‘టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత కనుమరుగే’ | Minister Ambati Rambabu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత కనుమరుగే’

May 28 2023 9:33 PM | Updated on May 28 2023 9:34 PM

Minister Ambati Rambabu Comments On Chandrababu - Sakshi

ఎన్టీఆర్‌ మరణానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ మరణానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం రాత్రి ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. చంద్రబాబు పదవీ దాహం వల్ల ఎన్టీఆర్‌ మరణించారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని అంబటి ప్రశ్నించారు.

‘‘టీడీపీకి ఇదే చివరి మహానాడు.. ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగే. టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. తుక్కు తుక్కయిన సైకిల్‌ను బాబు తొక్కలేరు. ఇచ్చిన వాగ్ధానాలు చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా?. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు. ఒక్క హామీనైనా నిజాయితీగా అమలు చేశారా?. వాగ్ధానాలను నట్టేట ముంచిన చంద్రబాబును ఎవరు నమ్ముతారు?. బాబు జీవితమంతా ప్రజలను మోసం చేయడమే’’ అని మంత్రి అంబటి మండిపడ్డారు.
చదవండి: చంద్రబాబు, లోకేష్‌కు కొడాలి నాని సవాల్‌

‘‘వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం. ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందా?. దోచుకు తినడమే చంద్రబాబు తెలుసు. ఎన్టీఆర్‌ బతికుంటే బాబు బతుకు బజారుపాలయ్యేది. మహానాడులో చంద్రబాబు అభూతకల్పనలు చెప్పారు. మేం చెప్పింది చేసి చూపించాం. టీడీపీ చెప్పింది ఏదీ చేయలేదు. చంద్రబాబును ప్రజలు ఎన్నటికీ నమ్మరు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement