్ద జరిగింది. బైక్ రేసింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇందులో పాల్గొన్న 30 మంది యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి 13 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ రేసింగ్ లో పాల్గొన్న వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. -
'నేను రాష్ట్ర నాయకుడిని'
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ నగర శివారులలో టీడీపీ మహానాడు గురువారం రెండో రోజు ప్రారంభమైంది. నేడు ఎన్టీఆర్ 92వ జయంతి కూడా కావడంతో ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... పేదవాడి కనీస అవసరాలు తీర్చిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పేద వాడి కనీస అవసరాలు తీర్చిన గొప్ప నేత అని ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బడుగు, బలహీన వర్గాల వారికీ రాజ్యాధికారం కల్పించిన మహానేత ఎన్టీఆర్ అని బాలకృష్ణ అభివర్ణించారు. మహిళల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించారని బాలకృష్ణ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని బాలకృష్ణ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. నేను హిందూపురానికే పరిమితమైన నాయకుడిని కాదని... రాష్ట్ర నాయకుడినని బాలకృష్ణ స్పష్టం చేశారు. -
మహానాడు ప్రారంభించిన చంద్రబాబు
హైదరాబాద్ : నగరంలోని గండిపేటలో టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం మహానాడును ప్రారంభించారు. ఆయన ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహానాడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు ప్రసంగించనున్నారు. మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. అంతకు ముందు చంద్రబాబుకు బోనాలు, బతుకమ్మతో మహిళలు స్వాగతం పలికారు. అలాగే మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌తో పాటు రక్తదాన శిబిరాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు. -
ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులపై దాడి
హైదరాబాద్ : హైదరాబాద్ గండిపేటలోని ఓ ఫాంహౌస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. దుండగులు వృద్ధ దంపతులపై కత్తులతో దాడి చేసి రూ.40వేలు, బంగారం అపహరించుకు వెళ్లారు. కాగా గాయపడిన దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
32 మంది బైకు రేసర్ల అరెస్టు
-
32 మంది బైకు రేసర్ల అరెస్టు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నార్సింగి పరిధిలో గల గండిపేట వద్ద బైకు రేసు చేసేందుకు వచ్చిన 32 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద మొత్తం 21 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పు రావట్లేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. గండిపేట వద్ద బైకు రేసింగుకు పాల్పడుతున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు చెప్పారు. దాంతో వారు వచ్చి అక్కడికక్కడే మొత్తం 32 మందిని అరెస్టు చేశారు. వాళ్లలో కొంతమంది విద్యార్థులు, కొంతమంది యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి, కౌన్సెలింగ్ చేసిన తర్వాత వారిని విడుదల చేస్తారు. -
కుర్రకారు జోష్ కు బ్రేక్!
టీనేజీ కుర్రాళ్లు దారి తప్పుతున్నారు. సాహసాల పేరుతో చెడుదారిలో పయనిస్తున్నారు. అడ్వెంచర్ ను ఆస్వాదించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సరదాల కోసం తమ ప్రాణాలతో వాటు సాటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్ రేసింగ్ లతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కుర్రకారు జోష్ తో రోడ్డుపై జనం నడవాలంటే జంకాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో బైక్ రేసింగ్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. అర్థరాత్రి, ఉదయం వేళల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. సంపన్న వర్గాలకు నిలయమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు నెక్లెస్ రోడ్, గండిపేట చెరువు వంటి పర్యాటక పాంత్రాలు కుర్రకారు రేసింగ్ లకు అడ్డాలు మారాయి. బైకులపై మితిమీరిన వేగంతో వెళుతూ టీనేజర్లు ప్రదర్శించే విచిత్ర విన్యాసాలు ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కారు బాబులు కూడా పందాలు వేసుకుంటూ జనాన్ని భయపెడుతున్నారు. పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా బైక్ రేసింగ్ లకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా గండిపేట వద్ద బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న దాదాపు 80 మంది టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 30 బైకులను సీజ్ చేశారు. వీరిలో చాలా మంది 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. తల్లిదండ్రులు నిద్రలేవకముందే వారికి తెలియకుండా బైకులు తీసుకొచ్చి వీరు రేసింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. వారి తల్లిదండ్రులు పిలిచి మాట్లాడతామని చెప్పారు. బైక్ రేసింగ్ పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బైక్ రేసింగ్‌లు... 80 మంది విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: నగర శివారులోని గండిపేట వద్ద బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న దాదాపు 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 30 బైకులను సీజ్ చేసి, అందరిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆదివారం ఉదయమే బైక్ రేసింగ్‌లు చేస్తూ రహదారిపై వెళ్తున్న వాహనదారులతోపాటు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాంతో బైక్ రేసింగ్‌లపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన గండిపేట చేరుకుని బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారంతా విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. -
గండిపేటలో టీడీపీ మహానాడు
-
గండిపేటలో టీడీపీ మహానాడు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం గండిపేటలో వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ఆరంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు బాలయోగి, ఎర్రన్నాయుడు, లాల్‌జాన్ పాషా, పరిటాల రవి, మాధవరెడ్డిలకు నివాళులు ఆర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను, శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఎక్కడ ఉన్నా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అంతకు ముందు చంద్రబాబు ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. -
నేటి నుంచే ‘దేశం’ మహానాడు
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: మహానాడుకు మొయినాబాద్ మండలంలోని గండిపేట కుటీరం ముస్తాబైంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారపగ్గాలను దక్కించుకున్న టీడీపీ... రెండు రోజుల మహానాడును సంబరంగా నిర్వహిస్తోంది. విజయగర్వంతో ఉన్న ఆ పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లను చేసింది. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న మహానాడు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యే ఈ మహానాడులో పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఉత్సాహంగా ఉన్న రాష్ట్ర నాయకత్వం.. పార్టీ ప్రతినిధులకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఆవరణను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. మంగళ, బుధవారం జరిగే ఈ సమావేశానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లా పార్టీల అధ్యక్షులు, ఇతర కార్యవర్గ ప్రతినిధులు హాజరుకానున్నారు. పార్టీ ప్రస్థానం, విజయగాథలను వివరిస్తూ ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం, ఇతర సామాజిక సేవలకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లను ఆవరణలో ఏర్పాటు చేశారు. మంగళవారం చంద్రబాబునాయుడు ప్రారంభోపన్యాసంతో ప్రారంభమయ్యే మహానాడు.. బుధవారం సాయంత్రం ఆయన ముగింపు ఉపన్యాసంతో ముగియనుంది. -
'తెలంగాణ అమరవీరుల ఎక్స్‌గ్రేషియాపై చర్చిస్తాం'
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించే అంశంపై మహానాడులో చర్చిస్తామని తెలంగాణ టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్‌లతోపాటు ఆ పార్టీ నాయకుడు ఎల్ రమణ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా మరణించిన అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ఆయా కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా కేంద్రప్రభుత్వాన్ని కోరే అంశంపై మహానాడులో చర్చించనున్నట్లు చెప్పారు. ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్ గండిపేటలో జరగనున్న మహానాడుకు గతంలో కంటే ఎక్కువ మంది హాజరవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మహానాడుకు వచ్చే వారికి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు. -
ఆదివారపు ఆటవిడుపు