నాటి బేగంపేట ఎయిర్‌పోర్ట్(ఫొటో క్రెడిట్ పి.అనురాధా రెడ్డి), (ఇన్‌సెట్‌లో చంద్రబాబు నాయుడు)
సాక్షి, హైదరాబాద్: చరిత్రంటే నారా వారిదేనని మరోసారి రుజువుచేశారు చంద్రబాబు నాయుడు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలోనైనా, భరింపశక్యంకాని గప్పాలు కొట్టడంలోనైనా తమను మించిన వారు లేరని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడం.. విశిష్టులకు నోబెల్, ఆస్కార్‌లు ఇప్పించడం.. సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్ సలహా ఇవ్వడం.. పీవీ సింధుచేత షటిల్ రాకెట్ పట్టించడంలాటి ఘనకార్యాలెన్నో చేసిన ఆయన హైటెక్ సిటీ కాకుండా ఓ బ్రహ్మాండ నిర్మాణాన్ని తాజాగా తన ఖాతాలో వేసేసుకున్నారు. అదే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్!
కట్టింది నేనే: తెలంగాణ టీడీపీ గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్ వన్‌గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్ సిటీని నిర్మించాం’’ అని రాసుకొచ్చారు. అంతే, నెటిజన్లు ఒక్కసారిగా ఘొల్లున నవ్వుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ 1930లోనే నిజాం రాజు కట్టించారు. అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదు! ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..’’ అంటూ సెటైర్లు వేశారు. తప్పును గ్రహించిన చంద్రాలు సారు కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్‌ను డిలిట్‌చేసి, ‘బేగంపేట’ ప్రస్తావన లేకుండా మరో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి...
(డిలిట్ చేసిన బాబు ట్వీట్ స్ర్కీన్‌షాట్)
బ్రీఫ్‌గా బేగంపేట చరిత్ర: 1930లో తొలుత హైదరాబాద్ ఎయిరో క్లబ్ పేరుతో నిజాం ప్రభువు బేగంపేట విమానాశ్రయాన్ని నిర్మించారు. అనంతరం దక్కన్ ఎయిర్‌వేస్ లిమిటెడ్ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయంగా వర్ధిల్లింది. 1937లో తొలి టెర్మినల్, 1972లో కొత్త టెర్మినల్ భవనాలను నిర్మించారు. 2008లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యేనాటికి బేగంపేట ఎయిర్‌పోర్ట్ దేశంలోనే అత్యంత రద్దీగల ఆరో విమానాశ్రయంగా ఉండింది. ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ ఎయిర్ పోర్ట్‌గా పిలుస్తోన్న బేగంపేట విమానాశ్రయంను ఏవియేషన్, మిలటరీ ట్రైనింగ్ కోసం, అప్పుడప్పుడూ వీవీఐపీల రాకపోకల కోసం కూడా వినియోగిస్తున్నారు.
బేగంపేట ఎయిర్‌పోర్ట్ పాతఫొటోలు కొన్ని..
తప్పు తెలుసుకున్న తర్వాత సవరించిన ట్వీట్ ఇది..
Comments
Please login to add a commentAdd a comment