రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నార్సింగి పరిధిలో గల గండిపేట వద్ద బైకు రేసు చేసేందుకు వచ్చిన 32 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నార్సింగి పరిధిలో గల గండిపేట వద్ద బైకు రేసు చేసేందుకు వచ్చిన 32 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద మొత్తం 21 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారిలో మార్పు రావట్లేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
గండిపేట వద్ద బైకు రేసింగుకు పాల్పడుతున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు చెప్పారు. దాంతో వారు వచ్చి అక్కడికక్కడే మొత్తం 32 మందిని అరెస్టు చేశారు. వాళ్లలో కొంతమంది విద్యార్థులు, కొంతమంది యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు పిలిపించి, కౌన్సెలింగ్ చేసిన తర్వాత వారిని విడుదల చేస్తారు.