'తెలంగాణ అమరవీరుల ఎక్స్గ్రేషియాపై చర్చిస్తాం' | Telangana issues discussed in Mahanadu, says Telugu Desam Party leaders | Sakshi
Sakshi News home page

'తెలంగాణ అమరవీరుల ఎక్స్గ్రేషియాపై చర్చిస్తాం'

Published Fri, May 23 2014 1:39 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

'తెలంగాణ అమరవీరుల ఎక్స్గ్రేషియాపై చర్చిస్తాం' - Sakshi

'తెలంగాణ అమరవీరుల ఎక్స్గ్రేషియాపై చర్చిస్తాం'

తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించే అంశంపై మహానాడులో చర్చిస్తామని తెలంగాణ టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించే అంశంపై మహానాడులో చర్చిస్తామని తెలంగాణ టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్లతోపాటు ఆ పార్టీ నాయకుడు ఎల్ రమణ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తామన్నారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా మరణించిన అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు ఆయా కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా కేంద్రప్రభుత్వాన్ని కోరే అంశంపై మహానాడులో చర్చించనున్నట్లు చెప్పారు. ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్ గండిపేటలో జరగనున్న మహానాడుకు గతంలో కంటే ఎక్కువ మంది హాజరవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మహానాడుకు వచ్చే వారికి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement