
కోలీవుడ్ సినీ నటుడు అజిత్ కుమార్‌కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటుతుండటాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. సినీ నటుడు అజిత్ కొత్త అవతారం ఎత్తారు. అజిత్‌కుమార్ రేసింగ్ టీం పేరిట టీమ్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. సరికొత్త పాత్రలో రేసర్‌గా వస్తున్నట్టు అజిత్ ఆనందంగా ప్రకటించారు.
రేసర్‌గా తన ప్రయాణంలో గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. దుబాయ్‌లో త్వరలో జరగనున్న దుబాయ్ 24 హెచ్ 2025 పోటీలలో తొలిసారిగా అజిత్‌కుమార్ రేసింగ్ టీం పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల ట్రయల్ రన్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఇందులో తమిళనాడు స్పోర్ట్స్ విభాగం లోగోను ధరించి ఈ ట్రయల్ రన్‌లో దూసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.
తమిళనాడు స్పోర్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం నేతృత్వంలో క్రీడాభ్యున్నతికి జరుగుతున్న తోడ్పాటుకు మరింత బలం చేకూర్చే విధంగా అజిత్ ఆ లోగో ధరించడాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికగా తమిళనాడు స్పోర్ట్స్‌ను చాటడం గర్వించ దగ్గ విషయం అని, ఇందుకు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment