బైక్ రేసింగ్లు... 80 మంది విద్యార్థులు అరెస్ట్ | Eighty students arrest for bike racing at Gandipet in Hyderabad | Sakshi
Sakshi News home page

బైక్ రేసింగ్లు... 80 మంది విద్యార్థులు అరెస్ట్

Published Sun, Jul 27 2014 10:37 AM | Last Updated on Thu, Jul 11 2019 6:22 PM

బైక్ రేసింగ్లు... 80 మంది విద్యార్థులు అరెస్ట్ - Sakshi

బైక్ రేసింగ్లు... 80 మంది విద్యార్థులు అరెస్ట్

హైదరాబాద్: నగర శివారులోని గండిపేట వద్ద బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న దాదాపు 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 30 బైకులను సీజ్ చేసి, అందరిని పోలీసు స్టేషన్కు తరలించారు. ఆదివారం ఉదయమే బైక్ రేసింగ్లు చేస్తూ రహదారిపై వెళ్తున్న వాహనదారులతోపాటు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాంతో బైక్ రేసింగ్లపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన గండిపేట చేరుకుని బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారంతా విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement