black box
-
2 బిలియన్ డాలర్లపై బ్లాక్ బాక్స్ గురి
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ బ్లాక్ బాక్స్ వచ్చే మూడేళ్లలో ఆదాయాన్ని మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. 2 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కీలకమైన టెక్నాలజీ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ వర్మ తెలిపారు. డిజిటల్ ఇన్ఫ్రా, కనెక్టివిటీ, నెట్వర్కింగ్, సైబర్‌సెక్యూరిటీ మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్లాక్ బాక్స్ సేవలు అందిస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,233 కోట్ల ఆదాయం నమోదు చేసింది. బ్లాక్ బాక్స్ ఆదాయంలో 70 శాతం వాటా అమెరికాది కాగా యూరప్ వాటా 15 శాతంగా ఉంది. 4,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్య 7,000–8,000కు చేరే అవకాశం ఉందని, అత్యధికంగా హైరింగ్ భారత్‌లోనే ఉంటుందని వర్మ వివరించారు. -
నేపాల్ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి
నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, అర్జెంటీనా దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలం వద్ద రెస్కూ చర్యలు సోమవారం తిరిగి ప్రారంభించారు. జానపద గాయని మృతి విమానం కుప్పకూలిన ప్రమాదంలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ వెల్లడించింది. ‘పోఖారాకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారరాలో నిర్వహిస్తున్న ఓ ఈవెంట్లో పాల్గొనడం కోసం వెళ్లింది. అంతకుముందు నీరా.. అభిమానులకు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారాలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది. ఎవరీ నీరా? కాగా నేపాల్‌లోని బగ్లుండ్ ప్రాంతంలో పుట్టి పెరిగన నీరా.. కొంతకాలంగా రాజధాని ప్రాంతమైన ఖాట్మాండులో నివసిస్తోంది. జానపద పాటలలో పాపులారిటీ సాధించిన ఆమె గొంతుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జాతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్తధారణతో ఈవెంట్స్‌లో పాల్గొనే నీరా తన పాటలనుసోషల్ మీడియాలో పోస్టూ చేస్తూ ఉంటుంది. అయితే నీరా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంతో మాఘ్ సంక్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశామని నేపాల్ ఛంత్యాల్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ఘాత్రి ఛంత్యాల్ తెలిపారు. చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. బ్లాక్ బాక్స్ స్వాధీనం తాజాగా ఆర్మీ అధికారులు సంఘటన స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైందని ఖాట్మండు విమానాశ్రయ అధికారి షేర్ బాత్ ఠాకూర్ తెలిపారు. కాగా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా కాక్‌పిట్‌లో పైలెట్ల మధ్య సంభాషణను రికార్డ్ చేస్తోంది. అంతేగాక ఫ్లైట్ డేటా ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ సహాయంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..! -
నోయిడా ట్విన్ టవర్స్‌లో అత్యాధునిక సిస్మోగ్రాఫ్, బ్లాక్ బాక్సులు
నోయిడా: వంద మీటర్ల ఎత్తయిన జంట సౌధాలను నేలమట్టం చేసే సందర్భాన్ని పరిశోధకులు తమ అధ్యయనం కోసం వినియోగించుకున్నారు. భవిష్యత్ పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు ఈ బహుళ అంతస్తుల భవంతులను ఎంచుకున్నారు. వాటర్‌ఫాల్ ఇంప్లోజన్ విధానంలో నోయిడా సెక్టార్93ఏలోని జంట భవనాలను ఆదివారం నేలమట్టంచేయడం తెల్సిందే. పేలుడుపదార్ధాల ధాటికి భవనం నేలను తాకే క్రమం, శిథిలాలు సమీప ప్రాంతాలపై చూపే ప్రభావం, తదితర సమగ్ర సమాచారం సేకరించారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజ్ కెమెరాలతో సంఘటనను అన్ని వైపుల నుంచీ షూట్‌చేశారు. చదవండి: (నోయిడా ట్విన్ టవర్స్: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి) పేలుడు ప్రభావాన్ని అంచనావేసేందుకు 20 అత్యాధునిక సిస్మోగ్రాఫ్‌లు, 10 బ్లాక్ బాక్స్‌లను ఆ భవనాల్లోనే బిగించామని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీబీఆర్ఐ) శాస్త్రవేత్త దేబీ ప్రసన్న చెప్పారు. పేలుడు ధాటికి భూమి కంపనాలను గణించేందుకు సిస్మోగ్రాఫ్‌లను వాడారు. జెట్ డెమోలీషన్స్ అండ్ ఎడిఫీస్ ఇంజనీరింగ్ సంస్థ ఈ భవనాలకు పేలుడుపదార్థాలు అమర్చి పేల్చేసింది. బ్లాక్ బాక్స్ బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!) -
చైనా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు.. పైలెట్లు కావాలనే అలా...
బీజింగ్: చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణలో ఈ విషయం తెలిసింది. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ, పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిని బట్టి కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే కావాలని విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై బోయింగ్ గానీ, చైనా అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బోయింగ్ 737 మార్చి 21న గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. చదవండి👇 మీరొస్తానంటే.. నేనొద్దంటా! చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి! -
విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్‌బాక్స్.. అసలు దానికథేంటి..?
విమాన ప్రమాదం జరిగిన మనకు మెదట వినిపించే పదం బ్లాక్ బాక్స్. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో చీచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. అయితే వీరీలో బిపిన్ రావత్‌తో సహా 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కెప్టెన్ వరుణ్‌సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అందులో ఏముంటుంది అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..) నిజానికి విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ జెట్ రికార్డర్. ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఏ దిశలో ప్రయాణిస్తుంది.. ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది. రెండవది కాక్ పిట్ రికార్డర్.. అంటే విమానం నడిపే పైలెట్ తన సహ పైలెట్‌తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు) ప్రయాణ సమయాల్లో రాడార్ సిగ్నల్స్ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదానికి గురైనా విమానం వెనుక భాగం తక్కువగా నష్టపోతుంది. బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. -
ఇండోనేషియా విమాన ప్రమాదం ఫొటోలు
-
ఇండోనేషియా విషాదం: బ్లాక్ బాక్స్ ఆచూకీ లభ్యం
జకార్తా: శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఇండోనేషియా విమానానికి సంబంధించిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్ బట్టి వాటిని త్వరలోనే బయటికి తీస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా నేటి ఉదయం లాంకాంగ్, లకీ ద్వాపాల మధ్య విమాన భాగాలు, శకలాలు, మునుషులు శరీర బాగాలు, దుస్తులు లభ్యమవడంతో ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికిలేరన్న విషయం అర్థమవుతుంది. కాగా విమానం నడిపిన పైలట్లు 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారేనని అధికారులు తెలిపారు. బ్లాక్ బాక్సులను వెలికి తీసి పరిశీలించిన అనంతరం మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.(చదవండి: ఇండోనేషియాలో కూలిన విమానం?) శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. జకార్తా– పొంటియానక్ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిపోయింది. -
ఇరాన్ విమాన ప్రమాదంపై అనుమానాలు!
న్యూఢిల్లీ : ఇరాన్లో బుధవారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమాన సిబ్బందితోపాటు 176 మంది మృతిచెందారు. అయితే ఈ విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయని, ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తొలుత సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపిన ఉక్రేయిన్ ప్రతినిధులు.. ఆ తర్వాత కొద్దిసేపటికే విరుద్దమైన ప్రకటన చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. విమాన ప్రమాదం జరిగిన చోట రెండు బ్లాక్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్న ఇరాన్.. వాటిని బోయింగ్ సంస్థకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు వార్తలు ప్రచురించాయి. మరోవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్షిపణి దాడి కారణంగానే విమాన ప్రమాదం జరగి ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అలాగే రెండు రోజుల క్రితమే ప్రమాదానికి గురైన విమానానికి సాంకేతిక పరీక్షలు నిర్వహించామని బోయింగ్ సంస్థ తెలిపింది. ఇలా పలు సందేహాలు తలెత్తడంతో.. విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. -
ఆ పెట్టెలో ఏముంది?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఆయన హెలికాప్టర్లో నలుపురంగు పెట్టెను ప్రైవేటు కారులో తరలించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆ పెట్టెలో ఏముందో ప్రధాని మోదీ వెంటనే చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ‘ఈ నెల 9న చిత్రదుర్గ సభకు మోదీ హెలికాప్టర్‌కు రక్షణగా మరో మూడు హెలికాప్టర్లు వచ్చాయి. ఇవి ల్యాండ్ కాగానే ఓ హెలికాప్టర్ నుంచి నలుపురంగులో ఉన్న పెట్టెను ఇన్నోవా కారులో ఎక్కించారు. ఈ కారు ఎస్పీజీ వాహనశ్రేణిలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ పెట్టెలో భారీగా నగదు ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఇది నిజం కాకుంటే మోదీ విచారణకు సహకరించాలన్నారు. ఈ విషయమై కర్ణాటక పీసీసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆనంద్ శర్మ వెల్లడించారు. అంబేడ్కర్ జయంతి రోజున ప్రతిపక్షాలపై విమర్శలు మాని, గత ఐదేళ్లకాలంలో ఏం చేశారో దేశప్రజలకు చెప్పాలని మోదీకి సూచించారు. దమ్ముంటే రఫేల్ ఒప్పందంపై అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో జరిగిన సమావేశం మినిట్స్‌ను బయటపెట్టాలని మోదీని డిమాండ్ చేశారు. దీనివల్ల అన్ని ఆరోపణలకు ఒకేసారి తెరపడుతుందని వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల త్యాగాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంతో అప్పటి ప్రధాన ఇందిరాగాంధీ రాజకీయంగా లబ్ధిపొందారని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పడాన్ని తప్పుపట్టిన ఆనంద్ శర్మ, ఈ వ్యాఖ్యలపై సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. -
నేలకు దిగిన బోయింగ్‌లు
న్యూఢిల్లీ/అడిస్ అబబా: భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న అన్ని బోయింగ్ 737 మ్యాక్స్–8 రకం విమానాలను కిందకు దింపేశామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఖరోలా బుధవారం చెప్పారు. దీని కారణంగా స్పైస్‌జెట్‌కు చెందిన 35 విమానాల సర్వీసులు గురువారం రద్దు అవుతాయన్నారు. రద్దవుతున్న సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తమ ఇతర విమానాల్లో టికెట్లు కేటాయిస్తున్నామనీ, టికెట్లు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పైస్‌జెట్ తెలిపింది. వివిధ దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బోయింగ్‌పై నిషేధాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అన్నది నిర్ణయిస్తామనీ, అయితే దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం వెలువడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇక మరో భారతీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వద్ద కూడా ఐదు బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకం విమానాలు ఉన్నప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక ఆ సంస్థ వాటిని ఇప్పటికే నిలిపేసింది. తాజా నిషేధంతో ఆ సంస్థ సర్వీసులపై ప్రభావమేమీ ఉండదు. ఇథియోపియాలో ఇటీవల కూలిపోయిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలోని బ్లాక్ బాక్స్‌లను విశ్లేషణల కోసం యూరప్‌కు పంపనున్నట్లు ఇథియోపియా ప్రభుత్వం తెలిపింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ బ్లాక్ బాక్స్‌లను విశ్లేషించాలని తీవ్రంగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇథియోపియా ఈ నిర్ణయం తీసుకుంది. బోయింగ్ విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియాలో కూలిన విమానం బ్లాక్ బాక్స్‌లు, కాక్పిట్ల్లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవనీ, కాబట్టి వాటిని యూరప్‌కు పంపుతున్నామని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు. అయితే యూరప్‌లో ఏ దేశానికి పంపాలో గురువారం నిర్ణయిస్తామన్నారు. -
బ్లాక్ బాక్స్ కోసం శోధన
విశాఖ నుంచి అండమాన్ వైపు వెళ్లొస్తున్న నేవీ విమానాలు అంతుచిక్కని జాడ... ఇంకా కొనసాగుతున్న సెర్చింగ్ దిక్కుతోచని స్థితిలో ఎన్ఏడీ ఉద్యోగుల కుటుంబాలు గోపాలపట్నం : ఎయిర్‌ఫోర్స్ విమానం ఏఎన్–32తో గల్లంతైన ఎన్ఏడీ ఉద్యోగుల క్షేమ సమాచారం ఇంకా తెలియడం లేదు. ఆ విమానానికి మూలాధారమైన బ్లాక్‌బాక్స్ ఎక్కడుందో తెలుసుకునేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సు, కోస్టుగార్డు సంస్థలు విశ్వప్రయాత్నాలు చేస్తున్నాయి. గత పది రోజులుగా అండమాన్ తీరం వైపు వాతావరణం మబ్బులు, భారీ వర్షంతో అనుకూలించకపోవడంతో శోధనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు ఈ నెల 22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానంతో గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి ఈ సంఘటన జరిగి పదమూడు రోజులైపోయాయి. అయినా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిష్టాత్మకంగా అన్వేషణ విమానం గల్లంతు సంఘటనను కేంద్ర రక్షణ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా శోధించడానికి విశ్వప్రయత్నాలూ సాగిస్తోంది. ప్రధానంగా అండమాన్ సంద్రంపై నుంచి వెళ్తున్న ఎయిర్‌ఫోర్సు విమానానికి ఎక్కడ సిగ్నల్ తప్పింది... తప్పితే ఏ దిశగా వెళ్లి ఉండొచ్చు... విమానం సంద్రంలో మునిగిపోతే ఎక్కడ పడి ఉంటుందన్న కోణాల్లో గాలిస్తున్నారు. ప్రధానంగా గల్లంతైన విమానంలో అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్‌ను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాయిస్ రికార్డర్, పైలెట్ సంభాషణలు, రాడార్ కమ్యూనికేషన్ వ్యవస్థతో సంబంధాలుండడం బ్లాక్‌బాక్స్ ప్రత్యేకత. దీనికి దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల లోతున రేడియేషన్ సిగ్నల్ ఉంటుంది. ఈ తరుణంలో విమానం సంద్రంలో గల్లంతైనా ఎక్కడుండి ఉంటుందనే దిశగా శోధిస్తున్నారు. ఇప్పటికే దేశ నలుమూలల నుంచీ పలు రకాల షిప్‌లు, సబ్మెరైన్లు సంద్రంలో గాలిస్తుండగా, విశాఖ ఐఎన్ఎస్ డేగా నుంచి రెండు హెలికాఫ్టర్లు, మరో విమానం గాలింపునకు వెళ్లొస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విమానాలు, సబ్మెరైన్ల ద్వారా సోనోబోయ్ అనే పరికరాన్ని నీటిలో వదలడం ద్వారా కూడా బ్లాక్ బాక్సుని శోధించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ నాలుగు వేల కిలోమీటర్ల వరకూ అందుకునే వీలుండడం, బ్లాక్‌బాక్స్‌కి బ్యాటరీ శక్తి నెల రోజుల వరకూ ఉండడం వంటి పరిణామాలపై ఆశతో త్వరగా ఛేదించాలని నేవీ, కోస్టుగార్డు, ఎయిర్‌ఫోర్సు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇస్రో పరిశోధనా సంస్థలో కీలకంగా ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నిపుణులు కూడా బ్లాక్‌బాక్స్ కోసం జలాంతర్గాములకు శాటిలైట్ సంకేతాలిస్తూ తమ వంతు సహకరిస్తున్నట్లు సమాచారం. సంద్రంలో కోటానుకోట్ల రాళ్లురప్పల మధ్య బ్లాక్ బాక్స్‌ని పట్టుకోవడం అంత సులువుగా జరిగే పనికాదని కొందరు భావిస్తున్నారు. ఎన్ఏడీ చరిత్రలో తొలిసారి ఎన్ఏడీ నుంచి అండమాన్‌కు షిప్‌లలో ఆయుధాల మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా సిబ్బంది నాలుగైదు సార్లు వెళ్లొస్తుంటారు. అత్యధికంగా షిప్లలోనే వెళ్తుంటారు. వీలు దొరికినపుడు విమానాల్లో వెళ్తుండడం అరుదుగా జరిగింది. అయితే గతంలో ఎప్పుడూ ఏ రకమైన ప్రమాదమూ జరగలేదు. ఈ సారి విమానం గల్లంతవడంతో వారి కుటుంబీకుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అధికారులూ స్పందించక... అయిన వారి జాడ తెలియక క్షనమొక యుగంలా గడుపుతున్నారు. -
ఆ విమానంలో ఏఎల్టీ కూడా లేదు!
ముందుకు సాగని ఏఎన్-32 గాలింపు సాక్షి ప్రతినిధి, చెన్నై: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం ఇటీవల గల్లంతవడం, అందులోని పలు లోపాలు బయటపడటం తెలిసిందే. అయితే విమానాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరం(ఏఎల్టీ) కూడా లేదన్న విషయం మంగళవారం బయటపడింది. సముద్రంపై ప్రయాణించే, సైనిక విమానాలకు ఏఎల్టీని అమరుస్తారు. నీటి అడుగుభాగంలో విమానం ఉన్నట్లయితే ఈ పరికరం నుంచి సిగ్నల్స్ వెలువడి విమానాన్ని గుర్తించవచ్చు. వీటిని ప్రస్తుతానికి సీ130జే, సీ17 విమానాల్లోనే వినియోగిస్తున్నారు. కానీ వీటిని అన్ని రకాల విమానాలకు ఉపయోగించడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో కేంద్ర రక్షణ శాఖ కొని ఉంచింది. ఏఎన్ 32 రకం విమానాల్లో దేనికీ ఈ పరికరాన్ని అమర్చలేదని తెలుస్తోంది. ఈ పరికరమే ఉన్నట్లయితే ఈ పాటికి విమానాన్ని గుర్తించి ఉండే వారిమని గాలింపు చర్యల్లో పాల్గొంటున్న ఓ అధికారి తెలిపారు. గల్లంతయిన విమానం చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ విమానానికి ఏడేళ్ల క్రితమే కాలం చెల్లింది. అలాగే గల్లంతవడానికి వారం రోజుల ముందే 3 సార్లు మరమ్మతులకు గురైంది. -
మెట్రోరైల్లో బ్లాక్‌బాక్స్‌లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెట్రోరైల్ ప్రయాణం ఇక మరింత సురక్షితం. ప్రమాదాలను నమోదు చేయగల విమాన తరహా బ్లాక్‌బాక్స్‌లను చెన్నై మెట్రోరైళ్లలో అమర్చారు. సుందర చెన్నైని మరింత సుందరంగా మారుస్తూ నిర్మితమైన మెట్రోరైల్ గత ఏడాది జూన్ 29న ప్రారంభమైంది. మొత్తం 45.1 కిలోమీటర్ల దూరం కారిడార్‌కు గాను తొలిదశగా 10 కిలోమీటర్లను ప్రారంభించారు. కోయంబేడు-ఆలందూర్ మధ్య మాత్రమే తిరిగే ఈ మెట్రో రైళ్లకు అధిక చార్జీలు వసూలు చేయడం వల్ల ఆశించినంత ఆదరణ లభించలేదు. మెట్రోరైలు ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఈ 9 నెలల కాలంలో ఓ మోస్తరుగా పుంజుకోవడంతో యాజమాన్యం కొత్త అంశాలపై దృష్టి పెట్టింది. బ్లాక్‌బాక్స్‌ల అమరిక: విమానం తరహాలో చెన్నైలో పరుగులు తీసే మెట్రోరైళ్లలో బ్లాక్‌బాక్స్‌లను ఇటీవలే అమర్చారు. విమానంలోని బ్లాక్‌బాక్స్‌ల వలెనే ఇవి కూడా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తాయి. విమానాల్లో డేటా రికార్డర్ అనే బ్లాక్‌బాక్స్‌ల ఏర్పాటు ఉంటుంది. విమానానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆ బ్లాక్బ్లాక్స్లు తనంత తానుగా రికార్డు చేస్తుంటాయి. విమానం ప్రమాదానికి గురైన పక్షంలో ఆ బ్లాక్‌బాక్స్‌ను సేకరించి దానిలో రికార్డయిన అంశాలద్వారా కారణాలను విశ్లేషిస్తారు. ఇలా విమానాల్లోని బ్లాక్‌బాక్స్ మాదిరే మెట్రోరైళ్లలో ఈవీఆర్ అనే ఈవెంట్ రికార్డర్ అనే సాధనాన్ని అమర్చారు. ఈ సాధనం మెట్రోరైల్ కంట్రోలు రూమ్, నిర్వాహకుల నెట్వర్క్ సిస్టమ్‌తో అనుసంధానమై ఉంటుంది. రైలు ప్రయాణించే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే వాటిని ఈవీఆర్ వెంటనే కనుగొని డ్రైవర్ దృష్టికి తీసుకెళుతుంది. అలాగే మెట్రో రైలులో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీని సైతం ఒకటిగా సేకరించి నెట్వర్క్ వీడియో రికార్డరు అనే సాధనంలోకి చేరుస్తుంది. ఇన్ని కోణాల్లో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఏదేని కారణాల చేత ప్రమాదం చోటుచేసుకున్న పక్షంలో ఈ రికార్డు ద్వారా అందే సమాచారంతో అదే రకమైన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ సహాయ మేనేజర్ ఆర్ శ్రుతిశాంభవి తెలిపారు. -
ఆ విమానం బ్లాక్ బాక్స్ దొరికింది
జకార్తా: ఇండోనేసియా రాజధాని జకర్తాలోని పుపువా ప్రాంతంలో ఆదివారం కూలిపోయిన ట్రిగానా విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ని కనుగొన్నారు. ఈ మేరకు ఇండోనేసియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జె.ఎ. బరత మంగళవారం వెల్లడించారు. పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగానా ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొండను ఢీకొని కూలిపోయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన 33 నిమిషాలకే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం మొత్తం 54 మంది ఉన్నారు. వీరిలో 49 మంది ప్రయాణికులు, కాగా ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు శిశువులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలోని మొత్తం 54 మృతదేహలను గుర్తించామని నేషనల్ సెర్చి అండ్ రెస్క్యూ అఫీస్‌కు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. -
రెండో బ్లాక్ బాక్స్ దొరికింది
మార్సిలె: ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన జర్మన్వింగ్స్ విమానంలోని రెండో బ్లాక్ బాక్స్ దొరికింది. తొమ్మిది రోజుల గాలింపు తర్వాత ఇది లభ్యమైంది. ఇందులో రికార్డయిన సమాచారం ఆధారంగా ఈ ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశముంది. రెండో బ్లాక్ బాక్స్ లో విమానానికి సంబంధించిన సాంకేతిక సమాచారంతో పాటు ప్రమాదానికి ముందు చివరి నిమిషాల్లో ఏం జరిగిందనేది వెల్లడికానుంది. కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేశాడని అంతకుముందు దొరికిన మొదటి బ్లాక్ బాక్స్ లోని సమాచారం ఆధారంగా నిర్ధారణకు వచ్చారు. అతడు మానసిక రోగి అని తేల్చారు. తన పేరు విశ్వమంతటా మారు మోగిపోవాలన్న దుష్టచింతనతో అతడీ ఘోరకృత్యానికి పాల్పడ్డాడు. -
సముద్రంలో విమానం తోక
ఏయిర్ ఆసియా విమానానిదేనని ధ్రువీకరణ జకార్తా/సింగపూర్: జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఆసియా విమానం తోక భాగాన్ని బుధవారం గుర్తించారు. దీంతో ప్రమాద కారణం తెలుసుకోవడానికి వీలు కల్పించే బ్లాక్‌బాక్స్ స్వాధీనంపై ఆశలు పెరిగాయి. బ్లాక్ బాక్స్ విమానం తోక భాగంలోనే ఉంటుంది. తోక భాగంలో ఒక సిగ్నల్‌ను గుర్తించామని, అయితే డైవర్లు దాన్ని మరోసారి గుర్తించలేకపోయారని అధికారులు చెప్పారు. సిగ్నల్ గుర్తించడంతో బ్లాక్స్ బాక్స్ కూడా దొరుకుందని భావిస్తున్నారు. ‘విమానం చివరిసారిగా కనిపించిన ప్రాంతానికి 30 కి.మీ. దూరంలో విమాన తోక భాగం కనిపించింది. దానిపై ఎయిర్ ఆసియా అక్షరాలు ఉన్నాయి. సముద్ర గర్భంలో తీసిన ఫొటోల్లోని విమానం ప్రమాదానికి గురికాకముందు తీసిన విమానం మాదిరే ఉంది. అది ఎయిర్ ఆసియా విమానానిదేనని ధ్రువీకరిస్తున్నాను’ అని ఇండోనేసియా జాతీయ అన్వేషణ, సహాయక సంస్థ చీఫ్ బాంబంగ్ సొలలిస్తియో జకార్తాలో తెలిపారు. గత నెల 28న ఇండోనేసియా నుంచి 162 మంది తో సురబయ వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానం అదే రోజు సముద్రంలో కూలడం తెలిసిందే. ఇప్పటివరకు 40 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీశారు. మిగతా మృతదేహాలు విమానంలోపలే చిక్కుకుని ఉంటాయని భావిస్తున్నారు. గాలింపు ప్రాంతాన్ని విస్తరించారు. 30 మీటర్ల లోతులో 10 అడుగుల పొడవున్న తోక భాగాన్ని వెలికి తేసేందుకు భూగర్భ వాహనాన్ని వినియోగించనున్నారు. -
ఇంకా వీడని మిస్టరీ
లభించని బ్లాక్‌బాక్సు సముద్ర ఉపరితలంపై 5 కి.మీ. పరిధిలో విమాన శకలాలు జకార్తా: వారం రోజులు కావొస్తున్నా ఎయిర్ ఆసియా విమాన ప్రమాదం మిస్టరీ వీడడం లేదు. బ్లాక్‌బాక్సు దొరకకపోవడంతో అసలు ఈ దుర్ఘటనకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదు. ప్రతికూల పరిస్థితుల వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మృతదేహాల కోసం అన్వేషక బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. ఇప్పటిదాకా 30 మృతదేహాలను గుర్తించారు. సముద్రపై ఐదు కి.మీ. పరిధిలో విమాన శకలాలు తేలియాడుతున్నాయి. విమానం సముద్ర గర్భంలో చేరడంతో చాలామంది ప్రయాణికులు వారి సీట్లలోనే కన్నుమూసి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘బలమైన గాలులు వీస్తున్నాయి. ఆదివారం వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కడలి అల్లకల్లోలంగా ఉండడంతో అలలు నాలుగు మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి. శుక్రవారం వరకు 30 మృతదేహాలు గుర్తించగా.. 21 భౌతికకాయాలను స్వాధీనం చేసుకున్నాం. విమానం అతిపెద్ద శకలాన్ని, బ్లాక్‌బాక్సును గుర్తించే గురుతర లక్ష్యాలు మా ముందున్నాయి’ అని ఇండోనేసియా జాతీయ సహాయక, అన్వేషణ విభాగం చీఫ్ సొలిస్టియో తెలిపారు. పెద్ద విమాన శకలాన్ని గుర్తించేందుకు వీలుగా నేవీకి చెందిన నౌకలు అన్వేషణ కొనసాగిస్తున్నాయన్నారు. 90 నౌకలతోపాటు అనేక విమానాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయన్నారు. ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్, అమెరికాకు చెందిన నిపుణులు అత్యాధునిక పరికరాలతో గాలింపు చేపడుతున్నారన్నారు. సహాయక చర్యల కోసం 72 మంది సిబ్బందితో కూడిన రెండు రష్యా విమానాలు మలేసియా చేరుకున్నాయి. స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో ఎనిమిదింటిని సురబయకు చేరవేశారు. వేలిముద్రల ఆధారంగా ముగ్గురిని ఇండోనేసియాకు చెందినవారిగా గుర్తించారు. -
బ్లాక్ బాక్స్ కోసం మరో వారం అగవలసిందే!
జకార్తా/సింగపూర్: సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ కోసం మరో వారం రోజులు ఆగవలసిందేనని ఇండోనేషియా అధికారులు చెప్పారు. ఆ బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 8501 కూలిపోయిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం ఐదో రోజు గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విమానంలో 162 మంది ఉండగా, ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు సాధ్యం కావడంలేదు. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బలమైన అలల వల్ల విమాన శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి. -
అల్జీరియా విమాన శకలాలు లభ్యం
విమానంలోని 116 మంది మృతి పారిస్: ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో కూలిపోయిన అల్జీరియా విమానం శకలాలు లభించాయి. బర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు బుధవారం అర్ధరాత్రి బయలుదేరిన 50 నిమిషాలకే ఈ విమానం మాలిలోని గోస్సి ప్రాంతంలో కూలింది. విమానంలోని 116 మంది మృతిచెందారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండె ప్రకటించారు. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నా ఉగ్ర దాడి సహా ఏ కోణాన్ని తోసిపుచ్చలేమన్నారు. ఈ ప్రమాదంలో 51 మంది తమ దేశ జాతీయులు మృతిచెందారన్నారు. తమ బలగాలు ఘటనాస్థలికి చేరుకొని విమాన శకలాల సమీపంలో పడిఉన్న బ్లాక్‌బాక్స్‌ను గుర్తించాయన్నారు -
దేశాల పోరులో సామాన్యులే సమిధలా?
రాజ్యాల ఆధిపత్య పోరులో అమాయకుల ప్రాణాలు గాల్లోనే బూడిదయ్యాయి. దేశాల మధ్య రాజుకున్న విభేదాలు వందల మంది పౌరుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్ ఆధిపత్య యుద్ధం ఆకాశాయానం చేస్తున్న 295 మంది అమాయక పౌరుల ప్రాణాలను తోడేసింది. రష్యా సరిహద్దుల్లో కొనసాగుతున్న సమరంలో విమాన ప్రయాణికులు పావులుగా మారి మృత్యువాత పడ్డారు. ఆదిమ కాలం నుంచి ఆధునిక యుగం వరకు రాజ్యాల పోరులో అమాయక పౌరులే బలవడం ఆనవాయితీగా మారిపోయింది. ఆధునికతకు శిఖరాగ్రమని చెప్పుకుంటున్న నేటి కాలంలోనూ పరిస్థితి మార్పు రాకపోవడం దురదృష్టకరం. ఇందుకు కారణాలనేకం. ఏదేమైనా చరిత్ర పుటల్లో మరో నరమేధం నమోదయింది. మలేసియా నాలుగు నెలల స్వల్ప కాలంలోనే రెండో విమాన ప్రమాదాన్ని చవిచూసింది. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం తప్ప మనమేం చేయగలం. విమాన దుర్ఘటన మృతులకు 'సాక్షి' సంతాపం తెలుపుతోంది. దీనికి కారణం ఉగ్రవాద దాడి అని భావిస్తున్నారా? దేశాల మధ్య పోరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. -
'కూలిన విమానంలో భారతీయులు లేరు'
-
'కూలిన విమానంలో భారతీయులు లేరు'
న్యూఢిల్లీ: కూలిపోయిన మలేషియా విమానంలో భారతీయులు లేరని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన విమానసిబ్బంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇందులోని సమాచారం ఆధారంగా విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకోనున్నారు. మరోవైపు ఉక్రెయిన్ మీదుగా విమాన రాకపోకలను విమానసంస్థలు నిలిపేశాయి. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందారు. -
ఎంహెచ్ 17: గుట్టు విప్పనున్న బ్లాక్‌బాక్సు
మలేషియన్ విమానం కుప్పకూలింది. మొత్తం అందులో ఉన్న 295 మందీ ప్రాణాలు కోల్పోయారు. అయితే విమాన ప్రమాదానికి కారణం ఏంటి.. అందరూ చెబుతున్నట్లు నిజంగానే క్షిపణిదాడి వల్లే కుప్పకూలిందా? ఈ విషయం కచ్చితంగా తెలియాలంటే బ్లాక్‌బాక్స్‌ను పరిశీలించాలి. ఎంతటి పెను ప్రమాదం సంభవించినా కూడా బ్లాక్‌బాక్స్ మాత్రం భద్రంగా ఉంటుంది. వాస్తవానికి నారింజరంగులో ఉండే ఈ బాక్సులో మొత్తం వివరాలన్నీ రికార్డు అవుతాయి. ఇక్కడ సంభవించిన ప్రమాదంలో ఎంహెచ్17 విమానంలోని బ్లాక్‌బాక్స్‌ను ఇప్పుడు ఎవరు తెస్తారన్నది అతిపెద్ద సమస్యగా మారింది. విమాన శిథిలాలను అంతర్జాతీయ పరిశీలకుల బృందం వెళ్లి చూడాలని ఐక్యరాజ్య సమితితో పాటు మలేషియా ప్రభుత్వం కూడా కోరుతోంది. అయితే, విమానం కూలిన ప్రదేశం మీద ఆధిపత్యం కోసం ఇప్పుడు కూడా ఉక్రెయిన్, రష్యా అనుకూల దళాలు తీవ్రంగా పోరాడుకుంటున్నాయి. మరోపక్క ఆ ప్రాంతంతో పాటు బ్లాక్‌బాక్స్ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్లు డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రకటించింది. వాటిని మాస్కోకు పంపాలని భావిస్తోంది. కాగా, మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ కూడా దీనిపై స్పందించారు. అంతర్జాతీయ దర్యాప్తు బృందం అక్కడకు వెళ్లేందుకు వీలుగా మానవీయ కోణంలోఆలోచించి మార్గం సుగమం చేయాలని ఆయన కోరారు. -
ఎం హెచ్ 370 - మళ్లీ సిగ్నల్స్... మరో ఆశ... మళ్లీ వెతుకులాట
మలేషియా విమానం కోసం జరుగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకున్నట్టేనని అధికారులు నమ్మబలుకుతున్నారు. మొదట చైనా నౌక, ఆ తరువాత అస్ట్రేలియన్ నౌకలు నీటి లోపలి నుంచి సిగ్నల్స్ అందుకున్నాయి. ఈ సిగ్నల్స్ మలేషియన్ విమానం ఎం హెచ్ 370 మునిగినట్టుగా భావిస్తున్న ప్రదేశం నుంచే అందడంతో అన్వేషణలో నిమగ్నమైన సిబ్బంది ఆశలు చిగురించాయి. ఆస్ట్రేలియా కు చెందిన నౌకకు రెండు సార్లు సముద్రం లోతుల్లోనుంచి సిగ్నల్స్ అభించాయి. 'ఈ సిగ్నల్స్ బ్లాక్ బాక్సునుంచి వెలువడే సిగ్నల్స్ మాదిరిగానే ఉన్నాయి. విమానం లేదా విమాన శకలాలు త్వరలోనే లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మనం సరైన చోటే వెతుకుతున్నాం,' అన్వేషణలో ఉన్న వివిధ దేశాల ఉమ్మడి సమన్వయ సంస్థ హెడ్ అంగుస్ హౌస్టన్ చెప్పారు. ఆస్ట్రేలియన్ నౌకకు అండర్ వాటర్ సిగ్నల్స్ ను గుర్తించే పింగర్ లొకేటర్ అనే ఉపకరణం ఉంది. ఇది బ్లాక్ బాక్సు నుంచి వచ్చే సిగ్నల్స్ ను గుర్తించగలుగుతుంది. సరిగ్గా విమానం మునిగిపోయిందని భావిస్తున్న చోటే తేలియాడుతున్న పలు శకలాలు, వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో వైపు బ్లాక్ బాక్స్ కోసం సముద్రం అట్టడుగున స్పెషలిస్టు డ్రైవర్లు వెతుకుతున్నారు. మంగళవారంతో విమానం కుప్పకూలి నెల రోజులైంది. దీంతో ఏ క్షణానైనా బ్లాక్ బాక్సు నుంచి సిగ్నల్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శనివారం ఆస్ట్రేలియన్ నౌకకు అందిన తొలి సిగ్నల్ 2 గంటల 20 నిమిషాల పాటు ఉండగా, మంగళవారం అందిన సిగ్నల్స్ అయిదున్నర నిమిషాలు, ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 గత మార్చి 8 న హిందూమహాసముద్రంలో కుప్పకూలిపోయింది. దాని కోసం 15 విమానాలు, 14 నౌకలు 75,, 4237 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో, ఆస్ట్రేలియన్ నగరం పెర్తకి 2261 కి.మీ దూరంలో అన్వేషణ కొనసాగుతోంది. -
ఇది మలేషియన్ విమానం పంపిన సిగ్నలేనా?
హిందూమహాసముద్ర గర్భంలో కుప్ప కూలిన మలేసియన్ విమానం నుంచి ఎలక్ట్రానిక్ పల్స్ సిగ్నల్ రూపంలో వచ్చిందా? అది విమానం నుంచి వచ్చిన సందేశమేనా? జాడతెలియకుండా పోయిన మలేషియన్ విమానం కోసం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పలు దేశాలు అన్వేషణ జరుపుతున్నాయి. అమెరికా నుంచి ఒక ప్రత్యేక సోనార్ సెన్సార్ ఉన్న సబ్మెరీన్ కూడా ఈ గాలింపులో పాల్గొంటూంది. ఇదే సమయంలో చైనాకి చెందిన హైగ్జున్ 01 అనే పెట్రోలింగ్ పడవక హిందూ మహాసముద్ర జలాల్లోనుంచి సెకనుకు 37.5 కిలో హెర్జ్ ఫ్రీక్వెన్సీతో ఒక సిగ్నల్ వచ్చింది. మలేషియన్ విమానం ఎం హెచ్ 370 లో బ్లాక్ బాక్స్ ను తయారు చేసిన డుకానె సీకామ్ సంస్థ ఈ సిగ్నల్ విమానం నుంచి వెలువడే సిగ్నల్ కి చాలా దగ్గరగా ఉందని పేర్కొంది. గత ఇరవై ఎనిమిది రోజుల గాలింపులో లభించిన అత్యంత ముఖ్యమైన సూచనల ఇదే. ఒక వైపు బ్లాక్ బాక్స్ బాటరీ చార్జింగ్ ఇంకొన్ని గంటల్లో అయిపోతుందనగా ఈ పల్స్ సిగ్నల్ లభించడం విశేషం. ఈ పల్స్ సిగ్నల్ కూడా బ్యాటరీ చార్జింగ్ పూర్తయితే రావడం మానేస్తుంది. విమానం మార్చి 8 న అంతర్ధానమైంది. దాని కోసం పలు దేశాల నౌకలు, విమానాలు వెతుకులాట కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం పదమూడు ఎయిర్ క్రాఫ్టులు, 11 పడవలు అన్వేషణ జరుపుతున్నాయి.