తెలుగుదేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం గండిపేటలో వైభవంగా ప్రారంభమైంది.
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం గండిపేటలో వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ఆరంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు బాలయోగి, ఎర్రన్నాయుడు, లాల్‌జాన్ పాషా, పరిటాల రవి, మాధవరెడ్డిలకు నివాళులు ఆర్పించారు.
అనంతరం పార్టీ కార్యకర్తలను, శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఎక్కడ ఉన్నా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అంతకు ముందు చంద్రబాబు ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.