నగరంలోని గండిపేటలో టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది.
హైదరాబాద్ : నగరంలోని గండిపేటలో టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం మహానాడును ప్రారంభించారు. ఆయన ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మహానాడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు ప్రసంగించనున్నారు. మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. అంతకు ముందు చంద్రబాబుకు బోనాలు, బతుకమ్మతో మహిళలు స్వాగతం పలికారు. అలాగే మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్తో పాటు రక్తదాన శిబిరాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు.